హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుతో బాధలేదంటూ హరీష్‌తో మంత్రాంగం: కారు ఎక్కారు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్, టిడిపిలకు ఊహించని దెబ్బ తగిలింది. టిడిపి ఎమ్మెల్యే సాయన్న, నగరానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ శాసనమండలి సభ్యుడు ఎంఎస్ ప్రభాకర రావు గురువారం టిఆర్ఎస్‌లో చేరారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన నివాసంలో వారిద్దరికీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నగరాభివృద్ధి కోసమే పార్టీలో చేరుతున్నట్లు నేతలిద్దరూ చెప్పారు. సాయన్న టిడిపితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యత్వ పదవిని వీడి కారు ఎక్కుతున్నట్లు చెప్పారు.

గురువారం ఉదయం ఈ ఇద్దరు నేతలు మంత్రి హరీశ్ రావుతో కలిసి కేసీఆర్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. వీరి చేరికలో హరీష్ రావు కీలక పాత్ర వహించినట్లుగా తెలుస్తోంది. టిఆర్ఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. కెసిఆర్ వారిని సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ బలోపేతానికి మంచి నిర్ణయం తీసుకున్నారని అభినందించారు.

టిఆర్ఎస్‌లో చేరిక

టిఆర్ఎస్‌లో చేరిక

దళిత వర్గాలకు పార్టీలో సముచిత స్థానం ఇస్తామని, వారి సేవలను అన్ని విధాల ఉపయోగించుకుంటామని కెసిఆర్ తెలిపారు. టిడిపిని వీడుతున్నందుకు కొంత బాధగా ఉన్నా, టిఆర్ఎస్‌లో చేరుతున్నందుకు సంతోషిస్తున్నానని సాయన్న తెలిపారు.

టిఆర్ఎస్‌లో చేరిక

టిఆర్ఎస్‌లో చేరిక

సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు తననెంతగానో ఆకర్షించాయని, హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ఆయన ఎంతగానో కృషిచేస్తున్నారన్నారు. నిరంతర విద్యుత్‌, తాగునీటి సరఫరాపై దృష్టిపెట్టడం.. కంటోన్మెంట్‌ ఏరియాలో రోడ్ల మూసివేతను వాయిదా వేయించటం, రెండు పడకగదుల పథకం తనను ఆకట్టుకున్నాయన్నారు.

టిఆర్ఎస్‌లో చేరిక

టిఆర్ఎస్‌లో చేరిక

టిడిపిలో తనకు అన్నివిధాల ఆదరణ లభించిందని, బాధించిన సందర్భాలు లేవని సాయన్న చెప్పారు. అయితే ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్నా ప్రాధాన్యం లభించలేదన్నారు. కంటోన్మెంట్‌ నియోజకవర్గం, హైదరాబాద్‌ అభివృద్ధి కోసం తెరాసలో చేరడం అనివార్యమైందన్నారు.

టిఆర్ఎస్‌లో చేరిక

టిఆర్ఎస్‌లో చేరిక

కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర రావు మాట్లాడుతూ... కాంగ్రెస్‌లో కార్యకర్తలకు, నేతలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, దానిని భరించలేకే ఆ పార్టీని వీడానని వెల్లడించారు.

టిఆర్ఎస్‌లో చేరిక

టిఆర్ఎస్‌లో చేరిక

టిఆర్ఎస్‌తోనే తెలంగాణ అభివృద్ధి, హైదరాబాద్‌ ప్రగతి సాధ్యమన్నారు. కాంగ్రెస్‌ను వీడడానికి అనేక కారణాలున్నాయని, పార్టీ బలోపేతానికి సూచనలు చేస్తే వాటిని నాయకత్వం పట్టించుకోలేదని తెలిపారు. ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారని, బంగారు తెలంగాణ ఆయనతోనే సాధ్యమని తెలిపారు. అందరం కలిసి కేసీఆర్‌ నేతృత్వంలో పనిచేస్తామని, బల్దియా ఎన్నికల్లో తెరాస విజయానికి కృషిచేస్తామన్నారు.

టిఆర్ఎస్‌లో చేరిక

టిఆర్ఎస్‌లో చేరిక

మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... త్వరలోనే మరికొందరు నేతలు టిడిపి, కాంగ్రెస్‌ల నుంచి తమ పార్టీలో చేరతారని తెలిపారు. హైదరాబాద్‌లో గులాబీ జెండాను ఎగురవేస్తామని, మజ్లిస్‌తో ఎలాంటి పొత్తు ఉండదన్నారు. నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ సహా 12 ఎమ్మెల్సీ స్థానాలను తెరాసనే గెలుస్తుందని చెప్పారు.

English summary
The Telugudesam and Congress suffered further setback on Thursday when one legislator each of these parties switched over to the ruling Telangana Rashtra Samiti after meeting its president and Chief Minister KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X