అమెరికాలో రోడ్డు ప్రమాదం: తెలుగు విద్యార్థి మృతి

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తెలుగు విద్యార్థి మృతి చెందాడు. మృతుడు హైదరాబాద్ శివారులోని కుత్భుల్లాపూర్‌ సర్కిల్‌ సూరారం ప్రాంతానికి చెందిన జాకబ్‌ కుమారుడు నాగ తులసిరామ్‌(26)గా గుర్తించారు.

 A telugu student allegedly killed in a road accident in US

తమ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు తల్లిదండ్రులు తెలిపారు. బుధవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో చనిపోయినట్లు ఫోన్‌ వచ్చిందని చెప్పారు.

నాగ తులసిరామ్‌ రెండు సంవత్సరాల క్రితం ఎంఎస్‌ చదివేందుకు యూఎస్‌ఏలోని బ్రిడ్జిపోర్ట్‌ యూనివర్సిటీలో చేరాడు. వాటర్‌బరీలో నివాసం ఉండే వాడని చెప్పారు. తన కుమారుడి ఆచూకీ కోసం తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని జాకబ్‌ కోరారు. ఈ విషయంపై ఎమ్మెల్యే వివేకానంద్‌ను కలిసి పూర్తి వివరాలు తెలియజేయగా ఆయన మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A telugu student allegedly killed in a road accident in America.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X