వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు అందుకే యూటర్న్ బాబు అయ్యాడు... డా. లక్ష్మణ్

|
Google Oneindia TeluguNews

ఏపి సీఎం చంద్రబాబునాయుడుపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ విమర్శలు గుప్పించాడు. చంద్రబాబు నాయుడు ఓవైపు ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ మరోవైపు టీడీపీ అధికారంలోకి వస్తుందంటూ విరుద్ద ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. దీంతో చంద్రబాబుకు ఓటమికి కారణాలు వెతుకుతున్నారని ఆయన ఆరోపించారు.2014లో బాగా పనిచేసిన ఈవీఎంలు ఇప్పుడు ఓడిపోయో పరస్థితి వచ్చేసరికి ఈవీఎంలు ట్యాంపరింగ్‌ జరుగుతుందా అంటూ ఆయన ప్రశ్నించారు.అందుకు బాబు యూటర్న్ బాబు అయ్యారని ,అయన మనస్థత్వం విచిత్రంగా ఉంటుందని ఎద్దేవా చేశారు.

 సింహం సింగిల్‌గానే వస్తుంది

సింహం సింగిల్‌గానే వస్తుంది

ఈనేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ రాష్ట్ర్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ ,సింహం సింగిల్‌గానే వచ్చి ఎన్నికల్లో గెలుపును స్వీప్ చేస్తుందని అన్నారు. ఈనేపథ్యంలో దేశంలో తిరిగి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని అన్నారు. మోడీ చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారని, అయిదు సంవత్సరాలల్లో అవినీతి లేని పరిపాలను అందించడంతోపాటు అంతర్గత భద్రత విషయంలో మోడీ కీలక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు.ఈనేపథ్యంలోనే బాలకోట్ స్ట్ర్రైక్ అని ఆయన చెప్పారు. ఈనేపథ్యంలోనే ప్రజలు సింగిల్‌గా వచ్చిన సింహానికే ప్రజలు పట్టం కట్టారని, గుంపులుగా వచ్చిన వారని బొందపెట్టారని చెప్పారు.

సర్జికల్ స్ట్ర్రైక్స్‌లో దోమలు కూడ చావలేదని ఎద్దేవా చేశారు.

సర్జికల్ స్ట్ర్రైక్స్‌లో దోమలు కూడ చావలేదని ఎద్దేవా చేశారు.

సర్జికల్ స్ట్ర్రైక్స్‌లో బాగంగా సైనికలు సహోసోపేత నిర్ణయాలు తీసుకుంటే వాటికి రుజువులు కావాలని ప్రతిపక్షాలు అడిగారని విమర్శించారు. కాగా ఈదాడిలో దోమలు కూడ చావలేదని ఎద్దేవా చేశారని ఆయన మండిపడ్డారు.భారత దేశం కంటే పాకిస్థాన్‌లోని మసూద్ అజర్‌పైనే ఎక్కువగా నమ్మకం ఉంచారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.కాగా మోడీని ఓడించేందుకు జైలు నుండి వచ్చి కూటమీ కట్టారని కట్టారని అన్నారు.అయితే కూటమిని ప్రజలు అంగీకరించలేదని అన్నారు.

జోష్‌లో ఉన్న రాష్ట్ర్ర బీజేపీ నేతలు

జోష్‌లో ఉన్న రాష్ట్ర్ర బీజేపీ నేతలు

దేశవ్యాప్తంగా జరిగిన ఎగ్జిట్‌పోల్స్ వెలువడిన నేపథ్యంలోనే కేంద్రం అధికార బీజేపీ తిరిగి అధికారం చేపడుతుందనే ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర్ర బీజేపీలో జోష్ పెరిగింది.కేంద్రంతోపాటు తెలంగాణ కూడ బీజేపీకి రెండు స్థానాలు వస్తాయని పలు సర్వేలు అంచనాలు వేశాయి. దీంతో ఆపార్టీనాయకులు పూర్తి జోష్‌లో ఉన్నారు. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ బీజేపీకి సిట్టింగ్ స్థానంకాగా ఆ స్థానంలో ఉన్న కేంద్రమాజీ మంత్రి దత్తత్రేయను కాదని మాజి ఎమ్మెల్యే కిషన్‌రెడ్డికి కేటాయించిన విషయం తెలిసిందే,ఇక ఈస్థానంతోపాటు మహబుబ్‌నగర్, కరీంనగర్ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్న దీమాతో ఆపార్టీ నేతలు ఉన్నారు.

English summary
Telangana BJP president Dr. Laxman criticized AP CM Chandrababu Naidu.He alleged that he was looking for reasons for defeat.He also criticized tampering,and saying on the other hand that TDP will be in power
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X