వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ చిట్ చాట్ చాలా హాట్ గురూ..! కాంగ్రెస్ ఉతికి ఆరేసిన కేటీఆర్..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చాలా కాలం తర్వాత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా తో చిట్ చాట్ చేసారు. చాలా అంశాలను మీడియాతో షేర్ చేసుకున్నారు. ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారం పట్ల టీఆర్ఎస్ ఎల్పీలో కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ సంక్షోభం లో ఉందిని, ఎఐసీసీ కి ఇపుడు అధ్యక్షుడే లేరని, తెలంగాణ పీసీసీ కి కూడా లేనట్టే ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఏపీ అసెంబ్లీ లో జరుగుతున్న చర్చల పై మాకు ఆసక్తి లేదని, కర్ణాటకలో జరుగుతున్న బల పరీక్షపై కూడా అంత ఆసక్తి లేదని ఆయన అన్నారు అసెంబ్లీ ఆమోదించిన కొత్త మున్సిపల్ చట్టం అవినీతి ని పారదోలుతుంది. ప్రజలకు మేలు చేసేలా చట్టం ఉంది. రాజకీయ జోక్యం తగ్గి ప్రజలకు సేవలు పారదర్శకంగా అందుతాయి.

 దేశంలో కాంగ్రెస్ ఒంటరైపోయింది..! పార్టీని నడిపించేవాడే లేడని కేటీఆర్ ఎద్దేవా..!!

దేశంలో కాంగ్రెస్ ఒంటరైపోయింది..! పార్టీని నడిపించేవాడే లేడని కేటీఆర్ ఎద్దేవా..!!

ప్రజలకు అవినీతి చీడ నుంచి రక్షణ కల్పించడం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ద్యేయం. సీఎం మొండి వారు ..అనుకున్నది సాధిస్తారు. మున్సిపల్ చట్టం పై అవగాహన కల్పించేందుకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. కొత్త చట్టం ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది. కొత్త చట్టం తో ఉద్యోగులు ఒకే చోట, ఒక జిల్లాలో పాతుకు పోవడం కుదరదు.. ఇది శుభపరిణామం. పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టం తరహాలో కొత్త రెవెన్యూ చట్టం రాబోతోంది. ప్రజల కు అవినీతి రహిత పాలన ఇవ్వడం మా ప్రభుత్వ ధ్యేయం . కొత్త మున్సిపల్ చట్టం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి కూడా వర్తిస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదే.

మున్సిపల్ చట్టం దేశానికే ఆదర్శం..! కొత్త చట్టాన్ని ఆకాశానికెత్తిన కేటీఆర్..!!

మున్సిపల్ చట్టం దేశానికే ఆదర్శం..! కొత్త చట్టాన్ని ఆకాశానికెత్తిన కేటీఆర్..!!

మున్సిపాలిటీ ల్లో 75 గజాల్లోపు స్థలంలో ఇళ్ల నిర్మాణానికి అనుమతి అవసరం లేదని కొత్త చట్టం లో చెప్పడం పేదలకు ఊరట నిచ్చే అంశం. దీన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. కొత్త మున్సిపల్ చట్టం తో జిల్లా కలెక్టర్లకు పని భారం పెరుగుతుందని అనుకోను. జిల్లాకు మూడు, నాలుగు మున్సిపాలిటీ లే ఉన్నాయి కనుక కలెక్టర్ల పై పెద్దగా భారం ఉండదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలనా వికేంద్రీకరణ జరుగుతోంది. ప్రజలకు జరుగుతున్న మేలేమిటో నేను రాజన్న సిరిసిల్లలో ప్రత్యక్షంగా చూస్తున్నా. కొత్త మున్సిపల్ చట్టంతో ప్రజల పై భారం పడకుండా చూస్తామని కేటీఆర్ తెలిపారు.

సభ్యత్వంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్..! సంతృప్తి వ్యక్తం చేసిన తారక రామారావు..!!

సభ్యత్వంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్..! సంతృప్తి వ్యక్తం చేసిన తారక రామారావు..!!

టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఇప్పటికే 35 లక్షలు దాటింది ..అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం. గతం లో టీఆర్ఎస్ సభ్యత్వం 43 లక్షలు ఉంది. దాన్ని అధిగమిస్తాం. బీజేపీ వాళ్ళు నాలుగు ఎంపీ సీట్లు గెలవగానే ఆగడం లేదు. బీజేపీ గెలిచింది ఎనిమిది జడ్పీటీసీ లు మాత్రమే. ఎవరేమిటో మున్ముందు తేలుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అగ్రభాగాన ఉంటుంది ..రెండో స్థానం గురించి ఆ రెండు పార్టీ లు తేల్చుకోవాలి ..మాకెందుకు ?. మంచి మున్సిపల్ చట్టం తెచ్చినప్పుడు కచ్చితంగా ఎన్నికల్లో టీఆర్ఎస్ కు కచ్చితంగా లాభం ఉంటుంది. గత ఐదున్నరేళ్ళ లో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో చట్టాలు తెచ్చామన్నారు. కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాల కేసు కోర్టు లో ఉంది. కోర్టు ఏం చెబుతుందో చూద్దాం. వివాదం కోర్టు లో ఉండగా నేను మాట్లాడను. తెలంగాణ గవర్నర్ ను మార్చడం పై సమాచారం లేదు. గవర్నర్ వ్యవస్థల్లో తలదూర్చి ఏదో చేయడం లాంటిది ఏం ఉండదు. ఏ వ్యవస్థ అయినా దాని పరిధి లో అది పని చేస్తే ఇబ్బందులు ఉండవు. ఎమ్మెల్యేలు, జర్నలిస్టుల స్థలాల కేసు సుప్రీం కోర్టు లో ఉంది. వారం రోజుల్లో ఇందుకు సంబంధించి పరిష్కారం కనుగోవాలని ఈ రోజే సీఎం కేసీఆర్ సీఎంఓ అధికారులను ఆదేశించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కార బాధ్యత నాది. త్వరలోనే జర్నలిస్టు ప్రతినిధులతో భేటీ అవుతానని కేటీఆర్ అన్నారు.

English summary
After a long time, TRS working president had a chat with KTR media. Many items were shared with the media. Telangana Congress deal mainly in the TRS LP, KTR responded. The Congress is in crisis, the AICC has no president and the Telangana PCC does not even exist said KTR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X