వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొలువులన్నీ కేసీఆర్‌ కుటుంబానికేనా?, హామీలేమయ్యాయ్?: తమ్మినేని ఫైర్

ప్రజలను నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ప్రభుత్వం హామీలను నెరవేరాల్చల్సిన అవసరం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

|
Google Oneindia TeluguNews

వరంగల్‌: మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ప్రభుత్వం హామీలను నెరవేరాల్చల్సిన అవసరం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సామాజిక న్యాయం, తెలంగాణ సమగ్రాభివృద్ధిపై సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర ఆదివారం వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోకి ప్రవేశించింది.

ఈ సందర్భంగా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట శివారులో ఆయనకు మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యకక్షుడు బోయినపెల్లి రామారావు, టిడీపీ మండల పార్టీ అధ్యకక్షుడు గోలి రాజేశ్వర్‌రావు, కాంగ్రెస్‌, టీడీపీలతోపాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పెంచికలపేట, కోతులనడుమ, వీర నారాయణపూర్‌, దండేపల్లి, బావుపేటకు పాదయాత్ర చేరుకుంది.

Thammineni veerabhadram fires at telangana government

సామాజిక అసమానతలు తొలగించాలి

అనంతరం బావుపేటలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ3.. రాష్ట్ర జనాభాలో 93 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలు అధికంగా ఉన్నాయన్నారు. వీరి బతుకులు బాగు పడకుండా తెలంగాణ ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. అట్డడుగు కులాలకు చెందిన వారు ఆర్థికంగా, సామాజికంగా, సంపదలో పూర్తిగా వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అనగారిన కులాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి జీతాలు పెంచడం జరిగిందా? అని ప్రశ్నించారు. మున్సిపాలిటీ వర్కర్‌లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన వారే ఉన్నారని, వారిని పర్మినెంట్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కార్మికులు రోజుల తరబడి సమ్మె చేసిన కనీసం చల్లించలేదని విమర్శించారు. నెలకు రూ. 4 లక్షల జీతం తీసుకుంటున్న కేసీఆర్‌.. ఆశవర్కర్‌లు, అంగన్‌వాడీ వర్కర్‌లకు ఎందుకు జీతాలు పెంచడంలేదని దుయ్యబ్టారు.

ఎన్నికల హామీల్లో దళితులకు మూడున్న ఎకరాల సాగు భూమి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల జాడలేదని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి తన కుటుంబానికి మాత్రం అన్ని కొలువులు ఇప్పించుకోవడం జరిగిందని దుయ్యబట్టారు. సామాజిక న్యాయం కోసం ప్రజా శక్తులను ఏకం చేసి సామాజిక తెలంగాణగా మార్చుకోవాలన్నారు.

ప్రజలు చైతన్యపర్చడం కోసం 17 జిల్లాలోని 780 గ్రామాలు తిరుగుతూ నేటికి 2050 కిలో మీటర్లకు చేరుకొని 18వ జిల్లాలో ప్రవేశించడం జరిగిందన్నారు. మరో 13 జిల్లాలు తిరిగి మార్చి 19న హైదరాబాద్‌కు చేరుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు జాన్‌వెస్లీ, రమ, రమణ, అబ్బాస్‌, ఆశయ్య, నగేష్‌, శోభన్‌నాయక్‌, రాజు, మర్రి వెంకటస్వామి, వాసుదేవరెడ్డి, నాగయ్య, మర్రి శ్రీనివాస్‌, కర్రె లక్ష్మన్‌, వెంకన్న, నెట్టెం నారాయణ, గొలిపెల్లి సంపత్‌, జూపాక శ్రీనివాస్‌, నార్లగిరి రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

English summary
CPM leader Thammineni veerabhadram on Sunday fired at telangana government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X