వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్టీ 4, ఎస్సీ 6, బీసీ 6, ఆన్ రిజర్వ్ డ్ 16 ... తెలంగాణలో జెడ్పీ రిజర్వేషన్లు ఖరారు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణలో జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రంలో మొత్తం 32 జెడ్పీ స్థానాలకు 50 శాతం రిజర్వేషన్ ప్రాతిపదికగా కేటాయించారు. అలాగే జిల్లాలోని ఓట్ల ఆధారంగా బీసీలకు సీట్లను కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ పోను, మిగిలిన స్థానాలు 16 స్థానాలను ఆన్ రిజర్వ్ డ్ కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సహా ఆన్ రిజర్వ్ డ్ స్థానాల్లో 16 సీట్లను మహిళలకు కేటాయించామని పంచాయతీరాజ్ కమిషనర్ నీతూప్రసాద్, ఉప కార్యదర్శి రామారావు తెలిపారు.

ఎస్టీ 4, ఎస్సీ 6, బీసీ 6, ఆన్ రిజర్వ్ డ్ 16
రాష్ట్రంలోని ఎస్టీల జనాభా 13.86 శాతం ఉన్నది. జనాభా ప్రాతిపదికన వీరికి 4 స్థానాలు కేటాయించారు. 19.03 శాతం ఉన్న ఎస్సీలకు 6 స్థానాలు లభించాయి. 50 శాతం రిజర్వేషన్ లో ఎస్సీ, ఎస్టీలకు కలిపి ఇవ్వగా మిగిలిన 17.11 శాతం మేరకు బీసీలకు 6 చోట్ల రిజర్వేషన్ కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తవగా .. మిగతా 16 స్థానాలను ఎవరికీ రిజర్వ్ చేయలేదు.

 telangana zp reservations confirm

16 సీట్లు మహిళలకు కేటాయింపు
ఆన్ రిజర్వ్ డ్ 16 సీట్లతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీల 16 స్థానాల్లో 50 శాతం మహిళలకు కేటాయించారు. అంటే 32 సీట్లలో సగం మహిళలకు ఖరారు చేయడంతో .. రాష్ట్రంలో మహిళా జెడ్పీ చైర్ పర్సన్ల సంఖ్య 16గా ఉండనుంది. మహిళల రిజర్వేషన్ ఖరారు చేసే సమయంలో పంచాయతీరాజ్ అధికారులు రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా తీసుకున్నారు. ఆరు పార్టీల నేతలు హాజరై .. తమ అభిప్రాయాన్ని తెలిపారు.

2029 వరకు అమల్లో రిజర్వేషన్లు
పంచాయతీరాజ్ అధికారులు రూపొందించిన రిజర్వేషన్ల ప్రక్రియ 2029 వరకు అమల్లో ఉంటాయి. అంటే మరో రెండుసార్లు జెడ్పీ ఎన్నికల్లో ఈ రిజర్వేషన్లను అనుసరిస్తారు. ఆ తర్వాత రిజర్వేషన్లు ఖరారు చేసి ... ఆ ప్రకారం కేటాయిస్తారు.

<strong>ఆలోచించండి .. అధ్యయనం చేయండి .. తర్వాతే నిర్ణయం తీసుకొండి. అమెరికాలో విద్య కోసం తొందరపడకండి</strong>ఆలోచించండి .. అధ్యయనం చేయండి .. తర్వాతే నిర్ణయం తీసుకొండి. అమెరికాలో విద్య కోసం తొందరపడకండి

 telangana zp reservations confirm

ఏ జిల్లాకు .. ఏ రిజర్వేషన్

పంచాయతీరాజ్ అధికారులకు జెడ్పీ చైర్ పర్సన్లకు రిజర్వేషన్ ఖరారు ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఏ జిల్లాకు ఏ రిజర్వేషన్ వచ్చిందో ఓ సారి పరిశీలిద్దాం. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఆదిలాబాద్, కుమరంభీం ఆసిఫాబాద్ ఎస్టీలకు, మంచిర్యాల, వరంగల్ అర్బన్, కరీంనగర్, నాగర్ కర్నూలు, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం ఎస్సీలకు, పెద్దపల్లి, నారాయణపేట, జగిత్యాల, జోగులాంబ గద్వాల, మెదక్, కామారెడ్డి బీసీలకు కేటాయించారు. మిగిలిన సిద్దిపేట, వనపర్తి, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, వరంగల్ రూరల్, జనగామ, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ములుగు జెడ్పీ చైర్ పర్సన్ అన్ రిజర్వ్ డ్ క్యాటగిరిలో ఉన్నాయి. జెడ్పీ టీసీ ఎన్నికలను మే నెలాఖరులోగా నిర్వహించి .. జూన్ 10 లోపు జెడ్పీ చైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ చేపడుతామని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇదివరకే స్పష్టంచేసింది.

English summary
telangana zp chair person reservations con firm. st 4, sc 6, bc 6, n reserved category 16 says panchayati ray officials. total 32 seats 16 seats reserve for women. and this reservations til 2029 continue officials told
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X