నాగర్జున సాగర్ డ్యామ్ కు , కేటీపీపీ కి పొంచి ఉన్న ఉగ్ర ముప్పు
నాగార్జున సాగర్ డ్యామ్ కు ప్రమాదం పొంచి ఉందా ? ఉగ్రవాదుల దాడికి నాగార్జున సాగర్ డ్యామ్ ను ఎంచుకున్నారా? దశాబ్దాల కాలంగా నాగార్జునసాగర్ పై దృష్టి పెట్టిన ఉగ్రవాదులు ఇప్పటికే పలుమార్లు దాడి చేయాలనుకున్నా రా? నాగార్జునసాగర్ డ్యామ్ కు ప్రమాదం పొంచి ఉందన్న సంకేతాలు ఇస్తున్న కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఏం చెబుతోంది.
ఉచిత స్కూటీ పథకం .. మీ సేవా కేంద్రాల వద్ద మహిళల క్యూ .. ఫేక్ న్యూస్ అంటున్న అధికారులు

ఉగ్ర దాడుల విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని అలెర్ట్ చేసిన కేంద్రం
ఉగ్రవాదులను అణిచివేయడానికి, నక్సలైట్లను నిర్మూలించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఉగ్ర మూక దాడులకు పాల్పడుతూనే ఉంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు గుంటూరు జిల్లాకు మధ్యన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది ఇంటెలిజెన్స్ బ్యూరో. రెండు తెలుగు రాష్ట్రాల సాగునీటి మరియు తాగునీటి అవసరాలను తీర్చే నాగార్జునసాగర్ ప్రాజెక్టు లక్ష్యంగా ఉగ్ర దాడులు చేసే అవకాశముందని కేంద్ర విద్యుత్ శాఖ తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూ లేఖ రాసింది. ఇక అంతే కాదు నాగార్జునసాగర్ ప్రాజెక్టు మాత్రమే కాకుండా, తెలంగాణ రాష్ట్రంలోని కేటీపీపీ, కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు కు కూడా ఉగ్రవాదులతో ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది.

నాగర్జున సాగర్ డ్యాం కు, కేటీపీపీకి పొంచి ఉన్న ప్రమాదం అంటూ హెచ్చరికలు
ఇక ఈ నేపథ్యంలోనే ఇంటిలిజెన్స్ బ్యూరో నుండి అందిన సమాచారంతో తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూ లేఖ రాసింది కేంద్ర విద్యుత్ శాఖ.
గత దశాబ్ద కాలంగా అనేక పర్యాయాలు నాగార్జున సాగర్ డ్యాం ఉగ్ర దాడులు బెదిరింపులను ఎదుర్కొంది. అయినప్పటికీ ఇక్కడ భద్రతా ప్రమాణాలు మాత్రం అంతంతమాత్రంగానే చెప్పొచ్చు . తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అతిపెద్ద ప్రాజెక్టు గా ఉన్న నాగార్జున సాగర్ భద్రతను గమనిస్తే తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు చెందిన 75 మంది నాగార్జునసాగర్ ప్రాజెక్టు ను కాపలా కాస్తూ నిరంతరం పరిరక్షిస్తున్నారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ , కేటీపీపీల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు అవసరం
అయితే ఎటువంటి ఆయుధాలు లేకుండా ఈ 75 మంది సాగర్ డ్యామ్ ను దాడుల నుండి రక్షించగలరా అంటే అది ఒకింత కష్టమైన చెప్పాలి. ఇప్పటికైనా ఐబీ అధికారుల హెచ్చరికలతో అయినా తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ డ్యాం భద్రతను పటిష్టం చేయాల్సి ఉంది.
అలాగే కేటీపీపీకి కూడా కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సి వుంది. ఉగ్ర దాడుల నుండి దేశాన్ని రక్షించటానికి కేంద్రం కృషి చేస్తుంది. అయితే రాష్ట్రాలు కూడా ఉగ్ర దాడులను ఎదుర్కొనేలా , ముందే పసిగట్టేలా గట్టి భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుంది.