వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గులాబీ ద‌ళాన్ని క‌ల‌వ‌ర‌పెడుతున్న ఆ ఐదు లోక్ స‌భ స్థానాలు..! గెలుపు అంత వీజీ కాదంటున్న శ్రేణులు..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : 16 లోక్ స‌భ స్థానాల గెలుపుపై భ‌రోసా గా ఉన్న గులాబీ గూటిలో ఐదు ఎంపీ స్థానాల్లో గెలుపు గుబులు పుట్టిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అక్క‌డ టీఆర్ఎస్ నెగ్గ‌క‌పోవ‌టానికి స‌గం కార‌ణాలు అనేకం ఉన్న‌ట్టు చ‌ర్చ జ‌రుగుతోంది. కొత్త అభ్య‌ర్థులు కావ‌టం, ఎమ్మెల్యేల స‌హ‌కారం, స్థానిక‌త‌, వంటి అంశాలు గులాబీ నేత‌ల‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్నట్టు స‌మాచారం. ముఖ్యంగా గులాబీ ద‌ళాన్ని బాగా క‌ల‌వ‌ర‌పెడుత‌న్న లోక్ స‌భ స్థానం నిజామాబాద్‌. ఎందుకంటే అక్క‌డ ధ‌ర్మ‌పురి సంజయ్ బీజేపీ త‌ర‌పున పాతుకుపోయాడు. పైగా బ‌ల‌మైన క‌మ‌లం కేడ‌ర్ మ‌రింత క‌ల‌సివ‌చ్చే అంశం.

పెద్దపల్లి ప్రజలకు సేవ చేయాలనుంది...అందుకే రాజీనామా: గడ్డం వివేక్పెద్దపల్లి ప్రజలకు సేవ చేయాలనుంది...అందుకే రాజీనామా: గడ్డం వివేక్

క‌విత‌పై రైతుల వ్య‌తిరేక‌త‌..! ఈ సారి గెలుపుపై ఉత్కంఠ‌..!!

క‌విత‌పై రైతుల వ్య‌తిరేక‌త‌..! ఈ సారి గెలుపుపై ఉత్కంఠ‌..!!

క‌విత‌పై అంత‌ర్గ‌తంగా నియోజ‌క‌వ‌ర్గంలో చాలా వ‌ర‌కూ వ్య‌తిరేత‌క ఉంది. ముఖ్యంగా ఎర్ర‌జొన్న రైతులు ఏకంగా 1000 మంది వ‌ర‌కూ నామినేష‌న్లు వేస్తున్నారంటే ఆమెపై ఎంత‌టి వ్య‌తిరేక‌త ఉంద‌నేది అర్ధం చేసుకోవ‌చ్చు. కానీ అధికార పార్టీ కావ‌టంతో ప‌వ‌ర్ పాలిటిక్స్‌తో తేలిక‌గా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌నేది తెరాస శ్రేణులు అంచ‌నా. మ‌ల్కాజిగిరి స్థానంలో మ‌ల్లారెడ్డి అల్లుడు రాజ‌శేఖ‌రెడ్డిని నిలిపారు. అయితే కాంగ్రెస్ నుంచి రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగటంతో అంచ‌నాలు తారుమార‌య్యాయి.

 మ‌ల్కాజి గిరిలో రేవంత్ స్పీడు..! గులాబీ కొత్త అభ్య‌ర్థి అందుకునేనా..?

మ‌ల్కాజి గిరిలో రేవంత్ స్పీడు..! గులాబీ కొత్త అభ్య‌ర్థి అందుకునేనా..?

