• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విలీనం చేసే అదికారం ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ కే ఉంది.. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూనీ చేస్తున్నార‌న్న ఆలీ

|

హైదరాబాద్: తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అంత‌ర్గ‌త పోరుతో స‌త‌మ‌త‌మౌతోంది. పార్టీలోని కొంత మంది ఎమ్మెల్సీలు మండ‌లి ప‌క్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేయాల‌ని ప‌ట్టుబ‌డుతుంటే మ‌రో వ‌ర్గం మాత్రం ఆ అదికారం మండ‌లి ఛైర్మ‌న్ కు గాని, శాస‌న స‌భాప‌తికి గాని లేవ‌ని మ‌రో వ‌ర్గం చెప్పుకొస్తోంది. సంతోష్ కుమార్, ఆకుల లలిత ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందినవారని, వారిని అనర్హులుగా చేయాలని మండలి చైర్మన్ కు లేఖ ఇచ్చినట్లు ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ తెలిపారు.

 కాంగ్రెస్ లో చ‌ల్లార‌ని విలీనం ర‌చ్చ‌..! విలీనం చేసే అదికారం మండ‌లి ఛైర్మ‌న్ కు లేద‌న్న ష‌బ్బీర్..!!

కాంగ్రెస్ లో చ‌ల్లార‌ని విలీనం ర‌చ్చ‌..! విలీనం చేసే అదికారం మండ‌లి ఛైర్మ‌న్ కు లేద‌న్న ష‌బ్బీర్..!!

మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ ను రాములు నాయక్, షబ్బీర్ అలీ సంప్ర‌దించారు. చట్టాలను కాపాడే వారే వాటి ఉల్లంఘన చేస్తున్నారని, ప్రతిపక్షాలు లేకుండా చేయాల‌నుకోవ‌డం ప్రజాస్వామ్యమేనా అని ఆయ‌న ప్రశ్నించారు. సంత‌లో ప‌శువుల్లాగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లను కొనుగోలు చేస్తున్నారని మండి ప‌డ్డారు. స్పీకర్, చైర్మన్ లకు పార్టీని విలీనం చేసే అధికారం లేదని, పార్టీ ని విలీనం చేసే అధికారం ఎలక్షన్ కమిషన్ కు మాత్రమే ఉందని, స్పీకర్ కు చైర్మన్ లేదని స్పష్టం ష‌బ్బీర్ ఆలీ స్ప‌ష్టం చేశారు. త‌మ‌కు అధికారం ముఖ్యం కాదని, ప్రజాసేవే ముఖ్య‌మ‌ని తెలిపారు. ప్రతిపక్ష హోదా కూడా ప‌న‌కు లేకుండా తీసివేశారని ష‌బ్బీర్ ఆలీ ఆవేద‌న వ్య‌క్తం చేసారు.

 పార్టీ మారిన టీఆఎస్ ఎమ్మెల్సీల‌కే నోటీసులు..! మ‌రి టీఆర్ఎస్ లో చేరిన‌వారికి ఎందుకు ఇవ్వ‌లేదు..?

పార్టీ మారిన టీఆఎస్ ఎమ్మెల్సీల‌కే నోటీసులు..! మ‌రి టీఆర్ఎస్ లో చేరిన‌వారికి ఎందుకు ఇవ్వ‌లేదు..?

అదికార గులాబీ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం లేదని ఎన్నిక‌ల సంద‌ర్బంలో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెర‌వేర్చ లేద‌ని ష‌బ్బీర్ ఆలీ ఫైర్ అయ్యారు. గెలిచినప్పటి నుండి కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల పేరిట ప‌ర్చ‌ట‌న‌లు మాత్ర‌మే చేస్తున్నార‌ని, ఘాటు విమ‌ర్శ‌లు గుప్పిచ్చారు. టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్సీలకు నోటీస్ లు ఇచ్చారని, అదే అంశంపై తాము పిటిషన్ ఇస్తే ఇప్పటి వరకు స్పందించాలేదని అన్నారు.

నోటీస్ కు స్పందించేందుకు స‌మ‌యం ఇవ్వ‌డం లేదు..! మండ‌లి ఛైర్మ‌న్ ఏక‌ప‌క్ష దోర‌ణి అంటున్న ఎమ్మెల్సీలు.!

నోటీస్ కు స్పందించేందుకు స‌మ‌యం ఇవ్వ‌డం లేదు..! మండ‌లి ఛైర్మ‌న్ ఏక‌ప‌క్ష దోర‌ణి అంటున్న ఎమ్మెల్సీలు.!

త‌న‌కు ఇచ్చిన నోటీస్ పై 4వారాల స‌మ‌యం కావాలని అడిగితే అందుకు చైర్మన్ సానుకూలంగా స్పందించలేదని రాములు నాయ‌క్ తెలిపారు. త‌న‌కు సామాజిక కోటా లో గవర్నర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, కాంగ్రెస్ నుంచి వెళ్లి టీఆర్ఎస్ లో చేరిన వారిపై చర్యలు తీసుకోకుండా త‌మ‌పై మాత్ర‌మే ఎందుకు క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని నాయ‌క్ మండిప‌డుతున్నారు. రాహుల్ గాంధీ ని కలిసింది వాస్తవమేన‌ని, గిరిజన మేనిఫెస్టో కోసమే కలిశాన‌ని, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కాదని గవర్నర్ కోటా లో వచ్చిన ఫారూఖ్ హుస్సేన్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడాలి..! క‌క్ష్య‌పూరిత ధోర‌ణి మంచిది కాదంటున్న కాంగ్రెస్..!!

ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడాలి..! క‌క్ష్య‌పూరిత ధోర‌ణి మంచిది కాదంటున్న కాంగ్రెస్..!!

తెలంగాణ‌లో ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తున్నారని ఎక్కడ ఉన్నా గిరిజనుల అభ్య‌ద‌యం కోసం పేనిచేస్తాన‌ని మ‌రో ఎమ్మెల్సీ భూప‌తి రెడ్డి అన్నారు. త‌న‌ను జైల్లో పెట్టాలని అదికార పార్టీ చూస్తోంద‌ని, త‌న‌కు జ‌ర‌గ‌కూడ‌నిది ఏం జరిగినా ప్రభుత్వందే బాధ్యత అని ఆయ‌న హెచ్చ‌రించారు . తెలంగాణ రావడానికి సీఎం కేసీఆర్ అన్ని పార్టీలను కలిశారని అప్పుడు లేని తప్పు తాము కలిస్తేనే వచ్చిందా అని ప్రశ్నించారు. త‌న‌కు న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తానని చెప్పుకొచ్చారు.

English summary
The Congress party in Telangana is facing the internal conflict. Some MLCs in the party are trying to merge the councilor to the TRSAnother category claims that there is no right to merge neither chairman nor the legislature speaker.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X