హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ మ‌హానాడు- పార్టీ బ‌లోపేతం పై బాబు దిశానిర్ధేశం

|
Google Oneindia TeluguNews

తెలంగాణాలో బ‌ల‌హీనంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ని మ‌హానాడు కార్య‌క్ర‌మంతో బ‌లోపేతం చేసేందుకు చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. ఈ నెల 24న నాంప‌ల్లి ఎగ్సిబీష‌న్ గ్రౌండ్స్ లో జ‌రిగే మ‌హానాడు కార్య‌క్ర‌మానికి చంద్ర‌బాబు ముఖ్య అతిదిగా హాజ‌రు కాబోతున్నారు. కార్య‌కర్త‌ల‌కు భ‌రోసా క‌లిగిస్తూ పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా చంద్ర‌బాబు ప్ర‌సంగం ఉండ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.

ఘ‌నంగా తెలంగాణ మ‌హానాడు.. దిశా నిర్దేశం చేయ‌నున్న చంద్ర‌బాబు.

ఘ‌నంగా తెలంగాణ మ‌హానాడు.. దిశా నిర్దేశం చేయ‌నున్న చంద్ర‌బాబు.

తెలంగాణా లో తెలుగు త‌మ్ముళ్లు మ‌హానాడు వేడుక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించుకోబోతున్నారు. అందుకోసం పార్టీ జాతీయ అద్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు దిశానిర్ధేశం చేయ‌నున్నారు. ఎన్టీఆర్ ట్ర‌స్టు భ‌వ‌న్ లో మ‌హానాడు నిర్వ‌హ‌ణ‌పై పార్టీ అద్య‌క్షుడు య‌ల్.ర‌మ‌ణ తెలంగాణా ముఖ్య నేత‌ల‌తో భేటీ నిర్వ‌హించారు. ఈ భేటీ లో మ‌హానాడు నిర్వ‌హ‌ణ‌, కార్య‌క్ర‌మాల క‌మిటీల ఏర్పాటు, స‌భా వేదిక, తీర్మాణాల గురించి చ‌ర్చించారు. అంతే కాకుండా వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పొత్తుల అంశం పై కూడా చ‌ర్చించే అవ‌కాశాలు ఉన్నాయి. గ‌త వారం అమ‌రావ‌తిలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత‌ల‌తో ఆ పార్టీ జాతీయ అద్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క రామారావు జ‌యంతి సంద‌ర్బంగా నిర్వ‌హించే మ‌హానాడు కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ తీరుతెన్నుల‌ను చంద్ర‌బాబు తెలంగాణ నేత‌ల‌కు నిర్దేశించారు.

 తెలంగాణ టీడిపి క్యాడ‌ర్ లో నూత‌న ఉత్పాహం నింపే ప్ర‌య‌త్నం..

తెలంగాణ టీడిపి క్యాడ‌ర్ లో నూత‌న ఉత్పాహం నింపే ప్ర‌య‌త్నం..

మ‌హానాడు నిర్వ‌హ‌ణ‌, పార్టీ ప్ర‌తినిధుల‌ను ఆహ్వానం, స‌భా స్థ‌లం, కార్య‌క్ర‌మాల క‌మిటీలు, రాజ‌కీయ తీర్మాణాలు, త‌దిత‌ర అంశాల‌పై లోతుగా చ‌ర్చించ‌బోతున్న‌రు చంద్ర‌బాబు. గ‌త సంవ‌త్స‌రం నిర్వ‌హించిన మ‌హానాడుకు పెద్ద యెత్తున కార్య‌క‌ర్త‌లు త‌ర‌లి రాగా అంత‌కు మించి ఈ మ‌హానాడును నిర్వ‌హించాల‌ని పార్టీ ముఖ్య నేత‌లు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ముఖ్యంగా నేత‌లు పార్టీ మారుతున్నా, పార్టీతోనే ఉంటున్న కార్య‌క్త‌లకు భ‌రోసా క‌ల్పించాల‌ని అదిస్టానం భావిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే మ‌హానాడులో నాయ‌కుల ప్ర‌సంగాలకు న‌దును పెడుతున్న‌ట్టు తెలుస్తోంది. 17 పార్ల‌మెంట్ నియోజ‌క వ‌ర్గాల్లో మిని మ‌హానాడులు నిర్వ‌హించిన నాయ‌కుల‌కు పార్టీ శ్రేణుల‌నుండి మంచి స్పంద‌న ల‌భించింద‌ని చెప్తున్నారు. 24 న హైద‌రాబాద్ లో నిర్వ‌హించ‌బోయే మ‌హానాడు కార్య‌క్ర‌మంలో ప్ర‌తినిధులు పెద్ద‌యెత్తున హాజ‌రుకావ‌ల‌ని నేత‌లు పిలుపునిచ్చారు.

