వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉపాది హామీ పథకానికి తూట్లు పొడిచిన కేంద్రం.!మరోసారి మండిపడ్డ కల్వకుంట్ల కవిత.!

కేంద్ర బడ్జెట్ లో ఉపాది హామీ పథకానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. వ్యవస్ధలను నిర్వీర్యం చేయడమే కేంద్ర బీజేపి ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని కవిత ఎద్దేవా చేసారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించి, గ్రామీణులకు ఉపాధి లేకుండా చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమని మోదీ సర్కార్ పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం సంఘాల ప్రతినిధులు నేడు కవిత ను సంప్రదించారు. ఈ సందర్బంగా కేంద్ర బడ్జెట్ లోని కేటాయింపుల్లో ఉపాధి హామీ పథకం అమలుకు కనీసం 2.72 లక్షల కోట్ల రూపాయల అవసరం ఉండగా, బడ్జెట్ లో కేవలం 60 వేల కోట్ల రూపాయలు మాత్రమే బీజేపీ ప్రభుత్వం కేటాయించిదని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు.

కేటాయింపుల్లో కోతలెందుకు.?

కేటాయింపుల్లో కోతలెందుకు.?


మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ‌పథకాన్ని నిర్వీర్యం చేసి పేదల పొట్టగొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బుధవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపు భారీగా తగ్గడమే ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లోని నివాసంలో ఉపాధి హామీ పథకం సంఘం ప్రతినిధులతో సమావేశమయ్యారు. సంఘంలోని ప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలను కవిత తెలుసుకున్నారు.

గత ఐదేళ్ల బడ్జెట్ లో ఇది చాలా తక్కువ..

గత ఐదేళ్ల బడ్జెట్ లో ఇది చాలా తక్కువ..


బుధవారం ప్రకటించిన బడ్జెట్ లో ఉపాధి హామీ పథకానికి కేంద్రం కేవలం 60 వేల కోట్ల రూపాయలు ‌కేటాయించిందన్నారు ఎమ్మెల్సీ కవిత. గత ఐదేళ్ల బడ్జెట్ లో ఇదే అతి తక్కువ అని విమర్శించారు. 2020-21 లో 1,10,000 కోట్ల రూపాయలు, 2021-22లో 98,000కోట్ల రూపాయలు, 2022-23లో 89,400కోట్ల రూపాయలు, 2023-24లో 60,000కోట్ల రూపాయలు కేటాయించి, దశల వారీగా ఉపాధి హామీ పథకానికి బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.

ఏటా నిర్లక్ష్యానికి గురికాబడుతున్న ఉపాధి హామీ పథకం..

ఏటా నిర్లక్ష్యానికి గురికాబడుతున్న ఉపాధి హామీ పథకం..

ఉపాధి హామీ పథకం అమలుకు కనీసం 2.72 లక్షల కోట్ల రూపాయలు అవసరం ఉండగా, బడ్జెట్ లో కేవలం 60 వేల కోట్ల రాపాయలు మాత్రమే కేటాయించడం దేనికి సంకేతమని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. గత తొమ్మిదేళ్లలో గ్రామీణ ప్రాంతాలలో కొత్తగా ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించని బీజేపీ ప్రభుత్వం, ఉన్న ఉపాధి కార్యక్రమాలను‌ సైతం అమలు చేయడం లేదన్నారు. ప్రజలకు వీలైనంత ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సహకరించడం లేదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.

కేసీఆర్ ఉన్నంత వరకూ కష్టాలు రావు.

కేసీఆర్ ఉన్నంత వరకూ కష్టాలు రావు.

ఉపాధి హామీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రవీణ్, ఉపాధి హామీ పథకం జేఎసీ చైర్మన్ యలబద్రి లింగయ్య, కో చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి , విజయ్ కుమార్ , రఘు , సర్దార్ సింగ్ , అంజి రెడ్డి , సుదర్శన్ మరియు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రజానికానికి సీఎం చంద్రశేఖర్ రావు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష అన్నారు. చంద్రశేఖర్ రావు సీఎంగా ఉన్నంత కాలం తెలంగాణ ప్రజలకు ఎలాంటి కష్టాలు రావాని, అందరూ ధైర్యంగా ఉండాలని కల్వకుంట్ల కవిత ఉపాది హామీ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు.

English summary
MLC Kalvakuntla Kavitha lashed out at the Modi government saying that the BJP government at the center is reducing the funds for the employment guarantee scheme and making the rural people unemployed. Representatives of the Employment Guarantee Scheme Associations contacted Kavitha today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X