ఇక్క‌డ స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ మ‌రోసారి సీటు ఆశించి భంగ‌ప‌డ్డారు. అయినా రేవంత్ స్పీడు, నాయ‌క‌త్వం అన్నీ కాంగ్రెస్ పార్టీకి క‌ల‌సి వ‌స్తాయ‌ని తెలుస్తోంది. ఇక్క‌డ సీమాంధ్ర ఓట‌ర్లు ఈ ద‌ఫా కాంగ్రెస్ వైపు చూస్తారనే అంచ‌నాలున్నాయి. అదే జ‌రిగితే కారు వేగానికి బ్రేకులు ప‌డిన‌ట్లే. ఇక‌పోతే.. సికింద్రాబాద్‌.. ఇక్క‌డా త‌ల‌సాని వార‌సుడు సాయికిర‌ణ్ రంగంలోకి దిగాడు. మైనార్టీ ఓట్ల త‌మ‌కే అనేంత భ‌రోసాగా ఉన్నారు. బీజేపీ కంచుకోట కావ‌టం, కేంద్రంలో మోదీపై ఉన్న సానుకూల‌త అన్నీ క‌ల‌సి వ‌స్తాయ‌నుకుంటున్నారు. కాంగ్రెస్ కూడా ఈ సీటు త‌మ ఖాతాలో వేసుకొనేందుకు పావులు క‌దుపుతోంది.

 ఖ‌మ్మంలో మ‌ళ్లీ రేణుకా వ‌ర్సెస్ నామా..! పై చేయి ఎవ‌రిదో..??

ఖ‌మ్మంలో మ‌ళ్లీ రేణుకా వ‌ర్సెస్ నామా..! పై చేయి ఎవ‌రిదో..??

ఖ‌మ్మం నుంచి నామా రంగంలోకి దిగినా, అక్క‌డ గులాబీ కేడ‌ర్ ఆయ‌న‌కు ఎంత వ‌ర‌కూ స‌హ‌క‌రిస్తారనేది ప్ర‌శ్నార్థ‌క‌మే..! రేణుకాచౌద‌రికు ఉన్న బ‌లం హ‌స్తాన్ని ఈ ద‌ఫా గ‌ట్టెక్కిస్తుంద‌నే భావ‌న‌లో ఆ పార్టీ శ్రేణులున్నాయి. అదే స‌మయంలో అంత‌ర్గ‌తంగా ఉన్న కుమ్ములాట‌లు సీటును దూరం చేస్తాయ‌నే ఆందోళ‌న కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. చివ‌రిది.. న‌ల్గొండ‌.. ఎలాగైనా న‌ల్ల‌గొండ‌లో పాగా వేయాల‌నుకున్న కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో సత్తా చాటారు.

 న‌ల్ల‌గొండ‌, సికింద్రాబాద్ ల‌ను త‌న ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్..! టీఆర్ఎస్ ప్ర‌భావం ఎంత‌..?

న‌ల్ల‌గొండ‌, సికింద్రాబాద్ ల‌ను త‌న ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్..! టీఆర్ఎస్ ప్ర‌భావం ఎంత‌..?

ఇప్పుడు లోక్ స‌భ ఎన్నిక‌ల్లో కూడా అదే ధీమాతో ఈ సారి కొత్త నేత‌కు అవ‌కాశం ఇచ్చారు. భువ‌న‌గిరి, న‌ల్ల‌గొండ పార్ల‌మెంట‌రీ స్థానాల్లో భారీ మెజార్టీ సాధించాల‌నే ల‌క్ష్యాన్ని పార్టీ ఎమ్మెల్యేల‌కు వ‌దిలేశారు. అయితే.. అసెంబ్లీలో వ‌చ్చిన తీర్పు పార్ల‌మెంట‌రీ ఎన్నిక‌ల్లో పున‌రావృతం అవుతుందా! అనే భ‌యం కూడా గులాబీ శ్రేణుల్లో ఉంది. ఇటువంటి క్లిష్ట‌మైన ఐదు పార్ల‌మెంట‌రీ స్థానాల్లో గెలుపు అంత ఈజీ కాద‌ని గులాబీ శ్రేణులు అభిప్రాయ ప‌డుతున్నాయి.

English summary
There are five MP positions in the pink party doubt win that are guaranteed to win 16 Lok Sabha seats. There is debate about half of the reasons for not getting TRS. New candidates, MLAs' co-operation, localism, information about the pink leaders are disturbing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X