• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గుడి గోడల మీద కేసీఆర్ చిత్రాలెందుకన్న కాంగ్రెస్.!రేవంత్ కు పీసిసి ఇస్తే స్వాగతిస్తామన్న కుసుమకుమార్.

|
  KCR పై విరుచుకుపడ్డ కుసుమ కుమార్ || Kusuma Kumar Comments On KCR Photo In Yadadri Temple || Oneindia

  హైదరాబాద్ : యాదాద్రి ప్రాకారాలపైన తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు చిత్రపటాలు చెక్కుతున్నట్టు వస్తున్న వార్తల పైన తెలంగాణ లోని రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బీజేపి, టీడిపి పార్టీలు ఇప్పటికే ఈ నిర్ణయాన్ని వ్యకిరేకిస్తుండగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శిస్తోంది. ఆద్యాత్మికతను, రాజకీయాలను ముడిపెట్టడం సరికాదని, దేవాలయాల పవిత్రను, ప్రాశస్త్యాన్ని కాపాడే బాద్యత అందిరి మీద ఉందని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అద్యక్షుడు జెట్టి కుసుమకుమార్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి దేవాలయ ప్రాకారాలమీద, ధ్వజ స్థంభాల మీద తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చిత్ర పటాలను చెక్కడాన్ని ఆయన తప్పుబట్టారు. దేవాలయ ప్రాంగణాల్లో ఆద్యాత్మికత ఉట్టిపడే శిల్పాలు, శిలలు ఉండాలి గాని ఇలా రాజకీయ నేతల చిత్రాలు ఎందుకని ఆయన ప్రశ్రించారు.

  యాదాద్రి స్థంభాల మీద కేసీఆర్ చిత్రాలు వద్దు..! ఆద్యాత్మితకు, రాజకీయాలకు ముడిపెట్టొద్దంటున్న కాంగ్రెస్..!!

  యాదాద్రి స్థంభాల మీద కేసీఆర్ చిత్రాలు వద్దు..! ఆద్యాత్మితకు, రాజకీయాలకు ముడిపెట్టొద్దంటున్న కాంగ్రెస్..!!

  పూర్వపు రోజుల్లో సామంత రాజులు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలను ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అనుసరిస్తున్నారు అన్నారు. దేవాలయాల మీద తమ పార్టీకి చెందిన ప్రముఖ నేతలు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ తో పాటు జాతి పిత మహాత్మ గాంధీ చిత్రపటాలను చెక్కించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆద్యాత్మికతకు నిలయాలైన పవిత్ర దేవాలయాల్లో రాజకీయ నేతల చిత్రపటాలు చెక్కించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయ పడ్డారు. యాదగిరి గుట్ట పేరును యాదాద్రిగా మార్చి తప్పుచేసారని, ఇప్పుడు రాజకీయ నేతల చిత్రపటాలు చెక్కించే క్రమంలో మరో తప్పు చేయొద్దని ఆయన మండిపడ్డారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో రాజకీయ నేతల చిత్రపటాలు చెక్కినట్టైతే కాంగ్రెస్ పార్టీ మరో పోరాటానికి శ్రీకారం చుడుతుందని కుసుమకుమార్ హెచ్చరించారు.

  రేవంత్ కు పీసిసి ఇస్తే స్వాగతిస్తాం..! కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిండెంట్ కుసుమకుమార్ స్పష్టీకరణ..!!

  రేవంత్ కు పీసిసి ఇస్తే స్వాగతిస్తాం..! కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిండెంట్ కుసుమకుమార్ స్పష్టీకరణ..!!

