వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పుడు వార్తలు ప్రచారం చేసిన మీడియాకు ధన్యవాదాలు .. నన్నెవరూ అరెస్ట్ చెయ్యలేరు .. రవి ప్రకాష్

|
Google Oneindia TeluguNews

టీవీ9 రవి ప్రకాష్ పై వస్తున్న ఆరోపణలు , రెండు రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చెప్పారు టీవీ 9 సిఈవో రవి ప్రకాష్ . రవి ప్రకాష్ ఫోర్జరీ చేశాడని , రవి ప్రకాష్ ను అరెస్ట్ చెయ్యనున్నారన్న వార్తలను ఆయన ఖండించారు . వార్తల నేపథ్యంలో స్పెషల్ లైవ్ షోతో తెరపైకి వచ్చిన రవిప్రకాశ్ తన గురించి వస్తున్న వార్తల వల్ల చాలా మంది గందరగోళం ఏర్పడిందని చాలా ఆవేశంగామాట్లాడారు. దీంతో ఎంతో మంది తనకు ఫోన్లు చేస్తున్నారని.. టీవీ 9 ఆఫీస్ కు ఫోన్లు చేస్తున్నారని చెప్పిన రవి ప్రకాష్ ఎవరు ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదని.. తనను ఎవరు అరెస్ట్ చేయలేరని రవిప్రకాశ్ స్పష్టం చేశారు.

టీవీ9 యాజమాన్యం వివాదం..! నిధుల మళ్లింపు అంశంలో రవిప్రకాష్‌పై ఫిర్యాదు..!!టీవీ9 యాజమాన్యం వివాదం..! నిధుల మళ్లింపు అంశంలో రవిప్రకాష్‌పై ఫిర్యాదు..!!

తనపై ఇంతటి అభిమానం ఉన్న తోటి ఛానళ్ళకు ధన్యవాదాలు అన్న రవి ప్రకాష్

తనపై ఇంతటి అభిమానం ఉన్న తోటి ఛానళ్ళకు ధన్యవాదాలు అన్న రవి ప్రకాష్

ఇక సాటి మీడియాపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. తోటి ఛానళ్లు కాస్త బాధ్యతయుతంగా వ్యవహరించి వార్తలు ప్రసారం చేసి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.రవిప్రకాశ్ రెండు రోజుల నుంచి ఆజ్ఞాతంలోకి వెళ్లారు. పోలీసులు వెతుకుతున్నారు. తప్పించుకుని తిరుగుతున్నారు. ఎవరో సంతకాన్ని ఫోర్జరీ చేశారు.. టీవీ9 నుంచి వేరే ఛానల్‌కు నిధులు మళ్లీంచారని వార్తలు వస్తున్నాయన్నారు.ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు వార్తలు ప్రసారం చేస్తున్నారని.. తనపై ఇంతటి అభిమానం ఉన్న తోటి ఛానెళ్లకు రవిప్రకాశ్ ధన్యవాదాలు తెలిపారు.

ఎన్‌సీఎల్టీ కేసు 16వ తేదీన విచారణ... తనపై బనాయించే తప్పుడు కేసులు నిలబడవు .. రవి ప్రకాష్

ఎన్‌సీఎల్టీ కేసు 16వ తేదీన విచారణ... తనపై బనాయించే తప్పుడు కేసులు నిలబడవు .. రవి ప్రకాష్

