• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రేవంత్ ముందు ఆ రెండు?: టీటీడీపీ ఏం డిసైడ్ చేయబోతోంది!, నేడే తేలనుందా?

|
  రేవంత్ ముందు ఆ రెండు? ఎన్టీఆర్ భవన్ లో నేడే తేలనుందా ? | Oneindia Telugu

  హైదరాబాద్: రేవంత్ రెడ్డి పార్టీ మార్పుపై ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో టీటీడీపీ నేతలు ఎన్టీఆర్ భవన్ లో శుక్రవారం సమావేశం కానున్నారు. ఉదయం 11గం.కు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరవుతారా? లేరా? అన్న మీమాంస నెలకొన్నప్పటికీ.. చివరి నిమిషంలో ఆయన రాక ఖరారైంది.

  కాంగ్రెస్‌కు బాహుబలి?: కాంపౌండ్ దాటితే రేవంత్‌కు గండమే!, ఇదీ పరిస్థితి..

  రేవంత్ గనుక ఈ సమావేశానికి గైర్హాజరైతే పార్టీ మార్పు ఇక లాంఛనమే అనుకోవాల్సి వచ్చేది. టీటీడీపీ సమావేశానికి ముందు బీజేపీ ఎమ్మెల్యే ప్రభాకర్ రేవంత్ రెడ్డితో భేటీ అవడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మధ్య సుమారు గంట పాటు చర్చలు జరిగాయి. రేవంత్ కాంగ్రెస్‌కు దగ్గరవుతున్న క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ప్రభాకర్ ఆయనతో భేటీ అవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

  ఇక టీటీడీపీ సమావేశం విషయానికొస్తే.. పార్టీలో తాజా పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణపై సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఏడుగురు పొలిట్ బ్యూరో సభ్యులు, ఏడుగురు కేంద్ర కమిటీ సభ్యులు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ హాజరుకానున్నారు.

  రేవంత్ ఆలోచన ఏంటి?:

  రేవంత్ ఆలోచన ఏంటి?:

  టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రస్తుతం తన నియోజకవర్గం కొడంగల్ లో అనుచరులు, తన మద్దతుదారులతో చర్చోపచర్చలు జరుపుతున్నారు. పార్టీ వీడటంపై వారి అభిప్రాయాలను రేవంత్ తెలుసుకుంటున్నట్లు సమాచారం. కాంగ్రెస్ కు దగ్గరవాలని చేస్తున్న ప్రయత్నాల పట్ల అనుచరులు, అభిమానులు సానుకూలంగా ఉన్నారా? లేదా? అన్న విషయాన్ని ఆయన వారి నుంచి అడిగి తెలుసుకుంటున్నట్లు చెబుతున్నారు.

  రేవంత్ హాజరైతే:

  రేవంత్ హాజరైతే:

  నేటీ టీటీడీపీ సమావేశానికి రేవంత్ హాజరవడం, హాజరుకాకపోవడం ఆధారంగా రేవంత్ రెడ్డి భవిష్యత్తు కార్యాచరణను అంచనా వేసే అవకాశముంది. గతంలోను రేవంత్ రెడ్డి పలుమార్లు టీటీడీపీ సమావేశాలకు డుమ్మా కొట్టినప్పటికీ.. తన పార్టీ మార్పు ప్రచారం నేపథ్యంలో జరుగుతున్న సమావేశం కావడంతో ఈ సమావేశం పట్ల ఆయన ఏ వైఖరిని అవలంభిస్తారనేది కీలకంగా మారింది.

  ఒకవేళ రేవంత్ సమావేశానికి హాజరైనా.. టీటీడీపీ నేతలతో తెగదెంపుల కోసమే ఆయన వచ్చే అవకాశముంది. సమావేశంలో పార్టీ నేతలతో విభేదిస్తే తనపై వేటు మరింత సులువు అవుతుందని ఆయన భావిస్తుండవచ్చు.

  రాకపోతే క్లియర్?:

  రాకపోతే క్లియర్?:

  రేవంత్ ఒకవేళ టీటీడీపీ సమావేశానికి డుమ్మా కొడితే.. కాంగ్రెస్‌లో చేరాలని ఆయన ప్రయత్నిస్తున్నారన్న ప్రచారానికి మరింత బలం చేకూరుతుంది. రేవంత్ గైర్హాజరైన పక్షంలో.. టీటీడీపీ నేతలు ఆయన వైఖరిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరం. ఇప్పటికైతే ముఖ్య నేతలెవరూ రేవంత్ నుంచి వివరణ కోరినట్లుగా గానీ, కనీసం ఫోన్ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేసినట్లుగా గానీ కనిపించడం లేదు.

  ఈ నేపథ్యంలో రేవంత్ టీడీపీ పైనే అస్త్రాలు ఎక్కుపెట్టడంపై వారు ఆయన నుంచి వివరణ కోరే ప్రయత్నం చేస్తారా?.. రేవంత్ దానికి స్పందిస్తారా?.. ఇదంతా ఎందుకని టీటీడీపీయే ఆయనను పార్టీ నుంచి తప్పిస్తుందా? అన్నవి ఉత్కంఠకు గురిచేస్తున్న ప్రశ్నలు.

  రేవంత్ ముందు ఆ రెండు:

  రేవంత్ ముందు ఆ రెండు:

  రేవంత్ తన భవిష్యత్తును కాంగ్రెస్ లోనే వెతుక్కుంటున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. టీడీపీ నేతలపై విమర్శల ద్వారా ఆ విషయాన్ని చెప్పకనే చెప్పారు. అదే సమయంలో కాంగ్రెస్ కు అనుకూలంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు దానికి బలాన్ని చేకూరుస్తున్నాయి.

  మొదటి నుంచి సీఎం కావాలని కలలు కంటున్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ లోకి వెళ్తే అది నెరవేరుతుందా? అన్నది అనుమానమే. రేవంత్ తన సీఎం కలను పక్కనపెట్టడమో!.. లేక కాంగ్రెస్ లోని సీఎం అభ్యర్థులే రేవంత్‌కు ఆ ఛాన్స్ ఇవ్వడమో జరగాలి. ఈ రెండింటిలో ఏం జరగబోతుందన్నది త్వరలోనే తేలిపోనుంది.

  English summary
  Telangana Telugu Desam party conducting a meeting in NTR Bhavan on Friday to discuss over latest incidents in party, especially Revanth Reddy's issue.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X