హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఊరట: అసలు రహేజా కేసు ఏమిటీ?, కేసును కొట్టివేసిన హైకోర్టు

రహేజా భూముల వ్యవహరంలో ఏసీబీ కోర్టు కేసును హైకోర్టు మంగళవారం నాడు కొట్టివేసింది. రహేజా ఐటీ పార్క్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్రంలో ఏపీఐఐసీ వాటా కుదింపు వ్యవహరంపై దాఖలపై ఏసీబీ కోర్టులో కేసు దాఖలైంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రహేజా భూముల వ్యవహరంలో ఏసీబీ కోర్టు కేసును హైకోర్టు మంగళవారం నాడు కొట్టివేసింది. రహేజా ఐటీ పార్క్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్రంలో ఏపీఐఐసీ వాటా కుదింపు వ్యవహరంపై దాఖలపై ఏసీబీ కోర్టులో కేసు దాఖలైంది. అయితే ఈ విషయమై హైకోర్టులో కూడ కేసు దాఖలైంది. ఈ కేసును ఆయన కొట్టివేశారు.

ఈ కేసులో ఐఎఎస్ అధికారులు ఎల్వీ సుబ్రమణ్యం, బీపీ ఆచార్య, రత్నప్రభ, ఐపీఎస్ అదికారి గోపికృష్ణ లతో పాటు అప్పటి ఐటీ శాఖ కార్యదర్శి పీఎస్ మూర్తి తో పాటు రహేజా ఐటీ పార్క్ ఎండీ నీల్ రహేజా, రహేజా మైండ్ స్పేస్ ఎండీ బి. రవీంద్రనాథ్ లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

అయితే ఏసీబీ కోర్టు కేసును హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు మంగళవారం నాడు హైకోర్టు ఏసీబీ కోర్టు కేసును కొట్టివేస్తూ ఆదేశాలను జారీచేసింది. దీంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఎఎస్, ఐపిఎస్ అదికారులకు ఇబ్బందులు తొలగినట్టేనని భావిస్తున్నారు న్యాయనిపుణులు.

ఏమిటీ రహేజా కేసు

ఏమిటీ రహేజా కేసు

2003 లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయంలో టిడిపి సర్కార్ ఐటీ రంగ ఉత్పత్తుల కోసం రహేజా కార్పోరేషన్ గ్రూప్ కు మార్కెట్ ధర కంటే అతి తక్కువ ధరలో మాదాపూర్ లో 110 ఎకరాల భూమిని కేటాయించింది. అప్పట్లోనే ఇతర ప్రైవేట్ కంపెనీలకు ఎకరం భూమిని రూ.2 నుండి 4 కోట్లకు కేటాయించారు. రహేజా గ్రూప్ కు మాత్రం ఎకరానికి లక్షల రూపాయాల చొప్పున కేటాయించారు. అనంతరం ఐటీ పార్క్ అభివృద్ది కోసం ఉమ్మడి వెంచర్ గా దీనిని చేపట్టాలని ప్రత్యేక ఒప్పందాలు చేసుకొన్నారు. కోటీ రూపాయాలపెట్టుబడితో చేపట్టే ప్రాజెక్టులో ఏపీఐఐసీ వాటా 11 శాతం, రహేజా సంస్థ వాటా 89 శాతం ఉంటుందని నిబంధనలు చేసుకొన్నారు.అయితే ఏపీఐఐసి వాటా కింద భూమిని కేటాయించారు. అయితే ఐటీ పార్క్ అభివృద్దిలో మూలా పెట్టుబడి కోటి నుండి ఏకంగా రూ.20 కోట్లకు పెంచారు.

తగ్గిన ఏపీఐఐసి వాటా

తగ్గిన ఏపీఐఐసి వాటా

అయితే నిబంధనల ప్రకారంగా ఏపీఐఐసి తన వాటా కింద అదనంగా రూ.2.09 కోట్లను చెల్లించాలి. కానీ, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి రత్నప్రభ, ఏపీఐఐసి డైరెక్టర్ గా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యం ఎటువంటి చర్యలను చేపట్టలేదు. అనంతరం వచ్చిన బీపీ ఆచార్య కూడ స్పందించలేదనే ఆరోపణలున్నాయి. అయితే ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో పాటు ఇతరత్రా కారణాలవల్లే గడువు ముగిసినప్పటికీ రూ.2.09 కోట్లను చెల్లించలేదు. దీంతో రహేజా ఐటీ పార్క్ లో ఏపీఐఐసీ వాటా 0.55 శాతానికి పడిపోయింది. నామమాత్రపు ధరకే ప్రభుత్వం కేటాయించిన భూమాని తనాఖా పెట్టిన రహేజా గ్రూప్, కేటాయించిన భూమిలో రహేజా మైండ్ స్పేస్ పేరుతో పలు భవనాలను నిర్మించింది.

రూ. ఏటా 450 కోట్ల అద్దె వసూలు

రూ. ఏటా 450 కోట్ల అద్దె వసూలు

ఈ భవనాల ద్వారా ప్రతి ఏటా రూ.450 కోట్లను రహేజా సంస్థ వసూలు చేస్తోంది. అయితే ఏపీఐఐసి వాటా 0.55 శాతానికి కుదించుకుపోవడంతో లాభాల్లో కూడ వాటా తగ్గిపోయింది. ఈ వ్యవహరంపై సమాచారహక్కు చట్టం ప్రకారంగా పూర్తి ఆధారాలను సేకరించిన న్యాయవాది శ్రీరంగారావు ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఏసీబీ కోర్టు స్వీకరించింది. ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహరం కోర్టుకు చేరడంతో అధికారులు రూ. 2.09 కోట్లను ఏపీఐసీసీకి చెల్లించారు. నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఎఎస్ అదికారులు తమపై నమోదుచేసిన కేసులను కొట్టివేయాలని హైకోర్టులో క్యాష్ పిటిషన్లను దాఖలు చేశారు. కానీ, హైకోర్టులో వారికి ఊరట లభించలేదు. 2014 లో ఏసీబీ నివేదికను అందజేసింది. ఏసీఐఐసి వాటా కింద డబ్బులు చెల్లించారని అధికారులపై చర్యలు అవసరం లేదని కేసును మూసివేయాలని కోరింది.

ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు

ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు

కేసును మూసివేయాలని ఏసీబీ కోర్టు కోర్టు పేర్కొనడంతో న్యాయవాది శ్రీరంగారావు మరోసారి ప్రొటెస్ట్ పిటిషన్ ను దాఖలు చేశారు. అధికారులపై చర్యలు చేపట్టాలని తప్పులు దిద్దినంత మాత్రాన వారిని వదిలిపెట్టనంటూ ఆయన వాదనలను విన్పించారు. ప్రొటెస్ట్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు ఆమోదిస్తూ ఐఎఎస్ లు, ఐపీఎఎస్ లకు నోటీసులు జారీచేసింది ఏసీబీ కోర్టు.అంతేకాదు ఈ విషయమై ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను విచారించేందుకు అవకాశం ఇవ్వాలని ఏసీబీ కోర్టు హైకోర్టును ఆశ్రయించింది.అయితే ఈ కేసును మంగళవారం నాడు హైకోర్టు కొట్టివేసింది.

English summary
The high court dismissed ACB court request on Raheja - APIIC joint venture.Telangana ACB has urged the Hyderabad High Court to allow it to prosecute the accused officials and businessmen charged with irregularities in the Raheja Mindspace and APIIC joint venture project .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X