వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిరుద్యోగుల జాబితా బారెడు .. నిరుద్యోగ భృతి నిధుల కేటాయింపు మూరెడు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు అందరికీ నిరుద్యోగ భృతి అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో నిరుద్యోగ భృతి కోసం 1810 కోట్ల రూపాయలు కేటాయించారు. నిరుద్యోగ భృతి అందించడానికి విధి విధానాలు, నియమ నిబంధనలు రూపొందిస్తే, అన్ని అనుకూలిస్తే ఏప్రిల్ నుండి తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందనుంది . నిరుద్యోగుల ఖాతాలో ప్రతి నెల 3,016 రూపాయలు చొప్పున సొమ్ములు పడనున్నాయి. అయితే తెలంగాణా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ ఇవ్వటానికి ఈ నిధులు ఏమాత్రం సరిపోవని తెలుస్తుంది.

ఎన్నికల హామీని నెరవేర్చిన సీఎం.. నిరుద్యోగ భృతి గా 1810 కోట్ల రూపాయల కేటాయింపు

ఎన్నికల హామీని నెరవేర్చిన సీఎం.. నిరుద్యోగ భృతి గా 1810 కోట్ల రూపాయల కేటాయింపు

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల హామీ లో భాగంగా నిరుద్యోగులకు నెలకు రూ.3,016 చొప్పున భృతి అందిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. సీఎం కేసీఆర్ తాను ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేర్చేందుకు బడ్జెట్లో 1810 కోట్ల రూపాయలను నిరుద్యోగ భృతి కేటాయింపులుగా ప్రకటించారు. అయితే నిరుద్యోగ భృతి అందించడానికి రాష్ట్రంలో ప్రస్తుతం ఎంత మంది నిరుద్యోగులున్నారు? భృతిని పొందడానికి ‘అర్హత'ను ఎలా నిర్ధారించాలి? అన్న అంశాలను ఖరారు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో నిరుద్యోగ భృతికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో ఖరారు కానున్నాయి. పార్లమెంటు ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తే నిరుద్యోగ భృతి అందడంలో జాప్యం జరిగే అవకాశం ఉంది.

తెలంగాణలో 20 లక్షల మంది నిరుద్యోగులు.. వెల్లడించిన సర్వే

తెలంగాణలో 20 లక్షల మంది నిరుద్యోగులు.. వెల్లడించిన సర్వే

నిరుద్యోగుల విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నాలుగో స్థానంలో ఉన్నట్లు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ, బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సంస్థలు కొద్ది నెలల క్రితం నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. దాదాపు 20 లక్షల మంది గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా ఉన్నట్లు అనధికారిక అంచనా. వీరిలో 70 శాతం మంది ఉద్యోగాల వేటలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక మిగిలినవారు ఏదో ఒక వ్యాపారం, వ్యాపకంలో ఉన్నారని తెలుస్తోంది. ఈ లెక్కన కనీసం 14 లక్షల మంది నిరుద్యోగుల కైనా ప్రభుత్వం నిరుద్యోగ భృతిని చెల్లించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. అంటే నిరుద్యోగ భృతి కింద ప్రతి నెలా వీరికి చెల్లించాల్సిన మొత్తం రూ.425 కోట్ల వరకూ ఉంటుంది. ఏడాదికైతే రూ.5,100 కోట్ల మేరకు ఉంటుంది. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ కేటాయించిన బడ్జెట్ కేవలం 1810 కోట్లు. ఈ బడ్జెట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఏమాత్రం సరిపోదు.

