వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నిక‌ల్లో ఓడినా పెద్దాయ‌న మ‌న‌సు గెలిచిన మాజీ మంత్రి..! త్వ‌ర‌లో క్యాబినెట్ లోకి...??

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : ఖ‌మ్మం బాద్ షా తుమ్మల నాగేశ్వ‌ర రావు వ్యవహారం టీఆర్‌ఎస్‌లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఎన్నికల్లో ఓటమి చెందిన మంత్రి తుమ్మలకు మరో సారి కేబినెట్‌లో అవకాశం ఇవ్వాలని కేసీఆర్‌ భావిస్తున్నారా? ఆయన్ని ఎమ్మెల్సీ కోటా కింద మంత్రి పదవిలో తీసుకుంటారా? అంటే అవుననే సమాధానాలు వినిపిన్నాయి. ఎన్నికల్లో ఓడిన మంత్రులకు మళ్లీ బెర్త్‌ ఉండబోదని ఫలితాల తరువాత ప్రకటించిన సీఎం చంద్ర‌శేఖ‌ర్ రావు తుమ్మల విషయంలో కాస్త మెత‌క వైఖ‌రితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో మంత్రులు తమ్మల నాగేశ్వరావు. మహేందర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు. ఆజ్మీర్‌ చందూలాల్‌ ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఐతే తుమ్మ‌ల ప‌ట్ల యువ‌రాజు కేటీఆర్ కొంత సానుకూల ధోర‌ణితో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

The former minister who won the mind of party chief..!! Soon into the Cabinet

అయితే సీఎంకు స్నేహితుడైన తుమ్మల ఓటమి ఆ పార్టీలో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయంలో బాధతో ఉన్న తమ్మల నాగేశ్వరావు రెండు రోజుల కిందట మినిస్టర్‌ క్వార్టర్స్‌లోని తన బంగళాను ఖాళీ చేయడానికి సిద్దమయ్యారు. ఈ విషయం తెలిసిన సీఎం కార్యాలయం నుంచి తుమ్మలకు ఫోన్‌ వచ్చింది. 'తొందరపడకండి సర్‌.... పెద్దసార్‌ మాట్లాడతారంటా..' అంటూ వచ్చిన ఫోన్‌ కాల్‌తో ఆయన వెనక్కి తగ్గారు. ఈ విషయంపై పార్టీలో చర్చసాగుతోంది. ఖమ్మంలో పార్టీకి పెద్ద తలకాయలు ఎవరూ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం వెనుక ఇటీవల పార్టీ పగ్గాలు చేపట్టిన కేటీఆర్ జోక్యం ఉన్నట్లు చ‌ర్చ జ‌రుగుతోంది.

English summary
Is KCR to give a chance to the farmer minister Thummalu once again in the Cabinet? Will he take the cabinet under the MLC quota? CM Chandrashekhar Rao soft corner about Thummala and wants to take once again into telangana cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X