India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్నిపథ్ పథకమే బోగస్; మోడీ.. పాలన చేతకాకుంటే దిగిపో: మంత్రి ఎర్రబెల్లి ధ్వజం

|
Google Oneindia TeluguNews

అగ్ని పథ్ ఆందోళనల నేపధ్యంలో రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌ శాఖా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని పథ్ పై దేశం అట్టుడికింది.. ఇంకా ఆ మంటలు ఆరనే లేదు అంటూ వ్యాఖ్యానించారు. కాశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా ఆందోళనలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దేశభక్తిని, దేశ భద్రతను మీరు తాకట్టు పెట్టారు అంటూ కేంద్రం తీరుపై ఎర్రబెల్లి దయాకర్ రావు విరుచుకుపడ్డారు.

 దేశ రక్షణకు పోరాడే సైనికులను కాంట్రాక్ట్ కార్మికులుగా మారుస్తారా?

దేశ రక్షణకు పోరాడే సైనికులను కాంట్రాక్ట్ కార్మికులుగా మారుస్తారా?


దేశ రక్షణకు ప్రాణాలు తెగించి పోరాడే సైనికులను కాంట్రాక్ట్ కార్మికులుగా మారుస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత వాళ్ళను మీ పార్టీ ఆఫీస్ లకు వాచ్ మెన్ లు, గార్డులు గా పెట్టుకుంటారా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ దిక్కుమాలిన తనానికి ఇది నిదర్శనమని మండిపడ్డారు. అయ్యా మోడీ గారు.. ఇదే నా దేశాన్ని రక్షించే సైనికులకు మీరిచ్చే గౌరవం అంటూ నిలదీశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ బిడ్డ పోలీస్ కాల్పుల్లో అమరుడు అయ్యాడు.. అనేక మంది యువకులు గాయపడ్డారని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి నిరుద్యోగుల జీవితాలతో కేంద్రం ఆటలు ఆడుకుంటున్నదని మండిపడ్డారు.

అగ్నిపథ్ పై కేంద్రం నిర్ణయం.. నిరుద్యోగుల మ‌నోభావాల‌ను కించ‌ప‌ర్చ‌డ‌మే

అగ్నిపథ్ పై కేంద్రం నిర్ణయం.. నిరుద్యోగుల మ‌నోభావాల‌ను కించ‌ప‌ర్చ‌డ‌మే

కేంద్రం దేశవ్యాప్త నిరుద్యోగుల డిమాండ్లను కనీసం పట్టించుకోవడం లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు అసహనం వ్యక్తం చేశారు. కనీసం అగ్నిపథ్ పథకాన్ని మళ్ళీ సమీక్షిస్తామని కూడా చెప్పలేదు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. కేంద్రం ఒంటెద్దు పోక‌డ‌ల‌కు పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని పథ్ ప‌థ‌కం ఆగదని సైనిక అధికారి అరుణ్ పూరి ప్రకటించటం.. నిరుద్యోగుల మ‌నోభావాల‌ను కించ‌ప‌ర్చ‌డ‌మే అని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రుల మాటలు పుండు మీద కారం చల్లి నట్లు ఉన్నాయని వ్యాఖ్యానించారు

యువతను ఆర్మీకి దూరం చేసే నిర్ణయం

యువతను ఆర్మీకి దూరం చేసే నిర్ణయం

సైన్యం ప‌ట్ల దేశంలోని ప్ర‌తి ఒక్క‌రికి ఉన్న గౌర‌వాన్ని దిగ‌జార్చే కుట్ర‌లు కేంద్ర ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. ఈ చర్య సైన్యంలో చేర‌డానికి యువ‌తను దూరం చేయ‌డ‌మే అవుతుంది.. దీంతో దేశ భ‌ద్ర‌త‌కు ఇబ్బందులు ఏర్ప‌డే అవ‌కాశాలు ఉంటాయని వ్యాఖ్యానించారు.యువ‌త‌ను ఆర్మీకి దూరం చేసి.. ఆర్‌.య‌స్‌.య‌స్‌.కు ద‌గ్గ‌ర చేసేందుకు కేంద్రం కుట్ర‌లు చేస్తున్న‌ట్లుందని అనుమానం వ్యక్తం చేశారు. అగ్ని వీరులకు బట్టలు ఉతకడం, కటింగ్, షేవింగ్ చేయడం నేర్పి, వాళ్ళు బయటకు వచ్చాక వాళ్లకు ఆ పనులు దొరికేట్లు చేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవమానిస్తున్నారు అంటూ మండిపడ్డారు. మరోవైపు, బీజేపీ ప్రధాన కార్యదర్శి విజయ వర్గీయ మాట్లాడుతూ, తమ బీజేపీ అఫీస్ కు సెక్యూరిటీ గార్డులుగా అగ్ని వీరులను పెట్టుకుంటా మని అవహేళ‌న‌గా మాట్లాడారని విమర్శించారు.

