వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ తాళం చెవి ఎక్కడ పెడుతున్నారు ? అతడు చూశాడంటే అంతే .. టెన్నిస్ కోచ్ ఆటకట్టించిన పోలీసులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : అతడో దొంగ .. కొందరికి కౌన్సిలింగ్ ఇస్తే మంచిగా మారి, బుద్ధిగా పనిచేస్తారు. కానీ మరికొందరు కేటుగాళ్లు మాత్రం చేయి దొంగతనం వైపు చూస్తోంది. రాజమండ్రికి చెందిన కోమలి రామకృష్ణ కూడా అదే కోవకి చెందుతాడు. దొంగతనాలు చేసి జైలుకు కూడా వెళ్లొచ్చిన కేటుగాడు .. భాగ్యనగరంలో టెన్నిస్ కోచింట్ సెంటర్‌లో చేరాడు. చూస్తే బుద్ధిమంతుడిలగా ఉంటూ .. మళ్లీ దొంగతనాలు మొదలెట్టి .. ఊచలు లెక్కిస్తున్నాడు.

 ఊరఫ్ .. రాజమండ్రి

ఊరఫ్ .. రాజమండ్రి

రాజమండ్రి వై జంక్షన్‌కు చెందిన కోమలి రామకృష్ణ ఇంటర్ చేశాడు. ఇతని అమ్మమ్మకు కొడుకులు లేకపోవడంతో రామకృష్ణనే కుమారుడిలా పెంచింది. అయితే జులాయిగా తిరగడం, చోరీలకు పాల్పడటానికి అలవాటయ్యాడు. 2012లో రాజమండ్రిలో ఓ ఇంట్లో చోరీ చేసి .. జువైనల్ హోమ్‌కు కూడా వెళ్లాడు. అయినా అతని తీరు మారలేదు. దొంగతనాలు చేస్తూ వచ్చాడు. రాజమండ్రి త్రీ టౌన్, ధవళేశ్వరం, రాజానగరం పోలీసు స్టేషన్ పరిధిలో ఆరు కేసులు ఉన్నాయి. జైలుశిక్ష అనుభవించి మకాన్ని రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు మార్చాడు.

సిటీలో మకాం ..

సిటీలో మకాం ..

హైదరాబాద్ నిజాంపేటలోని బంధువుల ఇంట్లోకి చేరాడు. కూరగాయాలు విక్రయిస్తూ .. చోరీలు చేశాడు. వర్టెక్స్ అపార్ట్ మెంట్ ఎదుట ఓ ఇంట్లో టీవీ, మిక్సీ, బైక్ దొంగతనం చేశాడు. పోలీసులు అరెస్ట్ చేసి .. జైలుకు పంపించారు. తిరిగి వచ్చిన మళ్లీ తన మకాన్ని జలవాయు విహార్ కు మార్చాడు. అక్కడ టెన్సిస్ అసిస్టెంట్ కోచ్ గా పనిచేస్తున్నాడు. కోచింగ్ సెంటర్ లో చేరిన వక్రబుద్ధి మారలేదు. మళ్లీ దొంగతనాలు ప్రారంభించాడు. పరిచయమున్న వారి ఇళ్లకు వెళుతూ .. తాళం చెవి ఎక్కడ పెడుతున్నారో గమనించేవాడు. తర్వాత వారి లేని సమయం చూసి చోరీ చేసేవాడు.

బాలుడి ఇంట్లో కూడా ...

బాలుడి ఇంట్లో కూడా ...

ఇదేవిధంగా టెన్నిస్ కోచింగ్ వచ్చే బాలుడి ఇంటిపై పాటించి .. మళ్లీ అరెస్టయ్యాడు. సర్దార్ పటేల్ నగరర్ కు చెందిన డాక్టర్ తన కుమారుడిని కోచింగ్ అకాడమీలో చేర్చించాడు. బాలుడి మంచిగా మాట్లాడే రామక‌ృష్ణ .. ప్రతిరోజు ఇంట్లో దిగబెట్టేవాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 25న ఊరెళ్తున్నామని బాలుడు రామకృష్ణకు చెప్పాడు. వారి యాత్రకు వెళ్లాక .. 27న ఇంట్లో చోరీ జరిగింది. బాలుడి వద్ద నుంచి ఇంటి తాళం చేవి కొట్టేసి దర్జాగా దొంగతనం చేశాడు. యాత్రకు వెళ్లిచ్చిన డాక్టర్ తమ ఇంట్లో చోరి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో కేసు విచారణ సమయంలో .. రామకృష్ణ కనిపించాడు. చోరీ గురించి ఆరాతీస్తే దొంగతనం చేసినట్టు అంగీకరించాడు. అతడి నుంచి 5 లక్షల విలువైన బంగారం, వెండి నగలు, టీవీ, మిక్సీ, అపాచీ బైక్ స్వాధీనం చేసుకొని .. రిమాండ్ కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

English summary
Komali Ramakrishna of Rajahmundry. The robber who went to jail for stealing and went to the tennis coaching center at hyderabad. Strangely enough .. Stolen things are beginning .. arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X