వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారులో ఆధిపత్య పోరు .. టీఆర్ఎస్ నేతలను డామినేట్ చేస్తున్న ఫిరాయింపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఉనికిని ప్రశ్నార్ధకం చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ నుండి వలసలను ప్రోత్సహించింది. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మేలేఎలు టీఆర్ఎస్ బాట పట్టారు. దీంతో కారు ఓవర్ లోడెడ్ అయ్యింది. ఇక టీఆర్ఎస్ పార్టీ నేతలకు కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన ఫిరాయింపు నేతలకు మధ్య ఆయా నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు నెలకొంది.

టీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు.. టీఆర్ఎస్ నేతలను డామినేట్ చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

టీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు.. టీఆర్ఎస్ నేతలను డామినేట్ చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

టీఆర్ఎస్ పార్టీ తెలంగాణా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి లేకుండా చెయ్యటానికి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను కారెక్కించుకుంది. దీంతో గులాబీ పార్టీలో వింత పరిస్థితి నెలకొంది. పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అప్పటివరకు టీఆర్ఎస్ లో స్థానికంగా పెత్తనం చెలాయించిన లీడర్లను డామినేట్ చేస్తున్నారు. పరిషత్ ఎన్నికల్లో బీ ఫారాలు పంచుతూ అంతా తమదే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు.

జంప్ జిలానీలకు హైకోర్టు షాక్ .. విలీన ఉత్తర్వులు రద్దు చేసే అధికారం కోర్టుకుందని వ్యాఖ్య జంప్ జిలానీలకు హైకోర్టు షాక్ .. విలీన ఉత్తర్వులు రద్దు చేసే అధికారం కోర్టుకుందని వ్యాఖ్య

గులాబీ నేతలతో సంభంధం లేకుండా టీఆర్ఎస్ బీఫారాలు అందిస్తుంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ..

గులాబీ నేతలతో సంభంధం లేకుండా టీఆర్ఎస్ బీఫారాలు అందిస్తుంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ..

కాంగ్రెస్ నుండి గులాబీ పార్టీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యే బానోతు హరిప్రియ ఇల్లెందులో బీ ఫారాలు పంపిణీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున గెలిచిన సండ్ర వెంకటవీరయ్య ఇటీవలే టీఆర్ఎస్ గూటికి చేరారు. సత్తుపల్లిలో ఆయనే టీఆర్ఎస్ బీ ఫారాలు జారీచేస్తూ హడావుడి చేస్తున్నారు. వైరాలో టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి రాములు నాయక్ అయితే స్వయంగా సంతకాలు చేసి ఎంపీటీసీ, జెడ్పిటీసీ బీ ఫారాలు అందిస్తున్నారు.పాలేరులో ఎమ్మెల్యే ఉపేంద్ర రెడ్డి ఫారాల పంపిణీ చూసుకుంటున్నారు. కాంగ్రెస్ నుండి జంప్ చేసిన వనమా వెనకటేశ్వరరావు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావులే తన నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ బీ ఫారాలు
పంచుతున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కొల్లాపూర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ రెడ్డిలు టీఆర్ఎస్ బీ ఫారాలు ఇస్తున్నారు .

గులాబీ నేతలకు తలనొప్పిగా కాంగ్రెస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు

గులాబీ నేతలకు తలనొప్పిగా కాంగ్రెస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు

స్థానిక టీఆర్ఎస్ నాయకులతో సంబంధం లేకుండా ఫిరాయింపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీ కి అంతా తామేనంటూ స్థానికంగా పెత్తనం చెలాయించటం టీఆర్ఎస్ నేతలకు తలనొప్పిగా మారుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వటానికి తమ వర్గీయులకు, బంధువులకు, సన్నిహితులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అధిష్టానం సైతం అధికారాలు వారికిచ్చేసి సైలెంట్ అయిపోయింది. దీంతో ఆయా స్థానాల్లో టీఆర్ఎస్ తరపున పోటీచేసి ఓడిన నేతలు పైకి మాట్లాడలేక, పార్టీలో కాంగ్రెస్ నేతలు చేస్తున్న తంతు చూస్తూ ఏం చెయ్యలేక సతమతమవుతున్నారు.

English summary
Regardless of the local TRS leaders, the Congress MLAs to head to the local leadership. Congress MLAs are giving preference to their clans, relatives and close friends to give tickets to the local bodies election. The supreme authority also gave them the power . Thus the leaders of the TRS in the positions of the TRS are not able to speak up, and the party leaders are very disaappointed with the congress MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X