నిరుద్యోగుల జాబితా బారెడు .. నిధుల కేటాయింపు మూరెడు

నిరుద్యోగుల జాబితా బారెడు .. నిధుల కేటాయింపు మూరెడు

ప్రస్తుతం సీఎం కేసీఆర్ ప్రకటించిన నిరుద్యోగ భృతి వివాదాస్పదంగా మారుతోంది. 1810 కోట్ల బడ్జెట్లో కేటాయించిన కేసీఆర్ ఎంత మంది నిరుద్యోగులకు భృతి ఇవ్వనున్నారు అన్నదానిపై క్లారిటీ లేదు. సీఎం కెసిఆర్ ఇచ్చిన బడ్జెట్ ను బట్టి 1810 కోట్లు ఆరు నెలల పాటు నిరుద్యోగులకు భృతి ఇచ్చేందుకు లెక్కకట్టినా 10 లక్షల మందికి కూడా నిరుద్యోగ భృతి అందదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వార్షిక కేటాయింపుగా భావిస్తే ఒక్కొక్కరికి నెలకు 3016 చొప్పున సంవత్సరానికి 36,192 రూపాయలు ఖాతాలో వెయ్యాల్సి ఉంటుంది. ఆ లెక్కన చూస్తే ప్రస్తుతం కేసీఆర్ కేటాయించిన బడ్జెట్ కేవలం 5లక్షల 110 మందికి మాత్రమే సరిపోతుంది. టీఎస్పీఎస్సీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 24 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లుగా అంచనా. ఒకవేళ ఇందులో 35 సంవత్సరాల వయసు పైనుండి 44 సంవత్సరాల వయసు వరకు నిరుద్యోగ భృతి అందుకునే అర్హులుగా నిర్ణయించినా కనీసం 14 లక్షల వరకు లబ్ధిదారులు ఉండే అవకాశం ఉంది. నెలకు మూడు వేల పదహారు రూపాయలు ఇవ్వనున్న నేపథ్యంలో 14 లక్షల మందికి నిరుద్యోగ భృతి అందించాలంటే 5 వేల కోట్ల పై చిలుకు బడ్జెట్ కావాలి. కానీ సీఎం కేసీఆర్ ప్రకటించిన బడ్జెట్ 1810 కోట్లు మాత్రమే. ఇది ఏ రకంగానూ సరిపోదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికల తరువాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో సవరణలు చేసినప్పటికీ అంత పెద్ద మొత్తంలో నిరుద్యోగులకు భృతి ఇవ్వడం సాధ్యపడుతుందా అన్నది ప్రశ్న.

రూపొందని విధి విధానాలు.. వరుస ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం

రూపొందని విధి విధానాలు.. వరుస ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం

నిరుద్యోగ భృతి అందించడానికి ఇప్పటివరకు విధి విధానాలు రూపొందించలేదు. ఏపీ తరహాలో ఏజ్ లిమిట్ తో పాటుగా, తెల్ల రేషన్ కార్డు తప్పనిసరిగా ఉన్నవారికి నిరుద్యోగ భృతి చెల్లిస్తామంటే లబ్ధిదారుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది. అధికారులు ఇప్పటికే విధివిధానాలు రూపొందించడానికి కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. అయితే త్వరలో ఎన్నికలు జరగనుండడంతో ఎలక్షన్ కోడ్ వస్తే ఇది మరింత జాప్యం అయ్యే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత, మరలా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండటంతో ఈ ఎన్నికలను పూర్తయ్యేసరికి 4 నెలల సమయం పడుతుంది. మరి ఈ లోపు అధికారులు విధి విధానాలు రూపొందించి నిరుద్యోగ భృతి అంది అందిస్తారో లేకా నిరుద్యోగులకు ఎన్నికలు పూర్తయ్యే వరకు నిరుద్యోగ భృతి కోసం నిరీక్షించాల్సి వస్తుందో మరి. ఏదేమైనప్పటికీ బడ్జెట్ కేటాయింపులు మూరెడు అయితే నిరుద్యోగులు జాబితా మాత్రం బారెడు అన్నది నిర్వివాదాంశం.

English summary
Proposing an unemployment allowance of Rs 3,016 per month ahead of elections, Telangana Chief Minister K. Chandrashekhar Rao on Friday presented a Vote-on-Account Budget for 2019-20.He proposed Rs 1810 crore in the Budget to introduce unemployment allowance of Rs 3,016 per month to the eligible.According to the TSPSC, there are 24 lakh unemployed people in the state.These funds are not enough to give all the unemployed people in Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X