వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్ని పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు తప్పనిసరి.. సీఎం కేసీఆర్ ఆదేశాలు

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తెలుగు భాషను తప్పనిసరి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రావాలని తెలిపారు. తమిళనాడులో మాతృభాషలో బోధనా విధానాన్ని అధ్యయనం చేసి వచ్చిన అధికారులతో మంగళవారం కేసీఆర్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించడంపై రూపొందించాల్సిన విధివిధానాలపై అధికారులతో చర్చించారు. మాతృభాషను బతికించుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటామని గత డిసెంబర్‌లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేస్తూ నిర్ణయం ప్రకటించారు.

cm-kcr

అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాలని ఆదేశాలు జారీ చేయాల్సిందిగా అధికారులకు కేసీఆర్ సూచించారు. ప్రైవేట్ స్కూళ్లలో తప్పనిసరిగా తెలుగు పండితుడు ఉండాలని పేర్కొన్నారు. దీనిపై ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు.

ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు కూడా తెలుగు భాష నేర్చుకోవాలనే నిబంధన పెడుతున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. మొదటి దశలో పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే తెలుగు సబ్జెక్ట్‌కు సిలబస్ రూపొందించాలని తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్య అకాడమీని కోరారు. సిలబస్‌లో నైతిక విలువలు, దేశభక్తి పెంపు అంశాలు ఉండాలని ఆయన సూచించారు.

English summary
Telangana Chief Minister K. Chandrashekhar Rao on Tuesday made it mandatory to teach Telugu as a compulsory subject in all the public and private schools of the state for the academic year 2018-2019. "We decided to make Telugu a compulsory subject as it is our responsibility to respect our mother tongue and our culture. Studying in English medium schools is becoming a must to acquire good education. We don't want to spoil the career of our children and that is the reason we are making it compulsory to include Telugu along with other subjects," he said. He held discussions with the officials regarding the regulations that are made to teach Telugu as a subject, after knowing about the terms of implementation to teach the mother tongue. "First we thought of making mandatory till the intermediate but the syllabus is different in all the Fcolleges. That is why it's becoming difficult to make it a compulsory subject. After observing the teaching of mother tongue in Punjab and Tamil Nadu we thought of implementing the same thing even in our state till 10th standard," KCR added. The Chief Minister said, "The Telugu University and the Sahitya Academy will decide the syllabus for the different standards."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X