హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫ్లూపై సమరం: రాజయ్యకు కేసీఆర్ క్లాస్! (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం నాడు స్వైన్ ఫ్లూ పైన సమీక్ష నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలకు అధికారులను ఆదేశించారు. కార్పోరేట్ ఆశుపత్రుల ప్రతినిధులతోను సమావేశమయ్యారు.

ఆరోగ్యశ్రీ కింద స్వైన్ ఫ్లూ చికిత్స అందించను్నారు. తక్షణ సాయం కోసం ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేశారు. కేసీఆర్ విజ్ఞప్తికి ప్రధాని మోడీ కసానుకూలంగా స్పందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్వైన్‌ఫ్లూతో ఒకే రోజు ఐదుగురు చనిపోయారనే వార్త చదివి ఇబ్బందికి గురయ్యానని కేసీఆర్‌ తెలిపారు. ప్రధానమంత్రితో మాట్లాడానని, కేంద్ర ఆరోగ్య మంత్రితోనూ మాట్లాడానని, వారి స్పందన బాగుందన్నారు. ఇద్దరికీ ధన్యవాదాలు చెప్పారు.

మంచి నిపుణుల కమిటీని పంపిస్తామన్నారని, ఔషధాలు కూడా పంపిస్తున్నారన్నారు. స్వైన్‌ఫ్లూపై ఆరుగురు వైద్యఆరోగ్య శాఖ అధికారులతో కమిటీ వేశామని, ప్రతిరోజు నిమ్స్‌ డైరెక్టర్‌ వివరాలు చెబుతారని వివరించారు. స్వైన్‌ఫ్లూ సోకిన వారు బయటికి వెళ్లకుండా 20 నుంచి 25 ఆస్పత్రుల్లో ఐసోలేటెడ్‌ వార్డులు పెడుతున్నామన్నారు.

 కేసీఆర్

కేసీఆర్

స్వైన్ ఫ్లూ పెద్ద మహమ్మారి కాదని, ఇదో థర్డ్‌క్లాస్‌ వైరస్‌ అని, చాలా సులువుగా నియంత్రించ వచ్చునని, భయం వద్దని కేసీఆర్‌ ప్రజలకు భరోసా ఇచ్చారు.

కేసీఆర్

కేసీఆర్

ఇది వ్యాధి కాదని, వైరస్‌ మాత్రమేనని కూడా అన్నారు. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నారు.

కేసీఆర్

కేసీఆర్

కనీస జాగ్రత్తలు తీసుకుంటే స్వైన్‌ఫ్లూకు బ్రహ్మాండమైన చికిత్స ఉందన్నారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులతో, మంత్రులతో, ప్రైవేటు వైద్య నిపుణులతో స్వైన్‌ఫ్లూపై సమీక్షించారు.

కేసీఆర్

కేసీఆర్

అనంతరం విలేకరులతో మాట్లాడారు. వ్యాధికి చికిత్స, నివారణ, నియంత్రణ గురించి ఒక వైద్య నిపుణుడి తరహాలో వివరించారు.

కేసీఆర్

కేసీఆర్

స్వైన్‌ఫ్లూ సోకిన రోగులు ఆస్పత్రి నుంచి కదలొద్దని, పెళ్లిళ్లు, పేరంటాలకు వెళ్లొద్దని, షేక్‌హ్యాండ్‌లు, ఆలింగనాలతో వేరేవాళ్లకు వైరస్‌ అంటించి పాపం కట్టుకోవద్దని, ఎక్కువ మంది సినిమా హాళ్లలో ఉండవద్దన్నారు.

కేసీఆర్

కేసీఆర్

స్వైన్‌ఫ్లూ తెలంగాణలో అదుపులోనే ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 19 మంది చనిపోగా... 22 మంది దాకా చికిత్స పొందుతున్నారని తెలిపారు.

 కేసీఆర్

కేసీఆర్

ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి కార్పొరేట్‌ ఆస్పత్రుల దాకా స్వైన్‌ఫ్లూపై పోరాటం చేస్తామన్నారు. తెలంగాణలోని ఆస్పత్రుల్లో 16 వేల టామీఫ్లూ టాబ్లెట్లున్నాయని చెప్పారు.

కేసీఆర్

కేసీఆర్

స్వైన్‌ఫ్లూను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తున్నామని కేసీఆర్‌ ప్రకటించారు. వైరస్‌ సోకితే బెంబేలెత్తిపోవద్దని సూచించారు. ఈ వైరస్‌ సోకకుండా వ్యాక్సిన్లు కూడా వేయించుకోవద్దని చెప్పారు.

కేసీఆర్

కేసీఆర్

దీనివల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయని తెలిపారు. టీకా వేసుకున్నా అది తగలొచ్చు. తగలకపోవొచ్చు. ట్యాబ్లెట్‌ రూపంలో ఉన్న మెడిసిన్‌ కరెక్ట్‌ అని సూచించారు.

కేసీఆర్

కేసీఆర్

కాగా, స్వైన్ ఫ్లూ నేపథ్యంలో అధికారుల పైన, ఉప ముఖ్యమంత్రి రాజయ్య పైన కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. రాజయ్య చిన్నబుచ్చుకున్నారని సమాచారం.

కేసీఆర్

కేసీఆర్

అస్వస్తతకు గురై సోమాజిగూడ యశోదాలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ భార్య శోభ ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు సీఎంతో పాటు మంత్రి కేటీఆర్‌, ఎంపీ కవిత ఆసుపత్రికి వచ్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

English summary
With more swine flu cases being reported in Telangana, Chief Minister K. Chandrasekhar Rao on Wednesday briefed Prime Minister Narendra Modi of the situation and sought the Central government’s help in tackling it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X