వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింగిల్ గా వచ్చి కూల్ గా దోచేసే దొంగ పై పీడీ యాక్ట్

|
Google Oneindia TeluguNews

ఆ దొంగ సింగిల్ గా వస్తాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తాడు. గుట్టుచప్పుడు కాకుండా కూల్ గా దో చేస్తాడు. ఇక దోపిడి డబ్బుతో దర్జాగా బతికేస్తాడు. దొంగతనాలకు అలవాటుపడి, ఎన్నిసార్లు పట్టుబడినా , జైలుకెళ్లి వచ్చినా పద్ధతి మార్చుకోని ఓ దొంగపై పీడీ యాక్ట్ నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు.

 జేసీ దివాకర్ రెడ్డి నోట జమిలి మాట ... మోడీ పాట జేసీ దివాకర్ రెడ్డి నోట జమిలి మాట ... మోడీ పాట

మహారాష్ట్ర వాంఖడే కు చెందిన అమోల్ అశోక్ రావు వెల్డర్ గా పని చేస్తాడు.జల్సాలకు వ్యసనాలకు బానిసైన అతను డబ్బు కావాల్సి వచ్చినపుడల్లా తన సొంత రాష్ట్రం లో కాకుండా పక్క రాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తాడు. ముఖ్యంగా హైదరాబాద్, సంగారెడ్డి, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడిన ఈ కేటుగాడు తన వెంట తెచ్చుకునే బ్యాగ్‌లో స్క్రూ డ్రైవర్‌, కటింగ్‌ ప్లేయర్‌, చిన్న ఇనుపరాడ్డు తెచ్చుకుంటాడు. ఇక పగలంతా నేను తిరిగి తాళం వేసిన ఇళ్లను చూసి రెక్కీ నిర్వహిస్తారు. అర్ధరాత్రి ఆ ఇళ్లలో దోపిడీకి పాల్పడతాడు . అందినకాడికి ఇంటిని గుల్ల చేస్తాడు.

The PD act on the interstate thief ... because

Recommended Video

తెలంగాణలో మహారాష్ట్ర SI రచ్చ.. తుపాకీతో హల్‌చల్.. చివరకు....!!??

తెలంగాణ రాష్ట్రంలో ఇతగాడు ఇప్పటికి పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో గతేడాది 15 దొంగతనాలు చేశాడు. దీంతో అంతర్రాష్ట్ర ఘరానా దొంగగా గుర్తించి సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పీడీయాక్టు నమోదు చేశారు. ఇక సదరు దొంగను ఈ ఏడాది మార్చిలో కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. అయినప్పటికీ మారని కేటుగాడు మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్న నేపథ్యంలో నిందితుడిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో సింగిల్ గా, సింపుల్ గా దొంగతనాలు చేసే అశోక్ రావు ఇక కటకటాలు లెక్కించనున్నారు.

English summary
A thief Ashok Rao from Maharashtra was arrested by KPHB police in March this year. However, in the wake of the accused again committing robberies, the PD Act has been filed against the accused by the CP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X