వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏంటిదంతా?: రేవంత్‌ను నిలదీసిన రమణ, దబాయింపుగా రేవంత్.., వ్యూహాత్మకమా?

రేవంత్ రెడ్డి టీటీడీపీని ఏం చేయాలనుకుంటున్నారో ఆ పార్టీ నేతలకు అంతుపట్టడం లేదు. ఓవైపు కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం.. మరోవైపు టీటీడీపీ సమావేశానికి ఆయన హాజరవడం.. వారిని డైలామాలో పడేస్తున్నాయి.ఏపీలోన

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రేవంత్ రెడ్డి టీటీడీపీని ఏం చేయాలనుకుంటున్నారో ఆ పార్టీ నేతలకు అంతుపట్టడం లేదు. ఓవైపు కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం.. మరోవైపు టీటీడీపీ సమావేశానికి ఆయన హాజరవడం.. వారిని డైలామాలో పడేస్తున్నాయి.

రేవంత్ ముందు ఆ రెండు?: టీటీడీపీ ఏం డిసైడ్ చేయబోతోంది!, నేడే తేలనుందా?రేవంత్ ముందు ఆ రెండు?: టీటీడీపీ ఏం డిసైడ్ చేయబోతోంది!, నేడే తేలనుందా?

ఏపీలోని టీడీపీ నాయకులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ.. అదే సమయంలో కాంగ్రెస్ కు దగ్గరవుతున్నట్లు సంకేతాలిచ్చిన ఆయన.. ఏ ఉద్దేశంతో తిరిగి భేటీకి వచ్చారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం. వ్యతిరేక వ్యాఖ్యల ద్వారా వేటు వేయించుకోవాలనేదే రేవంత్ ప్లాన్ అయితే.. సమావేశానికి ఎందుకొచ్చినట్టు?..

నిలదీసిన రమణ:

నిలదీసిన రమణ:

టీటీడీపీ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరైన రేవంత్ రెడ్డిని పార్టీ అధ్యక్షడు ఎల్.రమణ గట్టిగానే నిలదీసినట్లు చెబుతున్నారు. పార్టీ మార్పు విషయం గురించి ప్రస్తావిస్తూ.. అసలేం అనుకుంటున్నారో చెప్పాలని రమణ రేవంత్ ను నిలదీశారట. అంతేకాదు, పార్టీ మారే ఉద్దేశమే ఉంటే సమావేశానికి రాకుండానే ఉండాల్సింది కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారట.

దబాయింపుగా రేవంత్

దబాయింపుగా రేవంత్

రమణ ప్రశ్నలకు రేవంత్ ఇచ్చిన సమాధానాలు దబాయించినట్టుగానే కనిపిస్తున్నాయి. తాను పార్టీ మారుతున్నట్టు ఎన్నడైనా, ఎక్కడైనా చెప్పానా? అని ఎల్ రమణను రేవంత్ ఎదురు ప్రశ్నించారట. అంతేకాదు, కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో టీడీపీ విఫలమవుతోందని ఆరోపించారట. పార్టీ మారే విషయమై మాత్రం ఆయన ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదని గుర్తుచేశారట.

టీడీపీ విఫలం అంటే?:

టీడీపీ విఫలం అంటే?:


కేసీఆర్ సర్కారుపై పోరాడటంలో టీడీపీ విఫలమవుతోందని రేవంత్ అనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. టీడీపీలో ఉండే కదా రేవంత్ కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడుతోంది. ఈ లెక్కన టీడీపీ విఫలమవుతోందంటే ఆయన కూడా విఫలమైనట్లే కదా అన్న అర్థం స్ఫురిస్తోంది. లేదా.. తన పోరాటానికి సీనియర్ల నుంచి మద్దతు దొరకట్లేదని రేవంత్ పరోక్షంగా చెప్పారని కూడా భావించవచ్చు.

రేవంత్ వ్యూహాత్మకమా?:

రేవంత్ వ్యూహాత్మకమా?:


ఏదేమైనా తెలంగాణ తెలుగుదేశంలో రేవంత్ రెడ్డి తిరుగులేని శక్తిగా తయారయ్యారు. సీనియర్లు సైతం ఆయనను వారించే స్థితిలో లేరు. ఒకవేళ వారు చెప్పినా రేవంత్ వినే రకం కాదన్న వాదన కూడా ఉంది. అటు కాంగ్రెస్ వైపు వెళ్తున్నట్లు సంకేతాలిస్తూనే.. ఇటు టీటీడీపీతో భేటీలోను కూర్చున్నాడంటే.. ఇదంతా వ్యూహాత్మకమా? లేక పార్టీ తానేం చేసినా చెల్లిపోతుందన్న భావనా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

టీటీడీపీ తనపై వేటు వేసేందుకే రేవంత్ సొంత పార్టీపై విమర్శలు చేస్తున్నారన్న వాదన ఉంది. వేటు వేసినా.. వేయకపోయినా.. టీటీడీపీ నుంచి బయటపడేందుకు పార్టీ నేతలపై ఆయన విమర్శలు కొనసాగే అవకాశాలు కూడా లేకపోలేదు. అదే జరిగితే.. టీటీడీపీ పరిస్థితి రేవంత్ చేతిలో ఫుట్ బాల్ కిందే లెక్క.

English summary
Telangana Telugu Desam president Ramana questioned Revanth Reddy about party change issue in working committee meeting
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X