హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహారాష్ట్ర, ఢిల్లీని వెనక్కి నెట్టిన తెలంగాణ: కరోనా పాజిటివిటి రేటు దేశ సగటుకు 3 రేట్లు అధికం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి రోజు రోజుకు మరింతగా విజృంభిస్తోంది. ఇటీవల కాలంలో ప్రతి రోజూ కూడా వెయ్యికిపైగా కేసులు నమోదవుతుండటం గమనార్హం. గురువారం 5954 టెస్టులు చేయగా.. 1410 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. టెస్టులు పెంచుతున్న కొద్దీ కరోనా పాజిటివ్ కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయంగా మారింది.

మహారాష్ట్ర, ఢిల్లీని వెనక్కినెట్టిన తెలంగాణ..

మహారాష్ట్ర, ఢిల్లీని వెనక్కినెట్టిన తెలంగాణ..

కొన్ని సందర్భాల్లో తెలంగాణలో పాజిటివ్ రేటు 30 శాతం దాటుతోంది. దేశంలో కరోనా పాజిటివ్ రేటులో తెలంగాణ ఇప్పుడు టాప్ స్టేటస్‌లో ఉంది. కొద్ది రోజుల క్రితం వరకు మహారాష్ట్ర, ఢిల్లీల వెనుకే ఉన్న తెలంగాణ.. ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాలను వెనక్కి నెట్టడం గమనార్హం.

తెలంగాణ పాజిటివిటి రేటు జాతీయ సగటు కంటే ఎక్కువ

తెలంగాణ పాజిటివిటి రేటు జాతీయ సగటు కంటే ఎక్కువ

జులై 8 నాటికి తెలంగానలో పాజిటివ్ రేటు 21.91 శాతం ఉండగా, జాతీయ పాజిటివ్ రేటు 7.14 శాతంగా ఉంది. అంటే తెలంగాణలో మూడింతలు అధికంగా పాజిటివ్ రేటు ఉండటం గమనార్హం. ఇక మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే పాజిటివ్ రేటు 7.8 రేట్లు ఎక్కువగా ఉంది.

తెలంగాణలో అత్యధికంగా పాజిటివిటి రేటు

తెలంగాణలో అత్యధికంగా పాజిటివిటి రేటు


తెలంగాణలో ప్రతి పది లక్షల మందిలో 3430 మందికి కరోనా టెస్టులు చేయగా..
పాజిటివ్ రేటు 21.91 శాతంగా ఉంది. ఇక మహారాష్ట్రలో ప్రతి 10 లక్షల జనాభాలో 9564 టెస్టులు చేయగా.. పాజిటివ్ రేటు 18.73 శాతంగా ఉంది. ఢిల్లీలో ప్రతి పది లక్షల మంది జనాభాలో 35,993 మందికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ రేటు 14.94 శాతంగా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది లక్షల మందిలో 20,498మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. పాజిటివ్ రేటు అతి తక్కువగా 2.8శాతం మాత్రమే ఉంది.

తెలంగాణకు ఊరట కలిగించే అంశం ఇదే..

తెలంగాణకు ఊరట కలిగించే అంశం ఇదే..

అయితే, జాతీయ స్థాయిలో కరోనా మరణాల రేటు 3.02శాతం ఉండగా.. తెలంగాణలో మాత్రం చాలా తక్కువగా 1.10 శాతం మాత్రమే ఉండటం మంచి విషయంగా చెప్పవచ్చు. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. కర్ణాటక తర్వాత కరోనా కేసుల డబ్లింగ్ రేటు తెలంగాణలోనే ఎక్కువగా ఉంది. కర్ణాటకలో 8.5 రోజులకోసారి కేసులు రెట్టింపు అవుతుండగా.. తెలంగాణలో మాత్రం 9.5 రోజులకు కేసులు రెట్టింపు అవుతున్నాయి. కాగా, జులై 9 నాటికి తెలంగాణలో 1,40,755 టెస్టులు చేసినట్లు సమాచారం. అయితే, ఇతర ఏపీ, కేరళ లాంటి రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ కావడం గమనార్హం.

తెలంగాణలో కరోనా టెస్టులు పెంచాల్సిందే..

తెలంగాణలో కరోనా టెస్టులు పెంచాల్సిందే..

తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం పట్ల ఆందోళన చెందిన కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ బుధవారం రాష్ట్రమంత్రి ఈటెల రాజేందర్‌తో ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో టెస్టుల సంఖ్యను భారీగా పెంచాలని సూచించారు. అయితే, ల్యాబ్‌లు, మానవవనరుల కొరత కారణంగా వెనుకడుగు వేయాల్సి వస్తోందని, రోజుకు 4వేల టెస్టులు మాత్రమే చేయగలుగుతున్నామని ఆరోగ్యశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో టెస్టులు పెంచాలని సూచించారు. హైకోర్టు కూడా రాష్ట్రంలో కరోనా టెస్టులు పెంచాలని ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

English summary
Telangana now has the highest positivity rate of Covid-19 cases in the country. Just a couple of weeks ago, the state was trailing Maharashtra and Delhi. Now, it tops the chart at 21.91% (as on July 8). This is three times more than the national positivity rate of 7.14%.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X