 తెలుగుదేశం పార్టీ నాయకుల‌ను త‌యారు చేసే కార్మాగారం

తెలుగుదేశం పార్టీ నాయకుల‌ను త‌యారు చేసే కార్మాగారం

ముఖ్య నేత‌లు, ఎమ్మెల్యేలు పార్టీని వీడ‌డంతో బ‌ల‌హీన స్థితిలో ఉన్న తెలంగాణా తెలుగుదేశం పార్టీకి నూత‌న జ‌వ‌స‌త్తువ‌లు నింపేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన‌ట్టు తెలుస్తోంది. మ‌హానాడు నిర్వ‌హ‌ణ పేరుతో రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌ను పార్టీ ముఖ్య‌నేత‌ల‌తో బాబు చ‌ర్చించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. క్షేత్ర స్థాయిలో క్యాడ‌ర్ ను కాపాడుకుంటూనే నాయ‌కుల్లో ఉత్సాహం నింపేందుకు పావులు క‌ద‌ప‌బోతున్నారు చంద్ర‌బాబు. రాబోవు ఎన్నిక‌ల్లో మ‌నుగ‌డ ఎలా ఉండ‌బోతుందో అన్న నాయ‌కుల సందేహాల‌ను కూడా బాబు నివ్రుత్తి చాయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పార్టీ ఎవ‌రితో క‌లిసి ముందుకు వెళ్తుందో సూచ‌న ప్రాయంగా తెలిపే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ పార్టీతో క‌లిసిముందుకు వెళ్తామో స్ప‌ష్ట‌త ఇవ్వ‌క పోతే నాయ‌కులు మ‌రింత నీర‌స‌ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్టు చంద్ర‌బాబుకు ఇప్ప‌టికే నివేదిక‌లు అందాయి.

మ‌హానాడు ద్వారా పార్టీ శ్రేణుల‌కు భ‌రోసా క‌లిగిస్తాం.. దిగులు ప‌డొద్దు..

24న జ‌ర‌గ‌బోయే మ‌హానాడులో కొంత మంది ముఖ్య నేత‌ల‌తో బాబు ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించి ఇదే అంశాన్ని చ‌ర్చించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి మ‌హానాడు పేరుతో రాజ‌కీయ భేటీకి చంద్ర‌బాబు శ్రీ‌కారం చుట్టిన‌ట్టు తెలుస్తోంది. చంద్ర‌బాబు ప్ర‌త్యేకంగా హాజ‌రౌతున్న మ‌హానాడు కార్య‌క్ర‌మానికి ప్రాధాన్య‌త సంత‌రించుకొంది. చంద్ర‌బాబు తెలంగాణా మ‌హానాడు ఏర్పాట్ల‌తో పాటు పార్టీ భ‌విశ్య‌త్ కార్య‌క్ర‌మంపై ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక ర‌చించ‌బోతున్నట్టు కూడా తెలుస్తోంది.

English summary
telangana telugu desam party is going to conduct telangana state mahanadu. for this event party national president nara chandrababu naidu is attending. every year on the occasion of party founder late sri ntr jayanthi the mahanadu programa takes place. chandrababu naidu will be going to give crucial speech which strengthen the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X