వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ నా జన్మభూమి: కెటిఆర్‌తో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇన్వెస్టుమెంట్ రోడ్ షో నిర్వహించారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది.

ముంబైలో నిర్వహించిన తెలంగాణ ఇన్వెస్ట్‌మెంట్ రోడ్ షోలో భాగంగా శుక్రవారం బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇతర సేవారంగాలకు చెందిన వివిధ దిగ్గజాలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రముఖ బాలీవుడ్ హీరో, వివేక్ ఒబెరాయ్‌తో కూడా సమావేశమయ్యారు.

ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఉన్న అవకాశాలపై చర్చించారు. అనంతరం మంత్రి కేటీఆర్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ముంబై పర్యటనకు సంబంధించిన ఆయా ఫొటోలు, ట్వీట్లతోపాటు వివేక్ ఒబెరాయ్‌ను కలిసిన అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్‌పై స్పందించిన వివేక్ రీట్వీట్ చేశారు.

కేటీఆర్‌ను కలిశానని, మూడు మాటల్లో ఆయన గురించి చెప్పాలంటే తెలివైన, స్ఫూర్తిదాయకమైన, ఓ ప్రత్యేకత కలిగి ఉన్న వ్యక్తి అన్నారు. తన రాష్ట్ర అభివృద్ధి పట్ల మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు.

దీనికి కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందిస్తూ, వివేక్ ఒబెరాయ్... మీ స్పందన బాగుందని, తెలంగాణ, భారతదేశ అభివృద్ధి కోసం కృషి చేద్దామన్నారు. ఈ ట్వీట్‌కు సైతం వివేక్ ఒబెరాయ్ రీట్వీట్ చేశారు. మీ స్పందన చాలా బాగుంది రామ్ అన్నా, తెలంగాణ నా జన్మభూమి. భారత్ నా రాష్ట్ర భూమి. మీ సేవ అంటూ రీట్వీట్ చేశారు.

English summary
Minister KTR met movie star Vivek Oberoi and discussed about development of Entertainment Sector in Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X