వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడంగల్‌లో ఉద్రిక్తత: కల్వకుర్తిలో పరస్పర దాడి, సొమ్మసిల్లిన వంశీచంద్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018 : High Tension In Kodangal, kalwakurthy And Warangal

హైదరాబాద్/మహబూబ్‌నగర్: కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలంలో నాగులపల్లిలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల మధ్య పరస్పర దాడులు జరిగాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. భారీగా బలగాల మోహరించారు.

కల్వకుర్తిలో కూడా ఉద్రిక్తత

కల్వకుర్తి అసెంబ్లీ పరిధిలో ఆమనగల్లు మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. శుక్రవారం ఉదయం పోలింగ్ సమయంలో గ్రామానికి చేరుకున్న కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నాడనే ఆరోపణతో బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కొందరు తనపై రాళ్లతో దాడి చేశారని వంశీచంద్ రెడ్డి తెలిపారు. స్వల్ప గాయాలతో ఆయన ఆమనగల్లు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. అనంతరం ఆయనను హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే దాడి సమయంలో ఆయన సొమ్మసిల్లి పడిపోయారని తెలుస్తోంది.

Tension in Kodangal, Attack on Vamshi Chand Reddy

ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోందని ఎంపీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై గొడవలు సృష్టిస్తున్నారని చెప్పారు. కొడంగల్ నియోజకవర్గంలో ఓటమి భయంతో తెరాసపై దాడులు చేస్తున్నారని చెప్పారు.

English summary
Tension in Kodangal constituency. Attack on Congress leader Kalvakuthy Vamshi Chand Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X