వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మద్యం సేవించినట్లు సిసిటీవీల్లో..: భరత్ మృతి కేసులో షాకింగ్ విషయాలు

టాలీవుడ్ హీరో రవితేజ సోదరుడు, నటుడు భరత్ మృతి కేసులో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఆయన మద్యం సేవించి కారు నడిపినట్లు వెల్లడైంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టాలీవుడ్ హీరో రవితేజ సోదరుడు, నటుడు భరత్ మృతి కేసులో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఆయన మద్యం సేవించి కారు నడిపినట్లు వెల్లడైంది. ప్రమాదానికి ముందు నోవాటెల్ హోటల్‌లో గడిపిన దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డయ్యాయి.

<strong>అందువల్లే ప్రమాదం జరిగిందేమో: నటుడు భరత్ మృతిపై బాబాయి </strong>అందువల్లే ప్రమాదం జరిగిందేమో: నటుడు భరత్ మృతిపై బాబాయి

శనివారం నాడు ఆయన నోవాటెల్‌లో స్నేహితుడి పుట్టిన రోజు పార్టీకి హాజరయ్యారు. సాయంత్రం నాలుగ గంటలకు స్విమ్మింగ్ పూల్ వద్ద మద్యం సేవించినట్లు సిసి కెమెరా దృశ్యాల్లో కనిపించింది.

నోవాటెల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు..

నోవాటెల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు..

మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి గం.9.25 నిమిషాల వరకు భరత్ నోవాటెల్‌లోనే ఉన్నారు. అనంతరం అక్కడి నుంచి తన కారులో వెళ్లిపోయారు. రాత్రి గం.9.45 నిమిషాల ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డుపై అతని కారు కొత్వాల్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.

కారు వేగం గంటకు 145 కిలోమీటర్లు

కారు వేగం గంటకు 145 కిలోమీటర్లు

సంఘటన స్థలంలోనే భరత్ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం సమయంలో ఆయన కారు 145 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతి వేగం, మద్యం మత్త ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

కారు నుజ్జునుజ్జు

కారు నుజ్జునుజ్జు

కారులో వెళ్తున్న సమయంలో అందులో భరత్ ఒక్కడే ఉన్నారు. ప్రమాదంలో అతని ముఖం ఛిద్రం కావడంతో అతడిని గుర్తించడంలో ఆలస్యమైంది. కారులో మద్యం సీసాలు కూడా లభ్యమయ్యాయి. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది

ఎయిర్ బెలూన్ తెరుచుకున్నప్పటికీ..

ఎయిర్ బెలూన్ తెరుచుకున్నప్పటికీ..

టిఎస్ 09 ఈసీ 0799 నెంబరుతో ఉన్న ఎరుపు రంగు స్కోడా కారు భరత్ తల్లి రాజ్యలక్ష్మి పేరిట రిజిస్ట్రేషన్ అయింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం బాగా నుజ్జునుజ్జు అయింది. ఎయిర్ బెలూన్ తెరుచుకోనప్పటికీ అతి వేగానికి పగిలిపోయింది. స్టీరింగ్ విరిగిపోయింది. స్పీడో మీటర్ 140 వద్ద ఆగిపోయింది.

అంతిమ సంస్కారాలు పూర్తి

అంతిమ సంస్కారాలు పూర్తి

భరత్ మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. భరత్ కడసారి చూపులకు అన్న రవితేజ, తల్లి రాజ్యలక్ష్మి రాలేదు. భరత్ బాబాయి మూర్తి రాజు, సోదరుడు రఘు దహన సంస్కారాలు పూర్తి చేశారు.

ముగ్గురు సోదరుల్లో రెండోవాడు

ముగ్గురు సోదరుల్లో రెండోవాడు

రవితేజ ముగ్గురు సోదరుల్లో భరత్ రెండోవాడు. గచ్చిబొలిలో తల్లి రాజ్యలక్ష్మితో కలిసి ఉంటున్నారు. నోవాటెల్‌లో స్నేహితులు ఇచ్చిన విందులో పాల్గొని, ఆ తర్వాత ఈత కొలనులో స్విమ్మింగ్ చేసి, మద్యం తాగాడు. అనంతరం ప్రమాదంలో మృతి చెందాడు. సంఘటన స్థలానికి పది నిమిషాలకు చేరుకున్న పోలీసులు.. భరత్ మృతదేహాన్ని అతి కష్టం మీద బయటకు తీశారు.

English summary
Telugu actor Bharath Raju's funeral held in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X