వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సానియా మిర్జాకు ఖేల్‌రత్న: సాధించిన అసమాన విజయాలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు కేంద్ర ప్రభుత్వం క్రీడా రంగంలో అత్యున్నత పురస్కారం ఇస్తోంది. టెన్నిస్ ఆటలో విశేష కృషి చేసినందుకు సానియాకు కేంద్రం రాజీవ్ ఖేల్ రత్న అవార్డును ప్రకటించనుంది. జూన్ నెలలో మార్టినా హింగిస్‌తో కలిసి వింబుల్డన్ డబుల్ టైటిల్ నెగ్గింది.

టెన్నీస్‌లో సానియా మీర్జా సాధించిన గొప్ప విజయాలకు గుర్తింపుగా క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్, ఈ అవార్డుకు ఆమె పేరును సిఫారసు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఖేల్‌రత్న అవార్డు రేసులో స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్, డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ తదితరులు పోటీపడినప్పటికీ సానియాకే ఈ అవార్డు దక్కనుంది.

అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కెరీర్‌లో తొలిసారి వింబుల్డన్ డబుల్స్ టైటిల్ సాధించిన సానియా మిర్జా ప్రస్తుతం డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ ర్యాంక్‌లో కొనసాగుతోంది. క్రీడా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని అసమాన ఆటతీరు కనబర్చింది.

 Tennis Star Sania Mirza career statistics

సానియా మిర్జా సాధించిన విజయాలు:

గ్రాండ్ స్లామ్ టైటిల్స్
* 2003 అలీసా క్లెనోవా(రష్యా)తో కలిసి బాలికల విభాగంలో వింబుల్డన్ డబుల్స్ విజేత
* 2009 మహేష్ భూపతితో కలిసి ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబ్సుల్ టైటిల్
* 2012 మహేష్ భూపతితో కలిసి ఫ్రెంచ్ ఓపెన్
* 2014 బ్రునో సోరెస్(బ్రెజిల్)తో కలిసి యూఎస్ ఓపెన్

ఆఫ్రో-ఆసియన్ గేమ్స్ (హైదరాబాద్):
* 2003 మహిళల సింగిల్స్ టైటిల్
* 2003 మహిళల డబుల్స్ టైటిల్
* 2003 మిక్సడ్ డబుల్స్ టైటిల్
* 2003 మహిళల టీమ్ టైటిల్

 Tennis Star Sania Mirza career statistics

ఆసియా గేమ్స్:
* 2000 బుసాన్ - మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్
* 2006 దోహా - మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్
* 2006 దోహా - మహిళల సింగిల్స్ టైటిల్
* 2006 దోహా - మహిళల టీమ్ టైటిల్
* 2011 గ్వాంగ్ గ్జౌ - మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్
* 2011 గ్వాంగ్ గ్జౌ - మహిళల సింగిల్స్ టైటిల్
* 2014 ఇంచియాన్ - మహిళల డబుల్స్ టైటిల్
* 2014 ఇంచియాన్ - మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్

కామన్వెల్త్ గేమ్స:
* 2010 ఢిల్లీ- మహిళల సింగిల్స్ టైటిల్
* 2010 ఢిల్లీ- మహిళల డబుల్స్ టైటిల్
* 2005 డబ్ల్యూటీఏ న్యూకమర్ ఆఫ్ ది ఇయర్

కేంద్ర ప్రభుత్వం నుంచి సానియా అందుకున్న పురస్కారాలు:
* 2004 అర్జున అవార్డు
* 2006 పద్మశ్రీ
* 2014 తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం

English summary
Wimbledon 2015 doubles champion Sania Mirza has been awarded the coveted Rajiv Gandhi Khel Ratna award by the Union sports ministry. It made for a bitter-sweet day for the Indian tennis queen, who was earlier on Tuesday booked for traffic violation in her hometown, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X