• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఫలితాల ముందు పరేషాన్ చేస్తుండు..! కేసీఆర్ పర్యటనల మర్మం పద్మనాభుడికే తెల్వాలే..!!

|

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏది చేసినా కాస్త వెరైటీగానే ఉంటుంది. మీడియా సమావేశాల్లో మాట్లాడే అంశం నుండి బహిరంగ సమావేశాల్లో పబ్లిక్ స్పీచ్ వరకూ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది. తాజాగా దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావిడితో రాజకీయాలు వేడెక్కిన తరుణంలో ఫెడరల్ ఫ్రెంట్ బలోపేతం చేసేందుకు దక్షిణ భారత యాత్ర ఆసక్తి రేపుతోంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఐదు దశలు పూర్తికావడం, మిగిలిన రెండు దశలు కూడా ఈ నెల 19న ముగియనుండగా 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో ప్రస్తుతం కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారోనని జోరుగా చర్చ సాగుతోంది.

కేసీఆర్ దక్షిణ భారత దేశ పర్యటన..! మళ్లీ చర్చనీయాంశమైన ఫెడరల్ ఫ్రంట్..!!

కేసీఆర్ దక్షిణ భారత దేశ పర్యటన..! మళ్లీ చర్చనీయాంశమైన ఫెడరల్ ఫ్రంట్..!!

ఈ సందర్భంగా కాంగ్రెస్‌, బీజేపీకి సొంతంగా మెజారిటీ స్థానాలు వచ్చే అవకాశం లేదని, మూడో ఫ్రంట్‌ లేదా బీజేపీయేతర పక్షాల కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న ప్రచారంతో ప్రధానిగా పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో కొంతకాలంగా ఏపీ సీఎం చంద్రబాబు పేరు కూడా వినిపిస్తోంది. చంద్రబాబును వ్యతిరేకిస్తున్న చంద్రశేఖర్ రావు మరోసారి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. అలాగే సోమవారం కేరళకు బయలుదేరే సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తోనూ చంద్రశేఖర్ రావు ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది.

కేసీఆర్ తో వచ్చేది ఎవరు..!!

కేసీఆర్ తో వచ్చేది ఎవరు..!!

నేతలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం..! కేసీఆర్ తో వచ్చేది ఎవరు..!!

15, 16 తేదీల్లో బెంగళూరుకు రావాలని చంద్రశేఖర్ రావును కుమారస్వామి ఆహ్వానించారు. ఫెడరల్ ఫ్రంట్ దిశగా చర్చలు మొదలు పెట్టిన చంద్రశేఖర్ రావు సోమవారం కేరళలో ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌తో భేటీ అయ్యారు. తిరువనంతపురం వెళ్లిన చంద్రశేఖర్ రావు, అక్కడ అనంత పద్మనాభస్వామిని దర్శించుకొని, విజయన్‌తో సమావేశమయ్యారు. కలిసిరండి అంటూ.. వామపక్షాలకు పిలుపునిచ్చిన ఆయన ఫెడరల్ ఫ్రంట్‌లో చేరాలని కోరారు. దాదాపు గంటన్నర సేపు ఇరు నేతల మద్య చర్చలు జరిగినట్టు తెలుస్తోంది.

 కేసీఆర్ విజయం సాధిస్తాడా..!!

కేసీఆర్ విజయం సాధిస్తాడా..!!

బీజేపి, కాంగ్రెస్ పై యుద్దం..! కేసీఆర్ విజయం సాధిస్తాడా..!!

ఈ సందర్భంగా చంద్రశేఖర్ రావు ప్రతిపాదనలు ఆచరణీయమని విజయన్ అన్నారు. దీనిపై పార్టీలో చర్చిస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఫ్రంట్ ఏర్పాటుకు చంద్రశేఖర్ రావు మరో ముందడుగు వేస్తున్నారు. ఈ నెల 13న చెన్నై వెళ్లనున్నారు. అక్కడ డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను ఆయన ఇంట్లో కలవనున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో చెన్నైకి వచ్చిన చంద్రశేఖర్ రావు అప్పుడు డీఎంకే అధినేత కరుణానిధిని పరామర్శించారు.

ఫలితాల ముందు సౌత్.. తర్వాత నార్త్..! కేసీఆర్ వ్యూహం అదే..!!

ఫలితాల ముందు సౌత్.. తర్వాత నార్త్..! కేసీఆర్ వ్యూహం అదే..!!

అలాగే స్టాలిన్‌తో ఫెడరల్‌ ఫ్రంట్‌ అంశంపై చర్చించారు. రెండు రోజులపాటు చెన్నైలో ఉన్న చంద్రశేఖర్ రావు కు డీఎంకే సాదర స్వాగతం పలికింది. తర్వాత ఆగస్టులో కరుణానిధి అంత్యక్రియలకు సీఎం హాజరయ్యారు. ఇప్పుడు మరోసారి 13న చెన్నై వెళ్లనున్నారు. ఈ సందర్భంగా దేశంలోని రాజకీయ పరిస్థితులు, ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల సరళి, ఫలితాల అనంతరం తలెత్తే పరిణామాలు, ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు అంశాలపై వారిద్దరు చర్చించనున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Many of the names have come to the fore with the campaign of the Congress and the BJP that it is unlikely that its own majority will come to power and the third front or non-BJP ally will come to power. The name of AP CM Chandrababu is also heard in this order. Chandrasekhar Rao, who opposes Chandrababu, is once again visiting various states as part of the Federal Front.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more