తాను రవిప్రకాశ్‌గా టీవీ9 ఫౌండర్, ఛైర్మన్, సీఈవోగా టీవీ9 హెడ్ క్వార్టర్స్, బంజారాహిల్స్ నుంచి మాట్లాడుతున్నానని.. గత పదిహేను సంవత్సరాలుగా తాను ఇక్కడి నుంచే పనిచేస్తున్నానని ఆయన చెప్పుకున్నారు .దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో టీవీ9 విజయకేతనం ఎగురువేసిందని, జర్నలిజమంటే మసాలా వార్తలు కాదని.సమాజంలో ఎంతో కొంత మార్పు తీసుకురావడమని రవిప్రకాశ్ తెలిపారు.అలా టీవీ9 తన క్రెడిబులిటీని కాపాడుకుందని ఆయన అన్నారు. ఎన్‌సీఎల్టీ కేసు 16వ తేదీ విచారణకు రానుందని.. దానిని అడ్డం పెట్టుకుని కొందరు తనపై తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేశారని.. అయితే అలాంటి తప్పుడు కేసులు నిలబడవని, సత్యానిదే అంతిమ విజయమన్నారు.

తాను ఎక్కడికీ పారిపోలేదు .. టీవీ9 ఆఫీస్ లో మీ ముందు లైవ్ లో ఉన్నా

తాను ఎక్కడికీ పారిపోలేదు .. టీవీ9 ఆఫీస్ లో మీ ముందు లైవ్ లో ఉన్నా

తాను ఎక్కడికి పారిపోలేదని మొన్న రాత్రి 9 గంటల బులెటెన్‌లో ప్రజలు తనను చూశారని.. నిన్న తాను బయటి వూరికి వెళ్లడం వల్ల ఆఫీసుకు చేరుకోవడంలో ఆలస్యమైందని రవిప్రకాశ్ స్పష్టం చేశారు .టీవీ9 ఎప్పటిలా సామాజిక బాధ్యతతో వార్తలు ప్రసారం చేస్తుందని, ఎటువంటి ఆరోపణలనైనా తిప్పి కొట్టి జర్నలిజానికి సంబంధించిన విలువలతో వార్తలను ప్రసారం చేస్తూనే ఉంటామని ఆయన తెలిపారు .

ఎవరో ఇచ్చిన ధనాన్ని వాడకుండా సాటి మీడియా వార్తలు ఇచ్చి ఉంటే బాగుండేది అంటున్న రవి ప్రకాష్

ఎవరో ఇచ్చిన ధనాన్ని వాడకుండా సాటి మీడియా వార్తలు ఇచ్చి ఉంటే బాగుండేది అంటున్న రవి ప్రకాష్

టీవీ9 గత 15 సంవత్సరాలుగా నెంబర్‌వన్ పొజిషన్‌లో ఉండటానికి కారణం క్రెడిబుల్ న్యూస్ అని, ఎవరో ఇచ్చిన ధనాన్ని వాడకుండా వార్తలు ఇచ్చి ఉంటె , క్రెడిబిలిటి విషయంలో పనిచేసి ఉంటే మిగిలిన ఛానల్స్ కు మంచి గుర్తింపు వచ్చేదని ఆయన పేర్కొన్నారు . మిగిలిన ఛానెల్స్ ఇచ్చిన తప్పుడు వార్తలకు ధన్యవాదాలని వారు భవిష్యత్తులోనైనా క్రెడిబుల్ న్యూస్ టెలికాస్ట్ చేస్తారని ఆశిస్తున్నానని ఆయన వెల్లడించారు.జర్నలిజం విలువల కోసం తాము ఎప్పుడు నిలబడ్డామని.. భవిష్యత్తులోనూ నిలబడతామని రవిప్రకాశ్ పేర్కొన్నారు . ఈ గందరగోళాన్ని తగ్గించేందుకు తాను ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లు ఆయన వెల్లడించారు

English summary
Ravi Prakash, TV9 CEO, said that the allegations of TV9 Ravi Prakash and from two days he was obscanded are untrue. Ravi Prakash has filed for forgery and Ravi Prakash is going to arrest news are fake and he denied them. Ravi Prakash who came up with a special live show on the news was gave a clarity that he was not obscanded. He has responded to the media in his own style. He said that it would be nice if some of the other channels acted responsibly.Ravi Prakash thanked fellow channels who were so fond of him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X