హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

The beast: సైదాబాద్ హత్యాచార నిందితుడి మృతదేహం లభించడంపై స్పందించిన మంత్రి కేటీఆర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలో ప్రకంపనలు సృష్టించిన హైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీ హత్యాచారం కేసు ఉదంతం ఓ కొలిక్కి వచ్చింది. ఈ ఘటనలో నిందితుడు పళ్లంకొండ రాజు మృతదేహం పోలీసులకు లభించింది. స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలో రైల్వే పట్టాల వద్ద అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుడిచేతి మీద ఉన్న మౌనిక అనే టాటూతో ఆ మృతదేహం రాజుదేనని పోలీసులు నిర్ధారించారు. పోస్ట్‌మార్టమ్ కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

ఆరేళ్ల చిన్నారి అత్యాచార నిందితుడి మృతదేహం లభ్యం: రైల్వే ట్రాక్‌పై: చేతిపై ఆ గుర్తుతోఆరేళ్ల చిన్నారి అత్యాచార నిందితుడి మృతదేహం లభ్యం: రైల్వే ట్రాక్‌పై: చేతిపై ఆ గుర్తుతో

టీఆర్ఎస్ టార్గెట్‌గా

టీఆర్ఎస్ టార్గెట్‌గా

డీఎన్ఏ శాంపిళ్లను సేకరించి, నిర్ధారణ కోసం ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో వారం రోజుల కిందట ఆరేళ్ల చిన్నారిపై నిందితుడు పళ్లంకొండ రాజు అత్యాచారానికి పాల్పడి.. అనంతరం దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన సంచలనం రేపింది. రాజకీయంగా దుమారం రేపింది. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని.. దాదాపు అన్ని రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు సాగించారు. ఆరోపణలను సంధించారు.

ఎన్‌కౌంటర్ డిమాండ్..

ఎన్‌కౌంటర్ డిమాండ్..

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరో అడుగు ముందుకేసి- కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కూడా కోరారు. మరోవంక- నిందితుడు పళ్లంకొండ రాజును ఎన్‌కౌంటర్ చేయాలనే డిమాండ్ విస్తృతంగా వినిపించింది. ఇలాంటి మానవ మృగాలను కాల్చి పారేయాలంటూ నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను షేక్ చేశారు. మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌పై వేలాది పోస్టులు షేర్ అయ్యాయి.

స్పందించిన సెలెబ్రిటీలు

స్పందించిన సెలెబ్రిటీలు

సూపర్ స్టార్ మహేష్ బాబు, నటుడు మంచు మనోజ్, క్రికెటర్ హనుమ విహారి వంటి సెలెబ్రిటీలు సైతం ఈ ఘటనపై స్పందించారు. మరొకరు ఇలాంటి అమానుష ఘాతుకాలకు పాల్పడకుండా ఉండేలా నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అదే సమయంలో- రైల్వే ట్రాక్ పక్కన అతని మృతదేహం లభించింది. దీనితో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఎన్‌కౌంటర్ చేస్తారనే భయంతో రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కేటీఆర్ రెస్పాండ్..

అతను ఆత్మహత్య చేసుకున్నట్లు ఇంకా ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు. ఈ మధ్యాహ్నం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్.. దీనిపై ఓ అధికారిక ప్రకటన చేయనున్నారు. దీనికోసం ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాగా- నిందితుడు రాజు మృతదేహం లభించడం పట్ల ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఓ మానవ మృగం అంతమైందని పేర్కొన్నారు. అతని మృతదేహం లభించినట్లు కొద్దిసేపటి కిందటే- పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎం మహేందర్ రెడ్డి నుంచి తనకు సమాచారం అందిందని చెప్పారు.

Recommended Video

YS Sharmila Condolence Saidabad Incident Victim Family || Oneindia Telugu

ఫొటోలు రీట్వీట్..

ఇదివరకు నిందితుడు రాజు పోెలీసుల చేతికి దొరికినట్లు ఆయన ఓ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అనధికారిక సమాచారంగా తనకు అందిందని, అతని కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారని కేటీఆర్ అప్పట్లో కరెక్షన్ ఇచ్చారు. తాజాగా అదే ట్వీట్‌ను అప్‌డేట్ చేశారు. డీజీపీ నుంచి అందించిన సమాచారం మేరకు నిందితుడు రాజు మృతదేహం స్టేషన్ ఘన్‌పూర్ వద్ద లభించినట్లు చెప్పారు. తెలంగాణ డీజీపీ ట్వీట్ చేసిన రాజు మృతేహానికి సంబంధించిన కొన్ని ఫొటోలను కేటీఆర్ రీట్వీట్ చేశారు. రాజును మానవ మృగంగా అభివర్ణించారు.

English summary
Telangana IT minister KTR says that the beast who raped the child has been traced and found dead on a railway track at station Ghanpur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X