వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రముఖ తెలుగు కథా రచయిత ఇచ్చాపురపు కన్నుమూత

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రముఖ తెలుగు కథా రచయిత ఇచ్ఛాపురపు జగన్నాథరావు కన్నుమూశారు. ఆయనకు 86ఏళ్లు. హైదరాబాదులోని బంజారాహిల్స్‌లోని తన స్వగృహంలో బుధవారం సాయంత్రం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

1931 సెప్టెంబరు 10న విశాఖ జిల్లా నర్సీపట్నంలో జగన్నాథరావు జన్మించారు. 1955లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ (ఆర్థిక శాస్త్రం)లో ఎంఏలో స్వర్ణ పతకం సాధించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ కస్టమ్స్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖలో ఉద్యోగంలో చేరారు. విద్యార్థి దశ నుంచే కథలు రాయడం మొదలు పెట్టారు.

Telugu Short Story writer Icchapurau Jagannath Rao passes away

జగన్నాథరావు రచించిన కథానికలు, నవలలు, నాటికలు మొత్తం 13 సంపుటాలుగా వెలువడ్డాయి. ఆంధజ్ర్యోతి, ఆంధ్రభూమి పత్రికల్లో వీక్లీ కాలమ్స్‌ రాశారు. కొన్ని తెలుగు కథలను హిందీలోకి అనువదించారు. సాహిత్య అకాడమీ ముద్రించిన 'కథాసాగర్‌' (హిందీ), '60 ఏళ్ల కథానికలు'లో జగన్నాథరావు రచనలు అచ్చయ్యాయి.

కస్టమ్స్‌, అబ్కారీ శాఖ కలెక్టర్‌గా, కేంద్ర స్థాయి హోదాలోనూ పలు బాధ్యతలు చేపట్టిన జగన్నాథరావు 1991లో ఉద్యోగ విరమణ అనంతరం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆయనకు భార్య, నలుగురు కూతుళ్లు ఉన్నారు. 1999లో తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభాపురస్కారాన్ని అందుకున్నారు. బుధవారం సాయంత్రం పంజాగుట్ట శ్మశానవాటికలో జగన్నాథరావు అంత్యక్రియలు జరిగాయి.

English summary
An eminent Telugu short story writer Icchapurapu Jagannath Rao has passed away in Hyderabad of Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X