వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రగ్స్ కేసులో ట్విస్ట్: సీఎం కేసీఆర్‌కు తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ లేఖ... ఎందుకో?

డ్రగ్స్ కేసు విచారణ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కు తెలుగు సినిమా పరిశ్రమ ఓ లేఖ రాసింది. సినీ పరిశ్రమపై ఆధారపడిన వేలాది కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని ఈ కేసులో దర్యాప్తును హుందాగా నిర్వహించాలని కోరింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: డ్రగ్స్‌ సమస్యను సున్నితంగా పరిష్కరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను తెలుగు సినిమా పరిశ్రమ కోరింది. డ్రగ్స్‌ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపింది.

ఈ మేరకు బుధవారం సీఎం కేసీఆర్ కు రాసిన లేఖలో పేర్కొంది. డ్రగ్స్‌ కేసు ప్రభావం వేలాది కుటుంబాలపై పడనుందని, సినిమా పరిశ్రమ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని హుందాగా దర్యాప్తు సాగించాలని కోరుకుంటున్నామని తెలిపింది.

cm-kcr

కేసు దర్యాప్తులో తమ వంతు సహకారం అందిస్తామని సీఎం కేసీఆర్ కు రాసిన లేఖలో తెలుగు సినిమా పరిశ్రమ హామీ ఇచ్చింది. సమాజం, మీడియా నుంచి తాము సానుభూతి కోరుకుంటున్నామని వెల్లడించింది.

డ్రగ్స్‌ కేసు విచారణ జరిగిన 10 రోజులు ఇండస్ట్రీకి చీకటిరోజులుగా అభివర్ణించింది. డగ్స్‌ వాడిన వారిపై తామే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపింది. డ్రగ్స్‌ వ్యవహారం తమందరికీ ఓ కుదుపు, ఓ హెచ్చరిక అని తెలుగు సినిమా పరిశ్రమ పేర్కొంది.

English summary
The Telugu film industry seems to be rattled by the ongoing investigation into the drugs scandal in the city in which some Tollywood personalities are allegedly involved, and has asked the Chief Minister to intervene. In a letter to Chief Minister K. Chandrashekar Rao they have requested him to ensure that the investigation of film personalities “is handled in a smooth way”. The Telugu Film Chamber of Commerce, Movie Artists Association, Telugu Film Producers’ Federation and Telangana State Film Chamber of Commerce jointly said in the letter sent on Wednesday that it was an eclipse to the industry while it was celebrating happy moments after reaching Rs 2,000 crore of mark.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X