వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోత్కుపల్లికి రమణ కౌంటర్: బాలకృష్ణ రియాక్షన్ ఇది

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టిడిపి తెలంగాణ రాష్ట్ర శాఖను టిఆర్ఎస్‌లో విలీనం చేయాలనే పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలను టిడిపి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ తోసిపుచ్చారు. తెలంగాణలో పార్టీకి ఎలాంటి ఢోకాలేదని రమణ అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో టిడిపి ఉనికి కోల్పోతున్న పరిస్థితి కన్పిస్తోంది. పార్టీకి చెందిన ముఖ్య నేతలు పార్టీని వీడి వెళ్ళారు. టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో టిడిపి నేతలు చేరారు. రేవంత్ రెడ్డి ఎపిసోడ్ టిడిపిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.

Recommended Video

టిడిపిని టిఆర్ఎస్‌లో విలీనం చేయాలి.. బాబుపై మోత్కుపల్లి సంచలనం..!

టిడిపిని టిఆర్ఎస్‌లో విలీనం చేయాలి, ఇంత కంటే అవమానమా:బాబుపై మోత్కుపల్లి సంచలనం టిడిపిని టిఆర్ఎస్‌లో విలీనం చేయాలి, ఇంత కంటే అవమానమా:బాబుపై మోత్కుపల్లి సంచలనం

ఈ పరిణామాలు తెలంగాణ టిడిపికి చెందిన నేతలను గందరగోళానికి గురి చేస్తున్నాయి. అయితే తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రతి నెల ఒక్క రోజును కేటాయిస్తానని హమీ ఇచ్చారు. కానీ, ఆ హమీని మాత్రం అమలుకు నోచుకోలేదు.

నా పెళ్ళి ముహుర్తం ఎన్టీఆర్ పెట్టారు, రేవంత్‌తో కాంగ్రెస్‌‌కు నష్టం, కెసిఆర్ మిత్రుడు: మోత్కుపల్లి నా పెళ్ళి ముహుర్తం ఎన్టీఆర్ పెట్టారు, రేవంత్‌తో కాంగ్రెస్‌‌కు నష్టం, కెసిఆర్ మిత్రుడు: మోత్కుపల్లి

తెలంగాణలో టిడిపికి ఢోకా లేదు

తెలంగాణలో టిడిపికి ఢోకా లేదు

తెలంగాణలో టిడిపికి ఢోకా లేదని టిడిపి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ చెప్పారు. టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలపై పార్టీలో చర్చిస్తామని చెప్పారు. తెలంగాణలో గ్రామ గ్రామాన పార్టీ కమిటీలున్నాయని రమణ చెప్పారు. తెలంగాణలో టిడిపి రాష్ట్ర శాఖ ఉంటుందని రమణ్ చెప్పారు. తెలంగాణలో పార్టీకి ఎలాంటి నష్టం లేదని రమణ చెప్పారు.

ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది

ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది

పార్టీలో ఎవరైనా తమ అభిప్రాయాలనుస్వేచ్ఛగా చెప్పే అలవాటు ఉందని ఎల్. రమణ చెప్పారు. అయితే నర్సింహులు లేవనెత్తిన విషయాలపై పార్టీ పొలిట్ బ్యూరో లో చర్చించనున్నట్టు చెప్పారు. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పొచ్చని రమణ తేల్చి చెప్పారు. వ్యక్తులుగా వారు మాట్లాడే విషయాలను వారి విచక్షణకు వదిలేస్తామని రమణ చెప్పారు.

మోత్కుపల్లి వ్యాఖ్యలు అప్రస్తుతం

మోత్కుపల్లి వ్యాఖ్యలు అప్రస్తుతం


మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యలు అప్రస్తుతమని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై ఆయన పెద్దగా స్పందించలేదు. ఈ సమయంలో తాను మోత్కుపల్లి వ్యాఖ్యలపై స్పందినని బాలకృష్ణ చెప్పారు.

మోత్కుపల్లి వ్యాఖ్యల కలకలం

మోత్కుపల్లి వ్యాఖ్యల కలకలం

తెలంగాణ టిడిపి సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు టిడిపిని టిఆర్ఎస్‌లో విలీనం చేయాలని చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలాన్రి రేపాయి. మోత్కుపల్లి ఈ వ్యాఖ్యలు ఏ ఉద్దేశ్యంతో చేశారోననే చర్చ సర్వత్రా సాగుతోంది. మరో వైపు రేవంత్ రెడ్డి ఎపిసోడ్ సమయంలో టిఆర్ఎస్‌ల మధ్య పొత్తు పెట్టుకోవాలని మోత్కుపల్లి చెప్పారు. రేవంత్ మాత్రం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కోరారు.ఆనాడు మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు కలకలాన్ని రేపాయి. ప్రస్తుతం మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో టిడిపికి ఇక మనుగడ లేదనే పరిస్థితి పార్టీ నేతల్లో నెలకొందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు కన్పించిందని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

English summary
Telangana Tdp president L. Ramana condemned former minister Motkupalli narasimhulu comments, We have committees in every village in entire Telangana state. Ramana responded after Narsimhulu comments,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X