వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు..!కేసీఆర్ కు జీ హుజూర్ అనేది లేదంటున్న హుజూర్ నగర్ ఓటర్లు..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. రాజకీయ నాయకుల పైన ప్రజలకు ఎప్పుడు వ్యతిరేకత వస్తుందో, ఎప్పుడు వ్యామోహం పెరిగిపోతుందో చెప్పడం చాలా కష్టంగా మారింది. ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు బంపర్ మెజారిటీతో ఎన్నికల్లో గెలుస్తామనుకున్న నాయకులు ఘోరంగా మట్టి కరిచిన సందర్బాలు అనేకం ఉన్నాయి. ప్రజా వ్యతిరేకత బ్యాలెట్ రూపంలో నిర్ధారణ అవుతుంది తప్ప అంచనాల రూపంలో ఎప్పుడూ కాదనే వాస్తవం నేటి రాజకీయ నాయకులకు కాస్త రుచించకపోవచ్చు. తెలంగాణలో అచ్చం ఇలాంటి పరిణామాలే చోటుచేసుకున్నయనే సంకేతాలు వెలువడుతున్నాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నిక మొన్నటి నిజామాబాద్ లోక్ సభ ఫలితాన్ని పునరావృతం చేస్తుందనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో జోరుగా సాగుతోంది.

బాలయ్య చరిష్మా ..హుజూర్ నగర్ ఎన్నికల్లో ఓటు బ్యాంకుగా మారుతుందా ? బాలయ్య చరిష్మా ..హుజూర్ నగర్ ఎన్నికల్లో ఓటు బ్యాంకుగా మారుతుందా ?

హుజూర్ నగర్ లో ఉప ఎన్నిక.. అధికార పార్టీకి అగ్ని పరీక్ష..

హుజూర్ నగర్ లో ఉప ఎన్నిక.. అధికార పార్టీకి అగ్ని పరీక్ష..


తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ఉప ఎన్నిక‌లు ఎప్పుడు అండ‌గా ఉంటూ వ‌స్తున్నాయి. ఎప్పుడు ఉప ఎన్నికలు జ‌రిగినా వాటిలో విజ‌యం చంద్రశేఖర్ రావునే వ‌రిస్తూ, ఇత‌ర పార్టీల ఉనికినే దెబ్బ‌తీసేవిగా పరిణమిస్తూ వస్తున్నాయి. కాని ఇప్పుడు చంద్రశేఖర్ రావుకు మొద‌టిసారిగా ఉప ఎన్నిక‌లో ఎదురుదెబ్బ త‌గల‌బోతోందా అంటే అవున‌నే స‌మాధాన‌ం ప్రజల నుండి వినిపిస్తోంది. హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో అధికార టీ ఆర్ ఎస్ పార్టీ అభ్య‌ర్థి శానంపూడి సైదిరెడ్డికి మ‌రోమారు ఓట‌మి త‌ప్పేలా లేదని రాజ‌కీయ ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.

తొలిసారి వ్యతిరేక పవనాలు.. ఆర్టీసి సమ్మె ప్రభావమే..

తొలిసారి వ్యతిరేక పవనాలు.. ఆర్టీసి సమ్మె ప్రభావమే..


ఇంత‌కు చంద్రశేఖర్ రావుకు అంత పెద్ద దెబ్బ త‌గ‌లడానికి ప్ర‌ధాన కార‌ణం ఆర్టీసీ స‌మ్మె ప్రభావమనే చర్చ జరుగుతోంది. చంద్రశేఖర్ రావు మొదట రాజకీయాల నుండి, ఆతర్వాత ఉద్య‌మాల నుంచి వ‌చ్చిన నేత‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఏది ఏమైనా చంద్రశేఖర్ రావు ఉద్య‌మాల ద్వారానే సీఎం సీటును అధిరోహించగలిగారు. అలాంటి చంద్రశేఖర్ రావు ఇప్పుడు ఆర్టీసీ ఉద్య‌మాన్ని అణిచివేసేందుకు స‌క‌ల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందుకు చంద్రశేఖర్ రావు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో ప్ర‌జ‌లు కూడా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 కసిగా ఉన్న తెలంగాణ వాసులు.. తీర్పు ఏవిధంగానైనా ఇవ్వొచ్చు..

