వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉట్నూర్‌లో టెన్షన్: దుకాణాలకు నిప్పు , వదంతులు నమ్మొద్దు: డీఐజీ

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

కుమురం భీం విగ్రహానికి చెప్పుల దండ : భగ్గుమన్న ఏజెన్సీ..!

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో ఆదిలాబాద్, లంబాడీల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఆందోళనకారులు పలు దుకాణాలకు నిప్పు పెట్టారు.

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని కొమరం భీమ్ విగ్రహన్ని అవమానించారంటూ ఆదీవాసీలు ఆందోళనలకు దిగారు. ఈ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది.

Tension in Utnoor: Adivasi protesters set fire to the shops

అయితే ఉద్దేశ్యపూర్వకంగానే కొమరం భీమ్ విగ్రహన్ని అవమానించారంటూ ఆదీవాసీలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పలు దుకాణాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు.

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అయితే ఉట్నూర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అయితే పరిస్థితి చేజారకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

కొమురం భీమ్ విగ్రహన్ని అవమానించారని ఆందోళన చేసి తిరుగు ప్రయాణమైన వారిపై లంబాడీలు దాడి చేశారని ఆదీవాసీలు ఆరోపిస్తున్నారు. దీంతో రెండు వర్గాలు దాడులు పరస్పరం దాడులకు దిగారు.

తొలుత హస్నాపూర్ వద్ద ప్రారంభమైన దాడులు సానాపూర్‌తో పాటు ఉట్నూర్‌కు విస్తరించాయి. హుటాహుటిన డీఐజీ రవివర్మ ఉట్నూర్‌కు బయలుదేరి వెళ్ళారు.

ఉట్నూర్‌లో ఉండి డీఐజీ రవివర్మ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. హైద్రాబాద్ నుండి అదనపు బలగాలను ఉట్నూర్‌కు పంపిన డీజీపీ.

ఎలాంటి వదంతులు నమ్మకూడదని డీఐజీ రవివర్మ సూచించారు. గిరిజన తండాల్లో భారీగా పోలీసులను మోహరించారు. పెట్రోల్ బంక్, మద్యం దుకాణంతో పాటు పలు దుకాణాలకు నిప్పుపెట్టారు. అయితే ఈ దాడుల్లో ఎవరు కూడ చనిపోలేదని డీఐజీ రవి వర్మ ప్రకటించారు. పోలీసులపై కూడ ఆందోళనకారులు రాళ్ళు రువ్వారు. పలువురు గాయపడ్డారు.

ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు ఉట్నూర్ క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు పది సార్లు బాష్పవాయువును ప్రయోగించారు. అంతేకాదు మూడు రోజుల పాటు 144 సెక్షన్ ను విధించారు. మరో వైపు పరిస్థితిని డీఐజీ రవివర్మ, కలెక్టర్ జ్యోతిబుద్దప్రసాద్ సమీక్షిస్తున్నారు.

English summary
Tension in Utnoor at Adilabad district on Friday. Adivasi protesters set fire to shops.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X