అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐరోపాలోనే ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన తెలుగురాష్ట్రాల యువకులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు యువకులు ఐరోపాలోనే అతి ఎత్తైన పర్వతం మౌంట్‌ ఎల్‌బ్రస్‌(రష్యా)ను గురువారం విజయవంతంగా అధిరోహించింది. ఈ బృందంలో నలుగురు తెలంగాణ, ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నారు.

ఈ ఆరుగురిలో రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండల కుర్వగూడకు చెందిన దాదె సునీల్‌, బలరామ్‌ రాథోడ్‌(వికారాబాద్‌), పత్‌లావత్‌ అరుణ్‌ కుమార్‌ (నల్గొండ), పాల్తియా శ్రీకుమార్‌ (నల్గొండ), ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గోసాల్‌ రాజు (విశాఖపట్నం), షేక్‌ హిమామ్‌షా(ఒంగోలు) ఉన్నారు.

Telugu youth from Telangana, AP conquer Mount Elbrus

సెప్టెంబర్ 7న ఈ ఆరుగురు సభ్యుల బృందం ఢిల్లీ నుంచి మాస్కోకు బయలుదేరారు. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 9.30 గంటలకు 5,642 మీటర్ల ఎత్తయిన పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించారు. అక్కడ భారత త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ విజయకేతనాన్ని చాటారు.

కాగా, -20 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా ధైర్యంగా పర్వతం అంచుకు చేరుకున్నారు. సెప్టెంబర్ 17న వారు స్వదేశానికి చేరుకోనున్నారు. తమ స్వగ్రామం కుర్వగూడను అధికారులు లేదా ప్రజాప్రతినిధులు దత్తత తీసుకోవాలంటూ సునీల్‌ ఈ సందర్భంగా కోరాడు.

ట్రాన్సెండ్‌ అడ్వెంచర్స్‌ సంస్థ అధ్వర్యంలో.. కోచ్‌లు శేఖర్‌బాబు, పరమేశ్‌ కుమార్‌ పర్యవేక్షణలో ఈ యాత్ర సాగింది. జులై 27న కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన 2 టీంలు ఈ మౌంట్ ఎల్‌బ్రస్ అధిరోహించడం గమనార్హం.

English summary
There is no stopping for the dynamic young brigade from both the Telugu States in the arena of adventures, especially in mountaineering. The youth, students of social welfare residential institutions from Andhra Pradesh and Telangana keep on conquering mighty mountains.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X