వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెదలు పట్టి... వర్షానికి తడిచి.. పరిషత్ ఎన్నికల నిర్వాహణలో నిలువెత్తు నిర్లక్ష్యం..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ మంగళవారం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 123 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతోంది. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. హై సెక్యూరిటీ ప్లేస్ కావడంతో భద్రతకొచ్చిన ముప్పేమీలేదని భావించారు. అయితే కౌంటింగ్ సందర్భంగా కొన్ని చోట్ల బ్యాలెట్ బాక్సులు తెరిచిన సిబ్బంది వాటిలోని బ్యాలెట్ పేపర్ల పరిస్థితి చూసి షాక్ తిన్నారు.

మాజీ ఎంపీ కేసీఆర్ తనయ కవితకు మరో బిగ్ షాక్ .. స్వగ్రామంలో బీజేపీ విజయంమాజీ ఎంపీ కేసీఆర్ తనయ కవితకు మరో బిగ్ షాక్ .. స్వగ్రామంలో బీజేపీ విజయం

బ్యాలెట్ పేపర్లకు చెదలు

బ్యాలెట్ పేపర్లకు చెదలు


కౌంటింగ్ కేంద్రాల్లో బ్యాలెట్ బాక్సులు తెరిచిన సిబ్బంది వాటిలో కొన్నింటిలో చెదలు పట్టాయని.. మరికొన్నింటిలో వర్షపు నీరు చేరినట్లు గుర్తించారు. జయశంకర్ భూపాలపల్లి జిలాల్లోని అంబటిపల్లి ఎంపీటీసీ పరిధిలోని 44, 105, సూరారం పరిధిలోని 39, 116వ నెంబర్ పోలింగ్ బూత్‌లలోని బ్యాలెట్ బాక్సులకు చెదలు పట్టింది. బ్యాలెట్ పేపర్లను సగం వరకు చెదలు తినేయడంతో వాటిని ఎలా లెక్కించాలో తెలియక తలలు పట్టుకున్నారు. విషయం కలెక్టర్ వెంకటేశ్వర్లు దృష్టికి వెళ్లడంతో బ్యాలెట్ పత్రాలను పరిశీలించిన ఆయన.. ఘటనకు సంబంధించిన వివరాలు ఎన్నికల సంఘానికి నివేదిక పంపుతామని చెప్పారు. ఈసీ ఆదేశాల అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

బ్యాలెట్ బాక్సుల్లో వర్షపు నీరు

బ్యాలెట్ బాక్సుల్లో వర్షపు నీరు

మహబూబ్‌నగర్ జిల్లాలోనూ బ్యాలెట్ పత్రాల భద్రత విషయంలో ఈసీ డొల్లతనం బయటపడింది. సీసీ కుంట, అమ్మాపూర్ ప్రాంతాల్లో ఎంపీటీసీ బ్యాలెట్ బాక్సులు తెరిచి చూడగా.. వాటిలో నీళ్లు కనిపించాయి. చాలా వరకు బ్యాలెట్ పేపర్లు నీటిలో తడిసిపోయాడు. వాటిని పరిశీలించిన కలెక్టర్ రోనాల్డ్ రాస్ విషయాన్ని రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఈసీ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. గతరాత్రి కురిసిన వర్షానికి బ్యాలెట్ పేపర్లు తడిసినట్లు తెలుస్తోంది.

ఫలితాల వెల్లడిలో జాప్యం

ఫలితాల వెల్లడిలో జాప్యం

గత నెలలో 5,659 ఎంపీటీసీలు, 534 జడ్పీటీసీ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్ తేదీకి ఓట్ల లెక్కింపునకు మధ్య ఈసారి చాలా రోజుల సమయం పట్టింది. దీంతో బ్యాలెట్ పేపర్లు ఎక్కువ రోజులు స్ట్రాంగ్ రూముల్లోనే ఉంచాల్సి వచ్చింది. ఓట్ల లెక్కింపు సాధ్యం కాకపోవడంతో అంబటిపల్లి, సూరారం ఎంపీటీసీ స్థానాలు, మహాదేవ్‌పూర్ జెడ్పీటీసీ స్థానంలో ఫలితాలను నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది.

English summary
In a bizarre incident, the authorities found termites in the ballot boxes. The ballot papers of Ambatpally village under Mahadevpur Mandal are found to be eaten out by termites. The MPDO informed about the incident to the District Panchayat Officer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X