వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సొంత జిల్లాలో మంత్రి పువ్వాడకు చేదు అనుభవం... రీజన్ ఇదే

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు సొంత జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుమారుడి వివాహానికి హాజరైన ఆయనకు అక్కడ పరాభవం జరిగింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడి వివాహానికి కేటీఆర్ హాజరైన సందర్భంగా జరిగిన ఘటన ఆయనను తీవ్ర అసహనానికి గురి చేసింది .పొంగులేటి కుమారుడి వివాహానికి మంత్రి కేటీఆర్‌తో పాటు పువ్వాడ అజయ్, మరికొందరు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు.

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుమారుడి వివాహం కొద్దిరోజుల క్రితమే దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా పెళ్లి రిసెప్షన్‌ను ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌ వద్ద నిర్వహించారు.మాజీ ఎంపీ పొంగులేటి కుమారుడి వివాహానికి కేటీఆర్ వస్తున్న సమయంలో అక్కడ ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ అత్యుత్సాహం మంత్రి అజయ్ కుమార్ ఆగ్రహానికి కారణం అయింది.

 The bitter experience of Minister Puvvada in his own district ... Reason is

కేటీఆర్ వచ్చే సమయంలో సెక్యూరిటీ సిబ్బంది కొంచెం అతి చేయడమే కాకుండా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను కూడా అడ్డుకున్నారు . జిల్లా మంత్రి అయిన ఆయనను అందరి ముందు అడ్డుకోవటంతో తెగ ఫీల్ అయ్యారు మంత్రి పువ్వాడ . తనను అందరి ముందు భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో అసహనానికి గురైన ఆయన అక్కడే ఉన్న పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రినైన నన్నే అడ్డుకుంటారా అని మండిపడ్డారు.

English summary
At the time of KTR's arrival, security personnel were stopped Minister Puvvada Ajay Kumar. Minister Puvvada became angry while he is district minister that he was blocked in front of everyone. He was embarrassed by the security guards blocking him in front of everyone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X