హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో 3,4డిగ్రీలు అధికంగా..: హైదరాబాద్ లో పెరగనున్న ఉష్ణోగ్రతలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు బేగంపేట వాతావరణ శాఖాధికారులు తెలిపారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో నగరంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇటీవల కురిసిన వర్షాలతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. భానుడు మళ్లీ తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మే నెలలో సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల అధికంగా వాతావరణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Temperatures to rise in Telangana including Hyderabad

కాగా, గత 5రోజుల్లో హైదరాబాద్ నగరంలో.. 40.7, 39.3, 39.0, 35.5, 39.0డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిష్టంగా 25.8, 27.3, 25.8, 21.9, 26.9డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

English summary
With the city's maximum temperature touching a sweltering, the local office of the Indian Meteorological Department (IMD) issued a three-day high temperature warning across Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X