వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోదావరి నీటి జలాల తరలింపుపై సీఎంల ఏకాభిప్రాయం, వివిధ అంశాలపై 6 గంటలపాటు చర్చ

|
Google Oneindia TeluguNews

ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. కృష్ణానదీలో నీటి లభ్యతపై అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్నందున గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందజేసే విషయంలో సీఎంలు ఏకాభిప్రాయానికి వచ్చారు. 9, 10 షెడ్యూల్ అంశాలను త్వరగా పరిష్కరించుకోలని డిసైడయ్యారు. ప్రగతి భవన్‌లో వివిధ అంశాలపై సుదీర్ఘంగా 6 గంటలపాటు చర్చించారు.

6 గంటలపాటు

6 గంటలపాటు

మధ్యాహ్నాం 1.30 గంటలకు ఏపీ సీఎం జగన్ ప్రగతి భవన్ రాగా, సీఎం కేసీఆర్ సాదర స్వాగతం పలికారు. కాసేపు వివిధ అంశాలపై డిస్కస్ చేసి.. మధ్యాహ్నా భోజనం కూడా చేశారు. విభజన అంశాలతోపాటు.. తాజా రాజకీయ పరిస్థితులపై దాదాపు 6 గంటలపాటు చర్చించారు. గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు తరలించే విషయంలో డీప్ డిస్కషన్ జరిగింది.

 గోదావరి జలాల తరలింపు

గోదావరి జలాల తరలింపు

గోదావరి నీటిని ఎక్కడి నుంచి ఎటు తరలించాలి ? ఎలా వినియోగించాలి అనే అంశంపై తదుపరి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించాలని సీఎంల సమావేశంలో నిర్ణయించారు. విభజన చట్టంలోని పలు అంశాలపై పరస్పర సహకారం, అవగాహనతో వ్యవహరిస్తే పరిష్కరించడం కష్టమేమీ కాదని సీఎంలు అభిప్రాయపడ్డారు. సమావేశంలోనే సీఎంలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో మాట్లాడారు.

ఎనిమిదోసారి...

ఎనిమిదోసారి...

ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది ఎనిమిదోసారి సీఎం కేసీఆర్‌ను కలుసుకొన్నారు. చివరిసారి సెప్టెంబర్ 23వ తేదీన భేటై.. వివిధ అంశాలపై చర్చించారు. సోమవారం సీఎంల సమావేశంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎంపీ విజయసాయిరెడ్డి సీఎం కేసీఆర్‌కు పాధాభివందనం చేశారు. గౌరవంతో ఆయనను నమష్కరించగా, కేసీఆర్ వద్దని వారించారు.

మరోసారి భేటీ

మరోసారి భేటీ

సమస్య పరిష్కారం కోసం మరోసారి సమావేశం కావాలని ఆదేశించారు. సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. సీఎం జగన్‌కు మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ స్వాగతం పలికారు.

English summary
telugu state cm’s kcr, ys jagan mohan reddy deep discussion about godavari water.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X