వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఆడియో నాది కాదు: వైరలవుతోన్న మేసేజ్‌పై డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌కు కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. అయితే ఆయన పేరుతో ఓ ఆడియో మేసేజ్ వైరలవుతోంది. దీనిపై పద్మారావు గౌడ్ స్పందించారు. అదీ తన వాయిస్ కాదని స్పష్టంచేశారు. తాను హోం క్వారంటైన్‌లో ఉన్నానని.. ప్రజల ఆశీర్వాదంతో చల్లగా ఉన్నానని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

 that audio is not mine: deputy speaker padmarao goud

తన సన్నిహితుడితో పద్మారావు గౌడ్ మాట్లాడినట్టు ఒక వీడియో వైరలైంది. తాను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యానని చెప్పడంతో ఆడియో మొదలవుతోంది. కరోనా వైరస్ చికిత్స కోసం సొంటి, లవంగాలు, యలకులు కలిపి దంచి పొడిచేసుకొని.. వేడి నీటితో కలిపి రోజు తీసుకోవాలని సూచించారు. ఆస్పత్రిలో ఉన్నన్నీ రోజులు పారాసిటమాల్, దగ్గు మందు ఇచ్చినట్టు పద్మారావు గౌడ్ తెలిపారు.

Recommended Video

Nellore Tourism Office Incident : దివ్యాంగురాలైన మహిళపై ఇనుప రాడ్డుతో దాడి, బాలీవుడ్ తారల ఆగ్రహం..!!

ఆస్పత్రిలో ఈ విధంగా చికిత్స కొనసాగుతోందని పద్మారావు తెలిపారు. మిగతా వారికి కూడా చెప్పాలని ఆడియో క్లిప్‌లో ఉంది. ఈ ఆడియో సోషల్ మీడియోలో తెగ చక్కర్లు కొడుతోంది. చివరికీ పద్మారావు గౌడ్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. ఆ ఆడియో తనది కాదని స్పష్టంచేశారు. తాను మాత్రం క్షేమంగా ఉన్నానని తెలిపారు.

English summary
that audio is not mine telangana deputy speaker padmarao goud tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X