• search
  • Live TV
జగిత్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కారెక్కనున్న ఎల్.రమణ-ఇవాళ కేసీఆర్‌తో భేటీ-ఆ హామీ లభించాకే పార్టీ మార్పుపై ప్రకటన..?

|

తెలంగాణ రాజకీయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది నెలల క్రితం వరకూ స్తబ్దుగా సాగిన ఇక్కడి రాజకీయం ఇప్పుడు క్రమంగా వేడెక్కుతోంది. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడం... షర్మిల సారథ్యంలో కొత్త పార్టీ ఏర్పాటవుతుండటం... ఇదే తరుణంలో హుజురాబాద్ ఉపఎన్నిక ఉండటం రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఇప్పటిదాకా తిరుగులేకుండా సాగిన టీఆర్ఎస్ ప్రస్థానాన్ని మారుతున్న రాజకీయ ముఖచిత్రం ఎంతమేర ప్రభావితం చేస్తుందన్నది ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.అటు టీఆర్ఎస్ కూడా పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎల్.రమణ లాంటి నేతలు టీఆర్ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

గతంలో రమణ ఏమన్నారంటే...

గతంలో రమణ ఏమన్నారంటే...

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత ఎల్‌.రమణ టీఆర్ఎస్‌లోకి వస్తున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే పార్టీ మార్పుపై తాను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని... తన మద్దతుదారులు,సన్నిహితులతో మాట్లాడిన తర్వాత దానిపై నిర్ణయం తీసుకుంటానని గతంలో వెల్లడించారు. తాజాగా పార్టీ మారేందుకు ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్ నుంచి హామీ లభించాకే...

కేసీఆర్ నుంచి హామీ లభించాకే...

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో గురువారం(జులై 8) మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో ఎల్‌.రమణ భేటీ కానున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌లతో కలిసి ఆయన ముఖ్యమంత్రిని కలవనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్‌లో చేరే ఉద్దేశంతోనే ఆయన సీఎంతో భేటీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ భవిష్యత్తుపై కేసీఆర్ నుంచి హామీ లభించాకే ఆయన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. రమణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజా సమావేశంలో ఆ మేరకు సీఎం నుంచి హామీ లభించాకే పార్టీ మార్పుపై ఎల్.రమణ అధికారికంగా తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

ఈటల స్థానాన్ని భర్తీ చేసేందుకు...

ఈటల స్థానాన్ని భర్తీ చేసేందుకు...

ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోవడంతో బీసీ వర్గానికి చెందిన బలమైన నేత పార్టీకి దూరమైనట్లయింది. ఒకరకంగా బీసీల్లోకి ఇది ప్రతికూల సంకేతాలు పంపిస్తుందోమోనన్న అనుమానం టీఆర్ఎస్‌లో కలిగింది. ఈ నేపథ్యంలోనే బీసీ సామాజికవర్గానికే చెందిన ఎల్.రమణను పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీసీల్లో కలిగిన అసంతృప్తిని దూరం చేయాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి గత నెలలోనే ఎల్.రమణ సీఎం కేసీఆర్‌తో భేటీ కావాల్సి ఉన్నప్పటికీ... సీఎం జిల్లాల పర్యటనతో వీరి భేటీ వాయిదా పడినట్లు తెలుస్తోంది.

రాజకీయ భవిష్యత్తు కోసమే...

రాజకీయ భవిష్యత్తు కోసమే...

ఎల్.రమణ గతంలో ఎంపీగా,ఎమ్మెల్యేగా,మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో కేసీఆర్‌తో కలిసి పనిచేసిన అనుభవం ఉన్నది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆయన టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతూ వస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఇప్పటికే ఉనికిని కోల్పోయిన టీడీపీలో ఉండటం ద్వారా తన రాజకీయ భవిష్యత్తుకు తానే ఫుల్ స్టాప్ పెట్టుకున్నట్లవుతుందని రమణ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్‌లో చేరడం ద్వారా తన రాజకీయ భవిష్యత్తును పదిలం చేసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

English summary
Telangana TDP president L Ramana will meet Chief Minister KCR on Thursday (July 8) at Pragati Bhavan in the afternoon. It is learned that he will meet the Chief Minister along with Minister Errabelli Dayakar Rao and Jagitya MLA Sanjay Kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X