హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెంకయ్య నోట శ్రీమంతుడు: మహేష్‌కు ట్విట్టర్‌లో కిషన్ రెడ్డి అభినందన

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు సినిమా మంచి విజయం సాధించి, కలెక్షన్లలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమా పలువురి రాజకీయ నాయకలకు ఆదర్శవంతంగా నిలుస్తోంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పాలమూరు జిల్లాలోని గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేష్ బాబును ట్విట్టర్ ద్వారా అభినందించారు.

Thanks and best wishes srimanthudu mahesh babu tweets kishan reddy

ఒక ఊరిని దత్తత తీసుకుని అభివృద్ధి చేసే కథాంశంతో వచ్చిన ఈ సినిమా ఢిల్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర మంత్రులు, ఎంపీలను సైతం శ్రీమంతుడు విపరీతంగా ఆకర్షించింది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా ఢిల్లీలోని తన సహచరుల వద్ద శ్రీమంతుడు సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారట.

మజ్లిస్ చేతిలో కీలుబొమ్మగా కేసీఆర్: కిషన్ రెడ్డి

మజ్లిస్ చేతిలో సీఎం కేసీఆర్ కీలు బొమ్మగా మారారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు. కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హామీల డీవీడీలను ప్రతి ఇంటికి పంచుతామన్నారు. సెప్టెంబర్ 21ని విమోచనా దినోత్సవంగా అధికారకంగా జరపాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సూచన మేరకు వెనుకబడ్డ పాలమూరు జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు మహేశ్ బాబు సంసిద్ధత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయవంతం కావడంపై ఇప్పటికే ట్విట్టర్‌లో శుభాకాంక్షలు అందించిన రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కేటీ రామారావు.. బుధవారం మహేశ్‌బాబుకు స్వయంగా ఫోన్ చేసి అభినందించారు.

శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక పల్లెను దత్తతకు తీసుకోవాలని కోరారు. దీనికి మహేష్ బాబు సానుకూలంగా స్పందించారు. అత్యంత వెనుకబాటుకు గురైన పాలమూరు జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు.

ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయన ఈ ఆసక్తికర అంశాన్ని పోస్ట్ చేశారు. 'గ్రామజ్యోతి'లో భాగంగా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ కోరిన మీదటే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని మహేష్ బాబు ప్రకటించారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన స్మార్ట్ విలేజ్ కార్యక్రమం కింద తన సొంత గ్రామమైన బుర్రిపాలెంను దత్తత తీసుకునేందుకు స్ఫూర్తినిచ్చిందని మహేష్ తెలిపారు.

English summary
Telangana bjp president G.Kishan Reddy says thanks to mahesh babu for adopting a village in Paalamuru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X