హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్! ఏం పుట్టింది, రాజీనామా చేసి రా!! (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మెడలు వంచి ఛాతి ఆసుపత్రిని నిలబెడతామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ సోమవారం హెచ్చరించారు. సచివాలయాన్ని మార్చాలంటే కేసీఆర్‌ తన పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు రావాలని సవాల్‌ చేశారు.

కేసీఆర్‌ నిరంకుశ, నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్‌ ఆసుపత్రులకు కొమ్ము కాయడానికే ఆసుపత్రిని తరలించడానికి పూనుకున్నారన్నారు. గత్యంతరం లేక ఫాస్ట్‌ పథకాన్ని ఎత్తివేసినట్టే సచివాలయం తరలింపు విషయాన్ని కూడా రద్దు చేసుకోవాలని కోరారు.

ఛాతీ ఆసుపత్రి తరలింపు జీవోను కేసీఆర్‌ ఉపసంహరించుకునే వరకూ పోరాడతామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని గ్రేటర్‌ అధ్యక్షుడు కృష్ణయాదవ్‌ అన్నారు. హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదని పెద్దిరెడ్డి అన్నారు.

ఛాతి ఆసుపత్రిలో తెలంగాణ టీడీపీ నేతలు

ఛాతి ఆసుపత్రిలో తెలంగాణ టీడీపీ నేతలు

ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి ఉన్న స్థలంలోకి తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని తరలించాలన్న ప్రభుత్వం నిర్ణయంపై తెలుగుదేశం తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది.

ఛాతి ఆసుపత్రిలో తెలంగాణ టీడీపీ నేతలు

ఛాతి ఆసుపత్రిలో తెలంగాణ టీడీపీ నేతలు

టీడీపీ నేతలు సోమవారం ఛాతి ఆసుపత్రిని సందర్శించారు. ఆస్పత్రిని కదిలిస్తే ఉరోమని, అడ్డుకుంటామని టీ-టీడీపీ నేతలు హెచ్చరించారు.

ఛాతి ఆసుపత్రిలో తెలంగాణ టీడీపీ నేతలు

ఛాతి ఆసుపత్రిలో తెలంగాణ టీడీపీ నేతలు

నిజాంను మించిపోతున్నారంటూ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ, సీనియర్‌ నేత మోత్కుపల్లి నరసింహులు నేతృత్వంలోని ఆ పార్టీ బృందం సోమవారం ఛాతీ ఆస్పత్రిని సందర్శించింది. ఆస్పత్రి తరలింపుపై ఉద్యమిస్తున్న వైద్య, వైద్యేతర సిబ్బందికి సంఘీభావం తెలిపింది.

ఛాతి ఆసుపత్రిలో తెలంగాణ టీడీపీ నేతలు

ఛాతి ఆసుపత్రిలో తెలంగాణ టీడీపీ నేతలు

ఇప్పుడు ఎనిమిది జిల్లాలకు అందుబాటులో ఉన్న ఛాతీ ఆస్పత్రి తరలింపు తరువాత ఒకే జిల్లాకు పరిమితం అవుతుందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యా కేసీఆర్‌! ఏం పుట్టింది మీకు? ఎందుకు ఇలా అలోచిస్తున్నారు? ఛాతీ ఆసుపత్రి తరలించాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని మోత్కుపల్లి నరసింహులు ప్రశ్నించారు.

ఛాతి ఆసుపత్రిలో తెలంగాణ టీడీపీ నేతలు

ఛాతి ఆసుపత్రిలో తెలంగాణ టీడీపీ నేతలు


ఇంటికి, రూముకు వాస్తు ఉంటుందేగానీ ఎక్కడైనా ప్రభుత్వానికి వాస్తు ఉంటుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పిచ్చోడి చేతిలో రాయులా కేసీఆర్‌ చేతిలో రాజ్యం ఉందన్నారు. సచివాలయానికి కాదు దోషం... నీవు సీఎం కావడంలోనే దోషం ఉందని, నీ ఆలోచన విధానంలో దోషముందన్నారు.

ఛాతి ఆసుపత్రిలో తెలంగాణ టీడీపీ నేతలు

ఛాతి ఆసుపత్రిలో తెలంగాణ టీడీపీ నేతలు

నిజాం మాదిరిగా నీ ముద్ర వేసుకోవాలని చేస్తున్నావని, ఆయన మంచి కోసం కట్టడాలు కట్టాడని, నీ నిర్ణయంతో పాడు చేయకని హితవు పలికారు. గతంలో ప్రభుత్వ భూమి ఒక్క అంగుళం కూడా అన్యాక్రాంతం కాకుండా ఎన్టీఆర్‌, చంద్రబాబు కాపాడితే, కేసీఆర్‌ వాస్తుపేరుతో ఉన్న భూమిని అమ్ముకుంటున్నారని విమర్శించారు.

ఛాతి ఆసుపత్రిలో తెలంగాణ టీడీపీ నేతలు

ఛాతి ఆసుపత్రిలో తెలంగాణ టీడీపీ నేతలు

సచివాలయం ఉన్న స్థలంలో బంధువుల కోసం ఫైవ్‌ స్టార్‌ ఆసుపత్రిని నిర్మించాలని సీఎం కేసీఆర్‌ యోచిస్తున్నారని ఆరోపించారు. ఛాతీ ఆసుపత్రిని జనరల్‌ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని డిమాండ్‌ చేశారు.

English summary
Telangana TDP leaders visit Erragadda Chest Hospital
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X