 మీ పిల్లలను అగ్ని వీరులుగా పంపే దమ్ముందా?

మీ పిల్లలను అగ్ని వీరులుగా పంపే దమ్ముందా?

మీ పిల్లలను అగ్ని వీరులు గా పంపే దమ్ముందా? అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. నిరుద్యోగులు అంటే మీకు అంత చులకనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు, అధికార మథం తో, కళ్ళు మూసుకుని మాట్లాడుతున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. అందుకే మొన్న జరిగిన అల్లర్ల మీద కానీ, యూత్ పై కానీ బీజేపీ, కేంద్రం మాట్లాడలేదు. కనీసం చనిపోయిన, గాయపడిన పిల్లలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించలేదు అని ఎర్రబెల్లి అసహనం వ్యక్తం చేశారు.

మీరు పెట్టిన చిచ్చులో చనిపోయిన రాకేష్ కుటుంబానికి భరోసా ఏది?

మీరు పెట్టిన చిచ్చులో చనిపోయిన రాకేష్ కుటుంబానికి భరోసా ఏది?

మీరు పెట్టిన చిచ్చులో చనిపోయిన యువ‌కుడు వ‌రంగ‌ల్ జిల్లా ఖానాపురం మండ‌లం ద‌బీర్‌పేట‌కు చెందిన రాకేశ్ కుటుంబానికి సీఎం కెసిఆర్ గారు 25లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. రాకేష్ కుటుంబంలో వారి విద్యార్హతలు బట్టి ఒక్క ఉద్యోగం ఇస్తామని చెప్పారని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. కేంద్రం చేసిన ఒక తప్పుడు నిర్ణయం వల్ల ఈ ప్రాణ నష్టం జరిగింది. అయినా కేంద్రానికి, బీజేపీ కి కనీస మానవత్వం లేదు కానీ అసహనం వ్యక్తం చేశారు. సైనికుల అవమానపరిచే మాటలు మాట్లాడటం సిగ్గుచేటు అని పేర్కొన్న ఎర్రబెల్లి అర్థం పర్థం లేని పథకం తెచ్చి అమాయకులను పొట్టన పెట్టుకుంటున్నారు అంటూ మండిపడ్డారు.

అగ్ని పథ్ పథకమే ఒక బోగస్.. మోడీ దిగిపో ..

అగ్ని పథ్ పథకమే ఒక బోగస్.. మోడీ దిగిపో ..


నిరుద్యోగులతో పెట్టుకున్నారు వారి ఆగ్రహానికి గురి అయితే అంతేసంగతులు అంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. అగ్నిపథ్ పథకమే ఒక బోగస్ పథకమని మండిపడ్డారు. వ్యవసాయ చట్టాలతో రైతులను మోసం చేశారని, రైతులు తిరుగుబాటు చేస్తే తోక ముడిచారు అని పేర్కొన్న ఎర్రబెల్లి ఇప్పుడు యువత ఆగ్రహానికి కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సరిగా పని చేయడం రాకపోతే మోడీ ప్రధాని పీఠం నుండి దిగిపోవాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. ఇక నిరుద్యోగులు సంయమనం పాటించాలని, శాంతియుత మార్గంలో పోరాటం చేద్దామని, కేంద్ర వైఖరిపై అందరం కలిసికట్టుగా నిరసన తెలియజేద్ధామని ఎర్రబెల్లి సూచించారు.

English summary
Errabelli said the Agneepath scheme was bogus and would be turned soldiers who sacrificed their lives for the country's defense into contract labor. Minister Errabelli will raise the flag saying if Modi is not able to rule, step down.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X