హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టెక్కీ సునీతని మోసగించిన వాడు మామూలోడు కాదు: ఏడాదిలో 6గురితో..

సాఫ్టువేర్ ఇంజినీర్ సునీత మృతి కేసులో నిందితుడు శ్రవణ్ మామూలు వాడు కాదని అంటున్నారు. ఆయన ప్రేమ పేరుతో సునీతను వంచించాడు. సునీత పెళ్లి చేసుకోమని అడిగితే నిరాకరించాడు. దీంతో అతని పైన ఆత్మహత్యకు ప్రేరేప

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సాఫ్టువేర్ ఇంజినీర్ సునీత మృతి కేసులో నిందితుడు శ్రవణ్ మామూలు వాడు కాదని అంటున్నారు. ఆయన ప్రేమ పేరుతో సునీతను వంచించాడు. సునీత పెళ్లి చేసుకోమని అడిగితే నిరాకరించాడు. దీంతో అతని పైన ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.

నిందితుడు శ్రవణ్ ఆడపిల్లలతో పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకుంటానని ఆశచూపించి తన అవసరాలు తీర్చుకోవడంలో నేర్పరి అని తెలుస్తోంది.

టెక్కీ సునీత.. ప్రియుడికి చెప్పి అన్నంత పని చేసింది, ఆత్మహత్యే.. ఇదీ జరిగింది టెక్కీ సునీత.. ప్రియుడికి చెప్పి అన్నంత పని చేసింది, ఆత్మహత్యే.. ఇదీ జరిగింది

ఏడాది వ్యవధిలోనే ఆరుగురు యువతులతో అతను ప్రేమాయణం సాగించారని పోలీసుల దర్యాఫ్తులో వెల్లడయిందని తెలుస్తోంది. మాట్రీమోనీ వెబ్ సైట్లోను ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

సునీత కుటుంబానిది దయనీయ పరిస్థితి

సునీత కుటుంబానిది దయనీయ పరిస్థితి

ఇదిలా ఉండగా, సునీత కుటుంబానిది చాలా దయనీయమైన పరిస్థితి. వారి కుటుంబం చాలా పెద్దది. అందులో చాలామంది వివిధ కారణాలతో మృతి చెందారు. 12 మంది అక్కా చెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లు.

నలుగురు మిగిలారు

నలుగురు మిగిలారు

12 మందిలో సునీత మృతి తర్వాత.. నలుగురు మిగిలారు. సునీత సోదరీమణులైన పుష్పలత, హేమలత, శ్రీదేవి. సోదరుడు నర్సింగ రావు.

పన్నెండు మంది సంతానం

పన్నెండు మంది సంతానం

సునీత తల్లిదండ్రులు పదిహేనేళ్ల క్రితమే మృతి చెందారు. వారికి పన్నెండు మంది సంతానం. ఆరుగురు కొడుకులు. ఆరుగురు కుమార్తెలు.

సునీత మృతి

సునీత మృతి

సువర్ణ, విజయ చిన్నవయస్సులో మృతి చెందారు. ఆనంద రావు మానసికస్థితి సరిగా లేక ఇరవై ఏళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయారు. గతంలో శోభన్ బాబు, తిరుమల్ రావు, సతీష్ కుమార్‌ వేర్వేరు సందర్భాల్లో ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీనివాస్‌ గుండెపోటుతో చనిపోయారు. ఇప్పుడు సునీత చనిపోయారు.

English summary
Police said that since her boyfriend Sravan has forced her to commit suicide he will be arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X