కసిగా ఉన్న తెలంగాణ వాసులు.. తీర్పు ఏవిధంగానైనా ఇవ్వొచ్చు..

తెలంగాణ ప్ర‌జ‌లు అస‌లే నియంతృత్వాన్ని స‌హించ‌లేరు. చంద్రశేఖర్ రావును రెండోసారి నెత్తిన పెట్టుకున్న నాలుగు నెల‌ల్లోనే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎలాంటి చేదు అనుభవాన్ని కట్టబెట్టారో ప్రత్యక్షంగా తెలుకోగలిగారు. విభ‌జించి పాలించు అనే సూత్రాన్ని చంద్రశేఖర్ రావు పాటిస్తున్నాడ‌ని ఇప్పుడు తెలంగాణ ప్ర‌జ‌లు అర్థం చేసుకున్నట్టు వార్తలు భగ్గుమంటున్నాయి. అందుకే హుజూర్‌న‌గ‌ర్‌లో చంద్రశేఖర్ రావుకు జీ హుజూర్ అన‌కుండా, నై హుజూర్ అనేలా పరిస్థితులు తలకిందులైనట్టు ప్రచారం జరుగుతోంది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న స‌మ్మె ప్రభావం హుజూర్‌న‌గ‌ర్‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. అక్క‌డ టీ ఆర్ ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున జ‌న‌స‌మీక‌ర‌ణ జ‌రుగుతున్నా ఎక్కడో తేడా కొడుతోంద‌న్న‌ది మాత్రం పార్టీ నాయ‌క‌త్వాన్ని క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్నట్టు ప్రగతి భవన్ లో చర్చ జరుగుతోంది.

 వెనకబడుతున్న సైదిరెడ్డి.. ఓటమి తప్పదనే అభిప్రాయంలో పార్టీ శ్రేణులు..

వెనకబడుతున్న సైదిరెడ్డి.. ఓటమి తప్పదనే అభిప్రాయంలో పార్టీ శ్రేణులు..

ఆర్టీసీ స‌మ్మె కారణంగా అధికార పార్టీ ఇరుకునపడ్డట్టు తెలుస్తోంది. అదే సమయంలో హుజూర్‌న‌గ‌ర్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి ప‌ద్మావ‌తికి క‌లిసొచ్చెలా పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు టీజెఎస్‌, తెలంగాణ ఇంటిపార్టీ, మ‌ద్ద‌తు ఇస్తున్నాయి. టీ ఆర్ ఎస్‌కు వైసీపీ మ‌ద్ద‌తు ఇస్తోంది. ఇక సీపీఎం ఎటూ తేల్చుకోలేకపోతోంది. కానీ టీ ఆర్ ఎస్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌మ‌ని మాత్రం స్పష్టం చేశారు ఆ పార్టీ కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భ‌ద్రం. ఇక పోటీలో ఉన్న 28 మంది అభ్య‌ర్థుల్లో ప్ర‌ధానంగా పోటీ టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, టీడిపి అభ్య‌ర్థుల మ‌ధ్యే ఉంది. ఇక ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు, ప్ర‌భుత్వ ఉద్యోగుల కుటుంబాలు చంద్రశేఖర్ రావుకు గుణపాఠం చెప్పాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ఆర్టీసీ స‌మ్మె రూపంలో చంద్రశేఖర్ రావుకు ఊహించని ప్ర‌మాదం పొంచి ఉంద‌నే చర్చ జరుగుతోంది. ఐతే ఇంతటి విత్కర పరిస్తుతుల నడుమ జ‌నాలు ఎటువైపు మొగ్గుతారో చూడాలి మ‌రి.

English summary
When the by-elections were held, Chandrasekhar Rao was the only one to be win and hit by the existence of these parties. But now it is heard from the public that there is a setback in the election of Chandrasekhar Rao for the second time. In the by-election of the Huzur nagar, the ruling TRS party is going to taste bitter experiance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X