• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ధాన్యం కొనుగోలులో పచ్చి అబద్దాలాడిన సీఎం.!కేసీఆర్ విధానాలతో రైతులు మగ్గిపోతున్నారన్న డీకే అరుణ.!

|

హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రైతులపట్ల అవలంబిస్తున్న విధానాల పట్ల భారతీయ జనతా పార్టీ ఘాటుగా స్సందించింది. తెలంగాణ రాష్ట్రంలో 80 శాతం వడ్లు కొనుగోలు చేసినామంటూ గారడీ మాటలు మాట్లాడుతున్నారని, కల్లాల దగ్గరికెల్లి కొనుగోళ్లు చేశానని ప్రగల్బాలు పలుకుతున్నడని,మరి ఐకేపీ కేంద్రాల్లో వడ్లు ఎందుకు తడుస్తున్నయని, ఎందుకు మొలకెత్తుతున్నయని, కొనుగోళ్ల పేరుతో రైతులను నట్టేట ముంచిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కు రోజులు దగ్గర పడ్డాయని బీజేపి జాతీయ ఉపాద్యక్షురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు.

 ధాన్యం కొనుగోలులో రైతులను నిండా ముంచుతున్న కేసీఆర్.. సీఎం పై డీకే అరుణ ఫైర్..

ధాన్యం కొనుగోలులో రైతులను నిండా ముంచుతున్న కేసీఆర్.. సీఎం పై డీకే అరుణ ఫైర్..

రైతుల సంక్షేమమంటూ కల్లబొల్లి మాటలు చెప్పే ముఖ్యమంత్రి, కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న గోస కనపడం లేదా అని సూటిగా ప్రశ్నించారు. తరుగు, తాలు, తేమ పేరుతో వ్యాపారులు ఇబ్బందులు పెడుతుంటే ఎందుకు రైతుల పక్షాన స్పందించలేదని నిలదీసారు. ఎఫ్ సీఐతో తెలంగాణ సివిల్ కార్పొరేషన్ చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి గింజను కూడా ఎఫ్ సీఐ కొనుగోలు చేయాలి. కానీ తెలంగాణలో ఆ కొనుగోళ్లు జరగడం లేదంటూ, కేంద్రంపై మరోసారి నెపం నెట్టే ప్రయత్నం చేస్తూ, కేంద్రానికి లేఖ రాస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రగల్బాలు పలుకుతున్నారని మండిపడ్డారు అరుణ.

 కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలు.. దిక్కుతోచని స్థితిలో రాష్ట్ర రైతాంగం ఉదన్న ఫైర్ బ్రాండ్

కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలు.. దిక్కుతోచని స్థితిలో రాష్ట్ర రైతాంగం ఉదన్న ఫైర్ బ్రాండ్

చివరికి రైతులను కూడా రాజకీయ బురదలోకి లాగుతున్నారని సీఎం పై ఆగ్రహం వ్యక్తం చేసారు డీకే అరుణ. క్వింటాలుకు 6 నుంచి 7 కిలోల తరుగు పేరుతో రైతుల చెమటను దోచుకుంటున్నరని, ఇప్పటికైనా రైస్ మిల్లర్లతో కుమ్మక్కైన రాష్ట్ర ప్రభుత్వం దివాలాకోరు రాజకీయం మాని రైతుల శ్రేయస్సు గురించి ఆలోచించాలని అరుణ హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ అసంబద్ధ వైఖరి, విధానాలతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నాని, ఇంకా కొనుగోలు కేంద్రాల్లో 50 శాతం మేర ధాన్యం నిలువ ఉందని, ఇప్పటికైనా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచించారు.

 రుణమాఫీ చేస్తానని రైతులను పచ్చి మోసం చేసారు.. కేసీఆర్ కు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్న అరుణ..

రుణమాఫీ చేస్తానని రైతులను పచ్చి మోసం చేసారు.. కేసీఆర్ కు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్న అరుణ..

రుణమాఫీ సంగతి తేల్చకుండా, రైతుబంధు పేరుతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గత మూడేళ్లుగా కాలం వెల్లదీస్తున్నారని, పంట పెట్టుబడి కోసం బ్యాంకులకు వెళ్తున్న రైతులకు అప్పులివ్వని పరిస్థితి నెలకొందని అరుణ ఆవేదన వ్యక్తం చేసారు.పెనాల్టీలు, పాత బకాయిలు కట్టాలని బ్యాంకర్లు ఇబ్బంది పెడుతున్నరని, రుణమాఫీ పేరుతో రైతుల ఓట్లు దండుకొని, అధికారంలోకి వచ్చాక మళ్లీ రైతుల చేతిలో చిప్ప పెడుతున్న చంద్రశేఖర్ రావుకు రానున్న కాలంలో రైతులే బుద్ధి చెబుతారని అరుణ మండి పడ్డారు.

 రైతు వ్యతిరేక విధానాలకు మూల్యం చెల్లించుకోక తప్పదు.. కేంద్రానికి లేఖ రాయాలనుకోవడం సిగ్గుచేటన్న డీకే..

రైతు వ్యతిరేక విధానాలకు మూల్యం చెల్లించుకోక తప్పదు.. కేంద్రానికి లేఖ రాయాలనుకోవడం సిగ్గుచేటన్న డీకే..

రైతుల పట్ల అధికార పార్టీ చేస్తున్న దుర్మార్గపు అపరాధానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని డీకే అరుణ హెచ్చరించారు. తీవ్రమైన కోవిడ్‌ సంక్షోభంలో కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం పోసేలా కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పేరుతో ఇరవై లక్షల కోట్ల రూపాయల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిందని, కరోనాను జయించడంతోపాటు అన్ని రంగాల్లో స్వావలంబన సాధించే ప్రధాన లక్ష్యంతో ఈ ప్యాకేజీని రూపొందించడం జరిగిందని అరుణ చెప్పుకొచ్చారు. దేశ ప్రజల సంక్షేమం కోసం బీజేపి ఇంత పరితపిస్తుంటే రైతులకు బీజేపి చేస్తున్న అన్యాయం పట్ల కేంద్రానికి లేఖ రాస్తాననడం సిగ్గుమాలిన చర్య అని అరుణ ధజమెత్తారు.

  Coronavirus In India: కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల !
  English summary
  The Bharatiya Janata Party (BJP) has strongly condemned Chief Minister Chandrasekhar Rao's policies towards farmers. BJP National Vice President DK Aruna flagged off that days are coming to an end to CM for cheating farmers purchasing grains.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X