• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పోలీసులకు సవాల్ గా ..9మంది వలస కార్మికుల డెత్ మిస్టరీ ..కీలకంగా కండోమ్ ప్యాకెట్లు , బర్త్ డే పార్టీ

|

వరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంట ఇండస్ట్రియల్ ఏరియాలో చోటుచేసుకున్న 9 మంది వలస కార్మికుల మరణాల విషాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు వలస కార్మికుల మరణాలకు కారణం ఏంటి ? ఎవరైనా హత్య చేశారా ? లేకా ఏదైనా ఇబ్బందులతో సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నారా ? ఒకవేళ ఆత్మహత్యే అయితే ఒకే కుటుంబానికి చెందినా ఆరుగురు , మరో ఇద్దరు బీహార్ వాసులు , ఒక త్రిపుర వాసి కూడా ఎందుకు వారితో కలిసి ఆత్మహత్య చేసుకుంటారు . ఇక తినటానికి , ఉండటానికి ఇబ్బంది ఏమైనా ఉందా అంటే అదీ లేదు . అలాంటప్పుడు ఇంతమంది మృతికి కారణం ఏంటి ? అసలేం జరిగింది అన్నది ఇప్పుడు పోలీసులకు సవాల్ గా మారింది. ఇది హత్యే అన్న అనుమానాలు బలపడుతున్నాయి.

ఆ బావిలో 9 శవాలు.. వరంగల్ లో వలస విషాదం ... వలస కార్మిక మరణాల మిస్టరీ ఏంటి ?

9మంది వలస కార్మికుల మృతి కేసులో కాల్ డేటా సేకరిస్తున్న పోలీసులు

9మంది వలస కార్మికుల మృతి కేసులో కాల్ డేటా సేకరిస్తున్న పోలీసులు

ఒకవేళ ఇది హత్యే అయితే ఇంతమందిని ఎవరు చంపారు. రెక్కాడితే కాని డొక్కాడని వారి దగ్గర నుండి దేని కోసం ఈ హత్యలు చేశారు ? లేదు ఇది ఆత్మహత్యలే అనుకుంటే ఒకేసారి అంతమంది బలవన్మరణాలకు పాల్పడటం సాధ్యమా ? అన్న కోణంలో కూడా విచారణ జరుగుతుంది. అయితే అన్నిటికంటే వారి మరణాలకు ముందు ఏం జరిగింది. వారు ఎవరెవరితో మాట్లాడారు . ఏం మాట్లాడారు అన్నది ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అందరి ఫోన్లలో లాస్ట్ స్విచ్ ఆఫ్ అయింది మక్సూద్ ఫోన్

అందరి ఫోన్లలో లాస్ట్ స్విచ్ ఆఫ్ అయింది మక్సూద్ ఫోన్

రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు వరంగల్ పోలీస్ కమీషనర్ డా. రవీందర్. అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకుని ఈ కేసును త్వరలో ఛేదిస్తామని చెప్తున్నారు పోలీస్ కమిషనర్. వరంగల్‌ బావి కేసులో ఆ గంటలో ఏం జరిగిందన్న దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు సాయంత్రం ఆరుగంటలకి నిషా, షాబాద్ ఆలం, సోహెల్ ఆలం , శ్రీరామ్, శ్యామ్ ల సెల్‌ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. ఏడు గంటలకి మక్సూద్ తన ఇంటికి షకీల్ ను పిలిచినట్టు విచారణలో తెలిసింది.

ఫుడ్ పాయిజన్ జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు .. కీలకం కానున్న పోస్ట్ మార్టం రిపోర్టులు

ఫుడ్ పాయిజన్ జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు .. కీలకం కానున్న పోస్ట్ మార్టం రిపోర్టులు

ఇక 7.45కు గోదాం యజమానితో మక్సూద్ మాట్లాడాడు. అయితే 9 గంటలకు అతని సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో బుధవారం రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య ఏం జరిగింది? గంట లోపల మక్సూద్ దగ్గరికి ఎవరు వచ్చారు? అందరిపైనా ఫుడ్ పాయిజన్ జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ లు వస్తే గానీ ఏం జరిగింది అనేది క్లారిటీ రాదు .

బుస్రా వివాహేతర సంబంధం , బర్త్ డే పార్టీ లో ఘర్షణపై దర్యాప్తు

బుస్రా వివాహేతర సంబంధం , బర్త్ డే పార్టీ లో ఘర్షణపై దర్యాప్తు

ఇక ఈ కేసులో మరో అంశం కూడా కీలకంగా మారింది. భర్తతో విడిపోయిన మక్సూద్ కూతురు బుస్రా నగరంలోని ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక అంతేకాదు ఈ వ్యవహారంలో బుస్రాకు తన తల్లితో గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఇంటిపై ఉంటున్న బీహార్‌కు చెందిన వారు శ్రీరాం, శ్యామ్‌లు వీరి గొడవలో జోక్యం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అంతే కాదు వీరు బుస్రాపై కన్నేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న బుస్రా ప్రియుడు వారితో‌ చనిపోవటానికి ముందు రోజు మక్సూద్ ఇంట్లో బర్త్ డే విందుకు హాజరైనట్లుగా చెబుతున్నారు.

 మక్సూద్ ఫోన్ 9 గంటల వరకు ఆన్ అయి ఉండటంతో మక్సూద్ పై అనుమానం

మక్సూద్ ఫోన్ 9 గంటల వరకు ఆన్ అయి ఉండటంతో మక్సూద్ పై అనుమానం

ఈ విందులో జరిగిన ఘర్షణతో బీహార్ యువకులు మక్సూద్ కుటుంబాన్ని చంపి బావిలో పడేసి ఇక హత్యలు చేశామన్న భయంతో వారు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారా? అనే అనుమానాలు కూడా లేకపోలేదు . అయితే అందరికంటే చివరగా మక్సూద్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అంటే మక్సూద్ అప్పటి దాకా ఏం చేశాడు అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ఇక మక్సూద్ నివాసం ఉంటున్న గదులను తనిఖీ చేయగాఅతడి జేబులో కండోమ్ ప్యాకెట్ కనిపించింది.

  Kim Jong-un Faked His Own Death To Expose Traitors In His Inner Circle
  మక్సూద్ జేబులో కండోమ్స్ .. అసలేం జరిగింది ?

  మక్సూద్ జేబులో కండోమ్స్ .. అసలేం జరిగింది ?

  పెళ్లయ్యి ముగ్గురు పిల్లలున్న అతడి దగ్గర కండోమ్ ఉండటం అనుమానాలకు తావిస్తోంది. అందరి సెల్‌ఫోన్లు సాయంత్రమే స్విచ్ఛాఫ్ అయినా మక్సూద్ ఫోన్ రాత్రి వరకు ఆన్‌లో ఉండటం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.ఏది ఏమైనా పోలీసులకు సవాల్ విసిరిన ఈ కేసులో ఫోన్ కాల్స్ ఎవరితో మాట్లాడారు. అక్కడ అసలు ఏం జరిగి ఉంటుంది అన్న దర్యాప్తు చేస్తున్న పోలీసులు పోస్ట్ మార్టం నివేదికల ఆధారంగా కేసులో కీలక దర్యాప్తు కొనసాగించనున్నారు.

  English summary
  9 migrant labour found dead in a well in Gorrekunta village in Warangal Rural.The police are collecting call data and credentials to check their rooms in order to inflict a death mystery. The post mortem report is crucial in this case.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more