వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ విషయాలు గుర్తు చేస్తూ ట్రంప్, కేసీఆర్ ల మధ్య సంభాషణ

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన సందర్భంగా అట్టహాసంగా జరిగింది . ప్రధాని మోదీతో కలిసి ట్రంప్ పర్యటన నేపథ్యంలో రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్ నిన్న రాత్రి రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ ఫ్యామిలీకి విందు ఏర్పాటు చేశారు . ఇక విందుకు తెలంగాణా సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు.

ట్రంప్ తో డిన్నర్ లో పాల్గొన్న సీఎం కేసీఆర్

ట్రంప్ తో డిన్నర్ లో పాల్గొన్న సీఎం కేసీఆర్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన విందు కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ట్రంప్ ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది . రాష్ట్రపతి భవన్‌ నుంచి ఆహ్వానం మేరకు ఆయన మంగళవారం మధ్యాహ్నం బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళిన కేసీఆర్ డిన్నర్‌లో పాల్గొన్నారు.

చేతులు జోడించి నమస్కరించిన సీఎం

చేతులు జోడించి నమస్కరించిన సీఎం

ఇక ట్రంప్ కుటుంబానికి స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వాలని అనుకున్నా రాష్ట్రపతి భవన్ నుండి ఎలాంటి బహుమతులు తీసుకురావద్దని చెప్పటంతో సీఎం కేసీఆర్ ఎలాంటి బహుమతులు లేకుండానే రాష్ట్రపతి భవన్ కు వెళ్ళారు . ఇక విందు సందర్భంగా జరిగిన పరిచయ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు సీఎం కేసీఆర్‌ తొలుత చేతులు జోడించి నమస్కారం పెట్టారు. భారతీయుల సంస్కారాన్ని తెలియజేసేలా నమస్కరించిన కేసీఆర్ కు ప్రతిగా చేయి చాచిన ట్రంప్‌తో కరచాలనం కూడా చేశారు.

Recommended Video

Namaste Trump : Defence Ties Between India & USA, Here's The Other Key Deals Details ! | Oneindia
ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటన గుర్తు చేసి సంభాషించిన కేసీఆర్ , ట్రంప్ లు

ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటన గుర్తు చేసి సంభాషించిన కేసీఆర్ , ట్రంప్ లు

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ట్రంప్‌కు కేసీఆర్‌ను పరిచయం చేశారు . ఇక పురోభివృద్ధి రాష్ట్రమైన తెలంగాణకు ముఖ్యమంత్రి అంటూ కేసీఆర్‌ను పరిచయం చేశారు. ఇదే సందర్భంలో ట్రంప్‌తో మాట కలిపిన కేసీఆర్ ఇవాంకా ట్రంప్ గతంలో హైదరాబాద్‌లో జరిగిన పారిశ్రామిక వేత్తల సదస్సుకు హాజరైన నాటి విషయాలను గుర్తు చేశారని సమాచారం . ఇక, ట్రంప్‌ చిరునవ్వు నవ్వుతూ ‘అవును నాకు తెలుసు' అని చెప్పి సీఎం కేసీఆర్ తో చాలా ఆసక్తికరంగా మాట్లాడినట్టు సమాచారం .

English summary
President Ramnath Kovind introduced KCR to Trump. kovind said to trump that Telangana is the state of the development . It is reported that KCR who spoke with Trump on the same occasion, recalled things that Ivanka Trump has previously attended at the Entrepreneur Summit in Hyderabad. Also, Trump smiled and said, "Yes, I know," he said, talking to CM KCR very interesting information.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X