  తెలంగాణలో రేవంత్ రెడ్డికి మంచి ప్రజాధరణ ఉందని, అధికార పార్టీ విధాలను విమర్శించడంలో రేవంత్ రెడ్డికి మంచి సామర్ధ్యం ఉందని కుసుమకుమార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఐతే ఎవరి సమర్ధత గురించి వారు అదిష్టానం దగ్గర చెప్పుకోవడం కాంగ్రెస్ పార్టీలో ఎప్పటినుంచో ఉన్న వ్యవహారమని, తెలంగాణ పగ్గాలు తమకు అప్పజెప్పాలని, అందుకు తనే సమర్థుడనని చాలా మంది నేతలు అదిష్టానం వద్ద సిఫార్సులు చేసుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ అదిష్టానం ఎవరిని పీసిసి ఛీఫ్ గా నియమించినా కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. తెలంగాణలో రేవంత్ రెడ్డికి పీసిసి పగ్గాలు ఇస్తే స్ధానికంగా కొంత వ్యతిరేకత వచ్చే అవకావాలు లేక పోలేదని, అలా తలెత్తే అవాంతరాలన్నీ అదిగమించే సత్తా రేవంత్ రెడ్డికి ఉందని అన్నారు.

  రేవంత్ రెడ్డి ప్రజాధరణ ఉన్న నాయకుడు..! పార్టీ పగ్గాలు ఇవ్వడం సమంజసమే అంటున్న నేతలు..!!

  రేవంత్ రెడ్డి ప్రజాధరణ ఉన్న నాయకుడు..! పార్టీ పగ్గాలు ఇవ్వడం సమంజసమే అంటున్న నేతలు..!!

  వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయని, అదికారం చేపట్టే అవకాశాలు కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఏఐసిసి అద్యక్షురాలుగా సోనియా గాంధీ మళ్లీ ఎంపిక కావడం అన్నీ విధాల కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశమని అన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వడం ఖాయమని, తమలాంటి నేతలు రేవంత్ రెడ్డి నేతృత్వంలో పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. అదిష్టానం రేవంత్ రెడ్డికి పీసిసి పదవి ఇస్తామని ఎక్కడా నిర్ధారించలేదని, ఒకవేళ రేవంత్ రెడ్డి పేరును పీసిసి ఛిఫ్ గా ఎంపిక చేస్తే తాను మనస్పూర్తిగా స్వాగతీస్తానని కుసుమకుమార్ తెలిపారు. కాని రేవంత్ రెడ్డిని టీపిసిసి ఛీఫ్ గా నియమించిన తర్వాత రగిలే అసమ్మతి జ్వాలలను ఆయన ఎలా చల్లారుస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.

  ప్రభుత్వం హాస్పత్రుల పరిస్ధితి అద్వాన్నం..! రాష్ట్ర వైద్య శాఖ పూర్తిగా విఫలమైందన్న టీపిసిసి..!!

  ప్రభుత్వం హాస్పత్రుల పరిస్ధితి అద్వాన్నం..! రాష్ట్ర వైద్య శాఖ పూర్తిగా విఫలమైందన్న టీపిసిసి..!!

  తెలంగాణలో ప్రభుత్వ దవాఖానాల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేకపోవడంతో రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. తెలంగాణలోని 33జిల్లాల్లో ప్రభుత్వ హాస్పత్రుల పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు హాస్పత్రుల తనఖీల కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క సారధ్యంలో జిల్లాల పర్యటన చేపట్టిన కాంగ్రెస్ బృందం హాస్పత్రుల్లోని సౌకర్యాల లేమిని చూసి ఆశ్యర్యానికి గురైనట్టు తెలుస్తోంది. కనీస ముందస్తు జాగ్రత్తలు తీసుకోక పోవడంతో డెంగ్యూలాంటి విషజ్వరాలు ప్రభలుతున్నాయని కుసుమకుమార్ ఆవేదన వ్యక్తం చేసారు. ఈ విషయంలో రాష్ట్ర వైద్య శాఖ ఘోరంగా విఫలం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేసారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  There is opposition from political parties in Telangana on the news that Telangana CM Chandrasekhar Rao is carving out the paintings on Yadadri. BJP and TDP parties are already dealing with this decision while the Congress party is criticising it in large scale. Jatti Kusumar Kumar, working president of the Congress, believes that it is not enough to tie up spirituality and politics and that there is a responsibility to protect the sanctity and prosperity of temples.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more