వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతివాదులుగా అల్లు అర్జున్, రానా, రవితేజ.. ఎందుకంటే: డ్రగ్ కేసులో చార్మి జవాబులు దాటవేస్తే

డ్రగ్ కేసులో తెలంగాణ యూత్ ఫోర్స్ సంస్థ రెండు వేర్వేరు కెవియట్‌లు దాఖలు చేసింది. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీతారల వాదనలు వినేముందు తమ వాదనలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రగ్ కేసులో తెలంగాణ యూత్ ఫోర్స్ సంస్థ రెండు వేర్వేరు కెవియట్‌లు దాఖలు చేసింది. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీతారల వాదనలు వినేముందు తమ వాదనలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరింది.

చదవండి: అనవసరంగా కోర్టుకెక్కారా: పూరీని ఎందుకు లాగారు, చార్మి తొందరపడ్డారా?

అల్లు అర్జున్, రవితేజ, రాణాల పేర్లు ఎందుకు

అల్లు అర్జున్, రవితేజ, రాణాల పేర్లు ఎందుకు

మీడియాలో అగ్రహీరో, అగ్ర నటులు అంటూ చెబుతున్నారే తప్ప పేర్లు రావడం లేదని తెలంగాణ యూత్ ఫోర్స్ రాములు చెప్పారు. సోషల్ మీడియాలో ఆ పేర్లు వస్తున్నందునే తాము పేర్కొన్నామని ఆయన చెప్పారు. వీరు ఎవరైనా కోర్టుకు వెళ్తే తమ వాదన వినాలని ఆయన చెప్పారు. సోషల్ మీడియాలో ఇంకా చాలాపేర్లు వస్తున్నాయన్నారు.

Recommended Video

Kajal Aggarwal, Raashi Khanna And Lavanya Tripathi Names In Drugs Scandal
చార్మీ సమాధానాలు దాటవేస్తే

చార్మీ సమాధానాలు దాటవేస్తే

చార్మీని బుధవారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సిట్ అధికారులు విచారించనున్నారు. మహిళా అధికారులు విచారణ జరుపుతారు. ఇందుకోసం ప్రశ్నావళి సిద్ధం చేశారు. చార్మి కనుక సమాధానాలు దాటవేస్తే ఇందుకు సంబంధించి ఫోటోలు, వీడియోలు ఆధారాలను సిద్ధం చేయనున్నారని తెలుస్తోంది.

వ్యక్తిగత ప్రశ్నలు పక్కన పెట్టి

వ్యక్తిగత ప్రశ్నలు పక్కన పెట్టి

చార్మీని కేవలం కెల్విన్ డేటా ఆధారంగానే సిట్ అధికారులు విచారించనున్నారని తెలుస్తోంది. డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా? పరిశ్రమలో డ్రగ్ ఎవరెవరు తీసుకుంటారు? సరఫరా చేసే వారు తెలుసా? డ్రగ్ సరఫరాదారు కెల్విన్ ఫోన్ లిస్టులో మీ సెల్ నెంబర్ ఎందుకు ఉంది? తదితర ప్రశ్నలు అడగనున్నారని తెలుస్తోంది. చార్మీ హైకోర్టుకు వెళ్లినందున ఆమెకు ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారనేది అందరికీ ఆసక్తికరమే.

పరిశ్రమ రెండుగా చీలిందా?

పరిశ్రమ రెండుగా చీలిందా?

డ్రగ్ వ్యవహారం నేపథ్యంలో సినిమా పరిశ్రమ రెండుగా చీలినట్లుగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు ఉద్దేశ్య పూర్వకంగా ఈపేర్లు జాబితాలో ఉన్నాయని ప్రచారం చేస్తున్నారట. మరోవైపు, డ్రగ్ కేసులో దొరక్కుండా సినిమా తారలు తమకు తెలిసిన డాక్టర్ల సూచన మేరకు అలోవీరా జ్యూస్ తాగి వస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

చిన్నా సహకరించినందునే త్వరగా విచారణ

చిన్నా సహకరించినందునే త్వరగా విచారణ

మంగళవారం వరకు ఆరుగురు ప్రముఖ సినీ ప్రముఖులను సిట్ విచారించింది. ఆర్ట్ డైరెక్టర్ చిన్నా విచారణ కేవలం నాలుగు గంటల్లో పూర్తయింది. అందుకు ఆయన సిట్‌కు పూర్తిగా సహకరించడమే అంటున్నారు. శ్యామ్ కె నాయుడు కూడా సహకరించినందునే ఆయనది కూడా త్వరగా పూర్తయిందంటున్నారు. పూరీ జగన్నాథ్, తరుణ్, నవదీప్‌లు సహకరించక పోవడం వల్లే విచారణ ఆలస్యమయిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

English summary
Telangana Youth Force petition against Hyderabad Drugs Case in High Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X